iDreamPost
android-app
ios-app

Barrelakka: రైతు బిడ్డతో పెళ్లిపై బర్రెలక్క క్లారిటీ

  • Published Feb 02, 2024 | 11:34 AM Updated Updated Feb 02, 2024 | 11:34 AM

పల్లవి ప్రశాంత్‌తో బర్రెలక్క పెళ్లి అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా దీనిపై ఆమె స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేసింది. ఆవివరాలు..

పల్లవి ప్రశాంత్‌తో బర్రెలక్క పెళ్లి అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా దీనిపై ఆమె స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేసింది. ఆవివరాలు..

  • Published Feb 02, 2024 | 11:34 AMUpdated Feb 02, 2024 | 11:34 AM
Barrelakka: రైతు బిడ్డతో పెళ్లిపై బర్రెలక్క క్లారిటీ

బర్రెలక్క అలియాస్‌ శిరీష, రైతుబిడ్డగా గుర్తింపు పొందిన పల్లవి ప్రశాంత్‌.. వీరద్దరూ పేర్లు.. కొన్నాళ్లపాటు మీడియా, సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. రైతుబిడ్డ అలియాస్‌ పల్లవి ప్రశాంత్‌.. కామన్‌ మ్యాన్‌గా బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. సెలబ్రిటీలను వెనక్కి నెట్టి.. టైటిల్‌ విన్నర్‌గా నిలిచి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అయితే బిగ్‌బాస్‌ ఫైనల్‌ ఎపిసోడ్‌ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల కారణంగా.. జైలు పాలయ్యాడు.

ఇక బర్రెలక్క విషయానికి వస్తే.. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. నిరుద్యోగుల తరఫున తన గళాన్ని వినిపించడం కోసం.. ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఓట్లు అయితే రాలేదు.. కానీ అందరి దృష్టిని ఆకర్షించి భారీ ఎత్తున మద్దతు సంపాదించుకుంది. ఇలా వీరద్దరూ వేర్వేరు రంగాల్లో పాపులారిటీ సంపాదించుకుని ఫేమస్‌ అయ్యారు. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. కొన్ని రోజుల నుంచి బర్రెలక్కకు, రైతు బిడ్డకు పెళ్లి అంటూ ప్రచారం జరుగుతుంది.

barrelakka clarity on her marriage

అసలు ఈ ప్రచారం ఎందుకు మొదలయ్యిందో ఎవరికి అర్థం కాలేదు. పోని బర్రెలక్క, పల్లవి ప్రశాంత్‌ ఇద్దరూ ఏమైనా చుట్టాలా అంటే కాదు. కానీ కొందరు మూర్ఖులు మాత్రం.. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం మొదలు పెట్టారు. ఇంకొందరైతే ఓ అడుగు ముందుకేసి.. వీరిద్దరికి పెళ్లి అయిపోయింది అంటూ మార్ఫింగ్‌ ఫొటోలను పోస్ట్‌ చేశారు. ఇవి తెగ వైరల్‌ అయ్యాయి.

అయితే తాజాగా బర్రెలక్క ఈ వ్యవహారంపై స్పందించింది. రైతుబిడ్డతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను బిగ్‌బాస్‌ షో అసలు చూడను. అయితే ఏడో సీజన్‌లో ఒక రైతుబిడ్డ కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి వెళ్లాడని తెలిసి.. ముందు 2, 3 ఎపిసోడ్‌లు చూశాను. ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేన్‌ రావడంతో.. ఎమ్మెల్యేగా పోటీ చేసే హడావుడిలో ఉన్నాను. ఇక ఆ తర్వాత బిగ్‌బాస్‌ అస్సలు చూడలేదు. మళ్లీ ఫైనల్‌ ఎపిసోడ్‌ మాత్రమే చూశాను. కనీసం పల్లవి ప్రశాంత్‌కు ఎప్పుడూ ఫోన్‌ కూడా చేయలేదు. అలాంటిది నాకు తెలియకుండానే పల్లవి ప్రశాంత్‌ అన్నతో పెళ్లి చేశారు. మా వివాహానికి పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా వచ్చారట. నాకు ఆ వివరాలేవి తెలియదు’’ అని చెప్పుకొచ్చింది.

‘‘నా పెళ్లి వార్తలు, ఫొటోలు చూస్తే.. వ్యూస్‌ కోసం మరీ ఇంతకు తెగిస్తారా.. ఎవరి ఇజ్జత్‌ పోయినా మీకు అవసరం లేదా.. మీరు చేసే పనుల వల్ల ఎవరు మట్టిలో కలిసిపోయినా పట్టించుకోరా.. మీకు వ్యూస్‌ కావాలి.. అంతే. దాని కోసం మాకు పెళ్లైనట్లు ఫొటోలు మార్ఫింగ్‌ చేసి మరీ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. చాలా వీడియోల్లో నేను పల్లవి ప్రశాంత్‌ను అన్న అని పిలిచాను. అలాంటిది అతడితో నాకు పెళ్లైనట్లు ప్రచారం చేస్తారా.. ఎవరైనా అన్నను పెళ్లి చేసుకుంటారా.. మరి ఇంత దిగజారాలా’’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది శిరిష.

ఇది కూడా చదవండి:

అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మూవీ రివ్యూ!

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş