iDreamPost
android-app
ios-app

పరమ పవిత్రమైన భద్రాద్రి సీతారామచంద్రుల తలంబ్రాలు ఇంటికి రావాలా? ఇలా చేయండి!

  • Published Apr 01, 2024 | 6:52 PM Updated Updated Apr 01, 2024 | 6:52 PM

భద్రాద్రిలో ఈ నెల అనగా ఏప్రిల్ 17న ఎంతో  అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులకు టీఎస్ఆర్టీసీ కొన్ని ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇక ఆ సీతారామచంద్రుల కల్యాణోత్సవం వేడుకలకు వెళ్లలేని అనే బాధపడుతున్న భక్తుల కోసం ఈ సేవల్ని వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ కోరుతోందన్నారు. ఇంతకి అదేమిటంటే..

భద్రాద్రిలో ఈ నెల అనగా ఏప్రిల్ 17న ఎంతో  అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులకు టీఎస్ఆర్టీసీ కొన్ని ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇక ఆ సీతారామచంద్రుల కల్యాణోత్సవం వేడుకలకు వెళ్లలేని అనే బాధపడుతున్న భక్తుల కోసం ఈ సేవల్ని వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ కోరుతోందన్నారు. ఇంతకి అదేమిటంటే..

  • Published Apr 01, 2024 | 6:52 PMUpdated Apr 01, 2024 | 6:52 PM
పరమ పవిత్రమైన భద్రాద్రి సీతారామచంద్రుల తలంబ్రాలు ఇంటికి రావాలా? ఇలా చేయండి!

ఈ ఏప్రిల్ నెలలో రానున్న శ్రీరామ నవమి సందర్భంగా.. చాలామంది భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు. ఎందుకంటే..ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన ఆ శ్రీరామ చంద్రుని కల్యాణమహోత్సవన్నీ కనులారా చూడాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. కానీ అది అందరికీ సాధ్య పడదు. వివిధ కారణాలతో అక్కడి వెళ్లలేని వారు కొందరైతే.. మరి కొందరూ అక్కడ భక్తుల రద్దీ భారీగా ఉండటంతో వెళ్లిన అంతా మనస్ఫుర్తిగా ఆ స్వామి వారి శుభకార్యన్ని తరించలేమని వెనుకడుగు వేస్తారు. కానీ, అంతా మంచి వేడుకను కనులారా చూడలేమో అని బాధ ప్రతిఒక్కరికి ఉంటుంది. మరి, అలాంటి వారందరికి టీఎస్ఆర్టీసీ వారు ఓ ఆద్భుతమైన సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఎంతో అంగరంగ వైభవంగా జరిగే ఆ  శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ కోరుతోందన్నారు. ఇంతకి అదేమిటంటే..

భద్రాద్రిలో ఈ నెల అనగా ఏప్రిల్ 17న ఎంతో  అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులకు టీఎస్ఆర్టీసీ కొన్ని ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇక ఆ సీతారామచంద్రుల కల్యాణోత్సవం వేడుకలకు వెళ్లలేని అనే బాధపడుతున్న భక్తుల కోసం.. తాజాగా  రాష్ట్రంలోని అన్ని టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్ల ద్వారా తలంబ్రాలను బుక్‌ చేసుకోవచ్చని చెప్పారు. అయితే కల్యాణ వేడుకలకు వెళ్లలేని భక్తులకు ఈ తలంబ్రాలను అందజేయాలని SRTC యాజమాన్యం గతంలో లాగే ఇప్పుడు కూడా  నిర్ణయించింది. ఇక గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో.. రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి మళ్లీ TSRTC శ్రీకారం చుట్టింది.  కాగా, ఎంతో విశిష్టత కలిగిన ఈ తలంబ్రాలు కావలనుకునే భక్తులు TSRTC లాజిస్టిక్స్ సెంటర్లలో రూ.151 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత స్వామివారి కల్యాణం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు TSRTC హోం డెలివరీ చేస్తుంది. ఇక అందుకు సంబంధించి హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లోని.. భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్‌ పోస్టర్‌ను TSRTC వీసీ సజ్జనర్‌ ఆవిష్కరించారు.

అలాగే భక్తిశ్రద్ధలతో, నియమనిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా ఎన్నో ఏళ్లుగా శ్రీరాముని కల్యాణంలో ఉపయోగిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన ఈ తలంబ్రాలను వ్యయప్రయాసలు లేకుండా భక్తుల ఇంటికి చేర్చేందుకు రెండేళ్ల క్రితమే TSRTC యాజమాన్యం ముందుకొచ్చింది. పైగా ఈ ప్రయత్నాంలో భక్తుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలను బుక్‌ చేసుకుంటున్నారు. కాగా, 2022లో దాదాపు 89 వేల మంది భక్తులకు తలంబ్రాలను బుక్ చేసుకోగా.. గత ఏడాది 1.17 లక్షల మంది భక్తులకు తలంబ్రాలను సంస్థ అందజేసింది అని TSRTC ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు.

కాగా, భద్రాద్రిలో ఈ నెల 17న అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ కోరుతోందన్నారు. రాష్ట్రంలోని అన్ని టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో తలంబ్రాలను బుక్‌ చేసుకోవచ్చని చెప్పారు. సంస్థ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని తెలిపారు. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు TSRTC కాల్ సెంటర్ ఫోన్‌ నంబర్లైన 040-23450033, 040-69440000, 040-69440069 ను సంప్రదించాలని సూచించారు. మరి, భద్రాది సీతారాముల తలంబ్రలను నేరుగా భక్తులు అంజేస్తున్న TSRTC  సేవలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet