iDreamPost
android-app
ios-app

నా భర్తంటే నాకు ద్వేషం.. తనని అన్నా అని పిలిచాను: బర్రెలక్క

  • Published Apr 28, 2024 | 6:16 PM Updated Updated Apr 28, 2024 | 6:16 PM

Barrelakka Sirisha: బర్రెలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని రోజుల క్రితం బర్రెలక్క, వెంకటేష్ అనే యువకుడిని పెళ్లి చేసుకున్న సంగతి మనకి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన భర్త గురించి ఆసక్తికరమై విషయాలను షేర్ చేసుకుంది.

Barrelakka Sirisha: బర్రెలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని రోజుల క్రితం బర్రెలక్క, వెంకటేష్ అనే యువకుడిని పెళ్లి చేసుకున్న సంగతి మనకి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన భర్త గురించి ఆసక్తికరమై విషయాలను షేర్ చేసుకుంది.

  • Published Apr 28, 2024 | 6:16 PMUpdated Apr 28, 2024 | 6:16 PM
నా భర్తంటే నాకు ద్వేషం.. తనని అన్నా అని పిలిచాను: బర్రెలక్క

బర్రెలక్క .. ఈ పేరు గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కారణం.. కేవలం ఒక్కేఒక్క వీడియో ఓవర్ నైట్ స్టార్ అయింది ఈ బర్రెలక్క. అలానే గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి..రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, ముఖ్యంగా యువత దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఇటీవలే వెంకటేష్ అనే యువకుడిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ వివాహనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఇక తాజాగా తన భర్తకు సంబంధించి ఆసక్తిక విషయాలను ఓ ఇంటర్వ్యూల్లో షేర్ చేసుకుంది. మరి… ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

బర్రెలక్క అలియాస్ శిరీషా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయినా ఓ సామాన్యురాలు. నిరుద్యోగంపై ఆమె చేసిన ఓ వీడియో..తనను ఓవర్ నైట్ స్టార్ చేసింది. అలానే తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొల్హాపూర్ నుంచి పోటీ చేసి.. మరోసారి వార్తల్లో నిలిచారు. ఆ ఎన్నికల సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆమె వైపు చూశారు. అయితే కేవలం 5 పై చిలుకు ఓట్లను మాత్రమే పొందింది. అనంతరం ఫ్యామిలీ ఇష్యూస్, ఇతర అంశాలతో తరచూ వార్తల్లో నిలిచింది. అలానే కొన్ని రోజుల క్రితం బర్రెలక్క, వెంకటేష్ అనే యువకుడిని పెళ్లి చేసుకున్న సంగతి మనకి తెలిసిందే. తన పెళ్లి విషయంపై ఎమోషనలవుతూ బర్రెలక్క గతంలో వీడియో చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పెళ్లి తర్వాత బర్రెలక్క జంట ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆసక్తికర విషయాలను చెప్పింది.

ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్న వెంకటేష్ ను పెళ్లికంటే ముందు ఏమని పిలిచే వాళ్లు యాంకర్ అడిగింది. ఆ ప్రశ్నకు బర్రెలక్క అదిరిపోయే సమాధానం ఇచ్చింది. ఎలక్షన్ ముందు వరకు వెంకటేష్ ను అన్న అని పిలిచిందానని, ఇప్పుడు పెళ్లి అయింది కాబట్టి అలా పిలవడం మానేశానని తెలిపింది. ఇదే సమయంలో వాళ్ళ ప్రేమ ఎలా మొదలయ్యిందో కూడా తెలిపింది. మొదట్లో వెంకటేష్ అంటే అసలు నచ్చేవాడు కాదని చెప్పింది. ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టి డిలేట్ చేసేవాడని, ఇలా ఒకసారి కాదు చాలా సార్లు ఇలాగే చేసాడని, అప్పుడంటే ఆయనంటే ద్వేషం మొదలైందని తెలిపింది. కానీ చివరికి ఆయననే పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని బర్రెలక్క చెప్పుకొచ్చింది. మరి.. బర్రెలక్క తన భర్త గురించి చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetewin girişgrandpashabet