iDreamPost
android-app
ios-app

Barrelakka: కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నాను.. ఎవరు బ్యాడ్ కామెంట్స్ చేయకండి: బర్రెలక్క

  • Published Mar 25, 2024 | 8:57 PM Updated Updated Mar 25, 2024 | 8:57 PM

తెలంగాణ రాజకీయాల్లో సెన్సేషనల్ గా మారిన బర్రెలక్క అలియాస్ శిరీష మరికొన్నిరోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఈ సందర్భంగా తన పెళ్లికి సంబంధించిన ఒక్కో వీడియోను రిలీజ్ చేస్తోంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

తెలంగాణ రాజకీయాల్లో సెన్సేషనల్ గా మారిన బర్రెలక్క అలియాస్ శిరీష మరికొన్నిరోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఈ సందర్భంగా తన పెళ్లికి సంబంధించిన ఒక్కో వీడియోను రిలీజ్ చేస్తోంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

  • Published Mar 25, 2024 | 8:57 PMUpdated Mar 25, 2024 | 8:57 PM
Barrelakka: కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నాను.. ఎవరు బ్యాడ్ కామెంట్స్ చేయకండి: బర్రెలక్క

బర్రెలక్క గురించి రెండు తెలుగు రాష్ట్రాలకు పెద్దగా పరిచయం చేయక్కర్లేదు. ఒక్క డైలాగ్ తో బర్రెలక్క.. అలియాస్ శిరీషను ఓవర్ నైట్ స్టార్ అయింది. ఎంత చదివినా నోటిఫికేషన్లు లేవు ఫ్రెండ్స్.. అందుకే బర్రెలు కాస్తున్నా అంటూ చెప్పిన డైలాగ్ ఆమెను  ఫేమస్ చేసింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన శిరీష.. తెలంగాణ రాజకీయాల్లో ఓ ప్రభంజనం. గత ఏడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఒక్క సారి వార్తల్లో నిలిచింది. గెలుపు ఓటములు పక్కన పెడితే ఆమె ధైర్యానికి, స్థైర్యానికి ఫిదా అయిపోయారు యువత.. తాజాగా బర్రెలక్క త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది.

బర్రెలక్క త్వరలో కొత్త జీవితంలోకి అడుగు పెట్టనుంది. ఇప్పటికే ఆమె పెళ్లికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో కొందరు ఆమెకు విషెష్ చెబుతుంటే.. మరికొందరు మాత్రం నెగిటీవ్ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి వారికి బర్రెలక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తనపై బ్యాడ్ కామెంట్స్ చేయోద్దొంటూ విజ్ఞప్తి చేసింది.

ఇక బర్రెలక్క మాట్లాడుతూ..” నా గతం గురించి ఎవరు మాట్లాకండి. నా గురించి బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. ఎన్నో పెళ్లి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలా నన్ను అంటే మీకు ఏం వస్తాది చెప్పండి. నా గతం గురించి మీ ఎవరికి తెలియదు. నేను చెప్పాదల్చుకోలేదు కూడా. నేను ఎన్ని బాధలు పడ్డానో మీకు తెలియదు.  నన్ను చేసుకోబోయే అబ్బాయికి, వాళ్ల ఫ్యామిలీకి కూడా నా గతం గురించి తెలుసుకోవాలనే ఇంట్రస్ట్ లేదు. మా తమ్ముడు వచ్చి.. నాపై బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయని చెబితే ఎంతో బాధ పడ్డాను. నా జీవితం గురించి మీకేందుకు అన్న అంత ఆసక్తి. చెడు కామెంట్స్ చేయడం మానేసి.. మంచి కామెంట్స్ చేయండి. ఇంకా నాకు మీ ఆశీర్వాదాలు ఇవ్వండి. నా పెళ్లి కార్డు ఇన్ స్టాగ్రామ్ లో పెట్టాను. అందరూ పెళ్లికి తప్పకుండా రండి.

అక్కడి వచ్చి మా దంపతులకు మీ బ్లెసింగ్స్ ఇవ్వండి పెళ్లికి రాలేని వాళ్లు.. నా ఇన్ స్టాగ్రామ్, సోషల్ మీడియాలో మీ ఆశీర్వాదాలను కామెంట్స్ చేయండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెల్లమ్మ అంటూ కామెంట్స్ పెట్టండి. ఇక నా కొత్త  జీవితాన్ని ఊహించుకుంటే భయమేస్తుంది. నా పుట్టింట్లో, మా అమ్మ దగ్గర ఉన్నట్లు ఉంటుందో లేదో తెలియదు. అత్తగారు కూడా నన్ను కన్నకూతురిలా చూసుకుంటుందని అనుకుంటున్నారు. మనం ఉదయాన్నే ఎన్నిగంటలకు లేచిన అమ్మ ఏమనదు. అయితే కొత్త కుటుంబంలో అలా కుదరుతు. ఎంతనకున్నా అమ్మ గ్రేట్.  మరోసా చెబుతున్నాను అన్న.. దయచేసి ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు” అంటూ బర్రెలక్క ఎమోషనల్ గా మాట్లాడింది. ప్రస్తుతం ఆమె వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి..బర్రెలక్క వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio