iDreamPost
android-app
ios-app

Barrelakka Wedding: త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న బర్రెలక్క.. అబ్బాయి ఎవరంటే..!

  • Published Mar 21, 2024 | 4:48 PM Updated Updated Mar 21, 2024 | 4:48 PM

బర్రెలక్క అలియాస్ శిరీషా.. ఈమె పేరు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె గురించి నిత్యం ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతుందనే వార్త బయటకు వచ్చింది.

బర్రెలక్క అలియాస్ శిరీషా.. ఈమె పేరు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె గురించి నిత్యం ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతుందనే వార్త బయటకు వచ్చింది.

  • Published Mar 21, 2024 | 4:48 PMUpdated Mar 21, 2024 | 4:48 PM
Barrelakka Wedding: త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న బర్రెలక్క.. అబ్బాయి ఎవరంటే..!

ప్రస్తుత కాలంలో  సోషల్ మీడియా వినియోగం ఎక్కువగా ఉంది. ఇక దీని ద్వారా వీడియోలు, రీల్స్ చేస్తూ చాలా మంది ఫేమస్ అవుతుంటారు. కొందరు అయితే అనుకోకుండా తీసిన ఒక్క వీడియోతో.. ఓవర్ నైట్ లో ఫేమస్ అవుతుంటారు. అలాంటి వారిలో బర్రెలక్క అలియాస్ శిరీషా ఒక్కరు. ‘హాయ్.. ఫ్రెండ్స్ నేను మీ బర్రెలక్కను’ అంటూ  చేసిన ఒక్క వీడియోతో ఆమె ఫేమస్ అయ్యారు. ఆ తరువాత ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోటీ చేసి..రెండు తెలుగు రాష్ట్రాల్లో మరింత ఫేమస్ అయ్యారు. ఆమెకు సంబంధించిన వార్తలు తరచూ వస్తున్నాయి. తాజాగా బర్రెలక్క గురించి మరోవార్త వచ్చింది. త్వరలో బర్రెలక్క పెళ్లి చేసుకోబోతుందట. మరి.. అబ్బాయి ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

బర్రెలక్క అలియాస్ శిరీషా గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గతంలో తెలంగాణలోని నిరుద్యోగంపై సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఒక్క వీడియోతో బర్రెలక్క ఓవర్ నైట స్టార్ అయ్యింది. ఇక అనంతరం గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజవర్గ నుంచి ఆమె పోటీ చేసింది. ఆ ఎన్నికల సమయంలో బర్రెలక్కకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఆ ఎన్నికల్లో గెలవకపోయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా నిలిచింది. అయితే ఆ ఎన్నికల్లో 5 వేల పై చిలుకు ఓట్లను బర్రెలక్క సాధించింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తాను పోటీ చేస్తాని ఆమె తెలిపారు.

Barrelakka

ఇక బర్రెలక్క గురించి తరచూ అనేక వార్తలు వినిపిస్తోన్నాయి. ఆమెకు బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ తో పెళ్లి అంటూ టాక్ వినిపించింది.  ఆ వార్త తెగ వైరల్ కావడంతో స్వయంగా బర్రెలక్కే స్పందించి.. అలాంటిది ఏమి లేదని తెలిపింది.  అయితే తాజాగా తన పెళ్లి గురించి బర్రెలక్క ఓ వార్త చెప్పింది. తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమె తెలిపారు. ఇక పెళ్లి కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలానే పెళ్లి కోసం చేసిన షాపింగ్ ఫోటోలను కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

పెళ్లి మ్యాటర్ చెప్పిన ఆమె.. కాబోయే భర్త గురించి మాత్రం రివిల్ చేయలేదు. బర్రెలక్కకు గతంలో పెళ్లి జరగ్గా..పలు కారణాలతో అతడి నుంచి విడిపోయింది. ఇప్పుడు ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుంది. గతంలో జరిగిన అనుభవాల కారణంగా కాబోయే భర్త గురించి బర్రెలక్క చెప్పడం లేదని పలువురు అభిప్రాయా పడుతున్నారు. మొత్తంగా త్వరలో బర్రెలక్క పెళ్లిపీటల ఎక్కబోతుండటంతో ఆమె అభిమానులు సంతోష పడుతున్నారు. ఇదే సమయంలో బర్రెలక్కకు కాబోయే భర్త ఎవరా అనే ఆసక్తితో ఉన్నారు. అతడు ఎవరో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom