iDreamPost
android-app
ios-app

ఈటల రాజేందర్‌ కాన్వాయ్‌కి ప్రమాదం.. నుజ్జునజ్జయిన కారు

  • Published Sep 04, 2023 | 10:01 AM Updated Updated Sep 04, 2023 | 10:01 AM
  • Published Sep 04, 2023 | 10:01 AMUpdated Sep 04, 2023 | 10:01 AM
ఈటల రాజేందర్‌ కాన్వాయ్‌కి ప్రమాదం.. నుజ్జునజ్జయిన కారు

హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిసున్న కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఈటల కాన్వాయ్‌లోని కారు ముందు భాగం.. ఓ వైపు మొత్తం నుజ్జు నుజ్జు అయ్యింది. అయితే అదృష్టం కొద్ది ఈ ఘటనలో ఈటలకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. దాంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.

ఆదివారం ఈటల.. హుజూబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మానకొండూర్ మండలం లలితాపూర్ వద్ద ఈటల కారుకు అనుకోకుండా గొర్రెల మంద అడ్డు వచ్చింది. గొర్రెలను గమనించి డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయటంతో.. కారు ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో.. కాన్వాయ్‌లో వెనుక నుంచి అదే వేగంతో వచ్చిన మరో కారు.. ఈటల ఉన్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దాంతో ఆ కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది.

ఇక ఈ ప్రమాదంలో ఈటల ప్రయాణిస్తున్న కారు వెనుక భాగం స్వల్పంగా దెబ్బతింది. అయితే అనుకోకుండా చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో.. ఎవ్వరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే కార్యకర్తలు, బీజేపీ నాయకులు ఈటల పరిస్థితి గురించి ఆరా తీశారు. ఆయనకు ఏం కాలేదని తెలిసి నెమ్మదించారు. ఆ తర్వాత మరో వాహనాన్ని తెప్పించుకుని అందులో హైదరాబాద్‌ చేరుకున్నారు ఈటల.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis