P Venkatesh
తెలంగాణలో పదోతరగతి పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ దీనికి సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించింది. మరి టెన్త్ పరీక్షలు ఏయే తేదీల్లో జరుగనున్నాయంటే?
తెలంగాణలో పదోతరగతి పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ దీనికి సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించింది. మరి టెన్త్ పరీక్షలు ఏయే తేదీల్లో జరుగనున్నాయంటే?
P Venkatesh
ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి అనేది కీలకం. స్టూడెంట్స్ బంగారు భవిష్యత్ కు పునాదిలాంటిది పదోతరగతి. అందుకే తల్లిదండ్రలు, టీచర్లు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. పరీక్షల్లో మంచి మార్కులు సాధించే విధంగా ఉపాధ్యాయులు ప్రత్యేక క్లాసులు తీసుకొని విద్యార్థులను సన్నద్ధం చేస్తుంటారు. ఇక 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన పదోతరగతి పరీక్షలు మార్చిలో నిర్వహించనున్నారు విద్యాశాఖ అధికారులు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ పాఠశాల విద్యాశాఖ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది. మరి టెన్త్ పరీక్షలు ఏయే తేదీల్లో జరుగనున్నాయంటే?
తెలంగాణలో పదోతరగతి చదువుతున్న విద్యార్థులకు అలర్ట్. తాజాగా టెన్త్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. మార్చి 18 2024 తేదీ నుంచి 10 వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ డైరెక్టర్ తెలిపారు. పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
తెలంగాణ విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 18 2024న ఫస్ట్ లాంగ్వేజ్, 19న సెకండ్ లాంగ్వేజ్, 21న థర్డ్ (లాంగ్వేజ్) ఇంగ్లిష్, 23న మ్యాథ్స్, 26న సైన్స్ మొదటి పేపర్, 28న సైన్స్ సెకండ్ పేపర్, 30న సోషల్ స్టడీస్ పరీక్షలు జరుగనున్నాయి. ఇక ఏప్రిల్ 1వ తేదీన ఒకేషనల్ కోర్సువారికి సంస్కృతం, ఆరబిక్ మొదటి పేపర్, ఏప్రిల్ 2న సంస్కృతం, ఆరబిక్ రెండవ పేపర్ పరీక్షలు జరుగుతాయని అధికారులు పేర్కొన్నారు. గతంలో చోటుచేసుకున్న అవకతవకలు మళ్లీ పునరావృతం కాకుండా టెన్త్, ఇంటర్ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని ఇటీవల విద్యాశాఖ సమీక్షలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.