iDreamPost
android-app
ios-app

వీడియో: పెళ్లిపీటలపై ముద్దుపెట్టగానే బర్రెలక్క రియాక్షన్ చూడండి!

  • Published Mar 28, 2024 | 12:52 PM Updated Updated Mar 28, 2024 | 12:52 PM

Barrelakka: సోషల్ మీడియాలో అందరిలానే ఇన్‌ఫ్లుయన్సర్‌గా పరిచయం అయ్యి.. తెలంగాణ ఎన్నికల సమయంలో మరింత ఫేమస్ అయిన బర్రెల్లక్క పెళ్లి పీటలు ఎక్కింది. ఈ క్రమంలోనే వరుడు ముద్దు పెట్టగానే బర్రెలక్క ఇచ్చిన రియాక్షన్ కి అందరు షాకయ్యారు.

Barrelakka: సోషల్ మీడియాలో అందరిలానే ఇన్‌ఫ్లుయన్సర్‌గా పరిచయం అయ్యి.. తెలంగాణ ఎన్నికల సమయంలో మరింత ఫేమస్ అయిన బర్రెల్లక్క పెళ్లి పీటలు ఎక్కింది. ఈ క్రమంలోనే వరుడు ముద్దు పెట్టగానే బర్రెలక్క ఇచ్చిన రియాక్షన్ కి అందరు షాకయ్యారు.

  • Published Mar 28, 2024 | 12:52 PMUpdated Mar 28, 2024 | 12:52 PM
వీడియో: పెళ్లిపీటలపై ముద్దుపెట్టగానే బర్రెలక్క రియాక్షన్ చూడండి!

సోషల్ మీడియాను వాడుకుని ఎంతో మంది ఫేమస్ అవుతున్నారు. కొందరు చాలా రోజులకు  ఫేమస్  అవ్వగ్గా మరికొందరు మాత్రం చాలా విచిత్రంగా ఓవర్ నైట లోనే స్టార్ డమ్ సంపాదిస్తారు. అలాంటి వారిలో బర్రెలక్క.. అలియాస్ శిరీషా ఒకరు. నిరుద్యోగం చేసిన ఓ వీడియో సోషల్ మీడియానే షేక్ చేసింది. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయర్ గా మారిపోయింది ఈ బర్రెలక్క. అనంతరం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి..రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె గుర్తింపు పొందింది. ప్రస్తుతం బర్రెలక్క వివాహం వేడుక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వేడుకలో వరుడు బర్రెలక్కకు ముద్దు పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన బర్రెలక్క.. అలియాస్ శిరీషా నిరుద్యోగంపై చేసిన వీడియో అప్పట్లో సంచలనంగా మారింది. అనంతరం ఆమె అనేక కేసును ఎదుర్కొన్నారు. ఆ క్రమంలోనే గతేడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ ఎన్నికల్లో ఆమె విజయం సాధించనప్పటికీ మంచి గుర్తింపు పొందారు. ఆమె ఓడిపోయినా కూడా ఎంతో మంది యువతలో స్ఫూర్తిని నింపింది. తానూ ఓడిపోయినా పర్వాలేదు తన పోటీ .. కేవలం యువతను మేల్కొపేందుకు మాత్రమే అంటూ.. అని కూడా ఆ సమయంలో బర్రెలక్క చెప్పుకొచ్చింది.

ఇక బర్రెలక్క విషయానికొస్తే.. ఆమె తల్లి రోజు కూలీ, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, తండ్రి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వలన .. శిరీష తల్లీకి సాయంగా ఉంటూ ఓపెన్‌ డిగ్రీ చేసినట్లు గతంలో ఓసారి చెప్పుకొచ్చింది. అలానే తరచూ ఆమె వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె పెళ్లి వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వెంకటేశ్ అనే యువకుడిని బర్రెలక్క పెళ్లి చేసుకున్నారు.  వీరి పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. వారి ఎంగెజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ షూట్  అద్భుతంగా జరిగాయి. ఇక ఫ్రీ వెడ్డింగ్ షూట్ అయితే  సినిమా షూటింగ్  ఏ మాత్రం  తీసిపోని విధంగా ఉంది.

తాజాగా ఇక బర్రెలక్క పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఆమె ఎంతో అందగా ముస్తాబై పెళ్లి పీటలపై కూర్చుకుంది. ఇక మంగళవాయిద్యాల నడము వారి పెళ్లి ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్యలో బంధువులు, స్నేహితులు ఈపెళ్లికి హాజరయ్యారు. ఇక పెళ్లి మండపంలో  తన భర్త ముద్దు పెట్టగానే బర్రెలక్క ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది. అలానే బర్రెలక్కు ఆమె భర్త స్వయంగా కాలికి మెట్టెలు తొడిగారు. ఇలా బంధువుల సమక్షంలో బర్రెలక్క కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం బర్రెలక్క  పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet