iDreamPost
android-app
ios-app

Barrelakka: పెళ్లికి ముందు బర్రెలక్క వారందరికీ వార్నింగ్

  • Published Mar 27, 2024 | 5:18 PM Updated Updated Mar 27, 2024 | 5:18 PM

బర్రెలక్క అలియాస్ శిరీషక్క మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. తన పెళ్లికి సంబంధించి వరుసగా వీడియోలు అప్లోడ్ చేస్తూ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఇప్పుడు వారికి మాస్ వార్నింగ్ ఇచ్చింది.

బర్రెలక్క అలియాస్ శిరీషక్క మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. తన పెళ్లికి సంబంధించి వరుసగా వీడియోలు అప్లోడ్ చేస్తూ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఇప్పుడు వారికి మాస్ వార్నింగ్ ఇచ్చింది.

  • Published Mar 27, 2024 | 5:18 PMUpdated Mar 27, 2024 | 5:18 PM
Barrelakka: పెళ్లికి ముందు బర్రెలక్క వారందరికీ వార్నింగ్

తెలంగాణలో నిరుపేద ఇంట్లో పుట్టిన బర్రెలక్క అలియాస్ శిరీషను ఓవర్ నైట్ ఫేమస్ చేసింది సోషల్ మీడియా. ‘బర్రెలు కాయడానికి వచ్చినా ఫ్రెండ్స్. ఎంత చదివినా డిగ్రీలు వస్తాయి తప్ప.. నోటిఫికేషన్లు పడవు. అందుకే బర్రెలు కాస్తున్నా’ అంటూ వీడియో చేసి సెన్సేషనల్ క్రియేట్ చేసింది.ఆ వీడియోతో శిరీష కాస్త బర్రెలక్కగా మారిపోయింది. సోషల్ మీడియాలో వీడియోలు చేసుకుంటూ ఫేమ్ తెచ్చుకున్న శిరీష పేరు తెలుగు రాష్ట్రాల్లో మారు మోగిపోయేలా చేసింది మాత్రం ఆమె నిర్ణయమే. యువత తరుఫున వకాల్తా పుచ్చుకుని తన గళాన్ని వినిపించేందుకు ముందుకు వచ్చింది. గత ఏడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజక వర్గం నుండి పోటీకి దిగి రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

బెదిరింపులు వచ్చినా మీడియాకు చెప్పి బాధపడిందే తప్ప వెనకడుగు వేయలేదు. పోరాడి ఓడిపోయినా.. ఎంతో మంది మనస్సులను గెలుచుకుంది శిరీష. అదే ఆత్మ స్థైర్యంతో మరో మెట్టుకు రంగం సిద్ధం చేసుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పింది. అంతలో జీవితంలోనే కీలక నిర్ణయం తీసుకుంది. బర్రెలక్క ప్రస్తుతం కొత్త జీవితంలో అడుగుపెట్టబోతుంది. శిరీష్ ఈ నెల 28న వెంకటేష్ అనే యువకుడితో ఏడడుగులు వేయబోతుంది. నాగర్ కర్నూల్ వాసి వెంకటేష్‌ను మనువాడబోతుంది. ఈ పెళ్లి ఎనౌన్స్‌తో మరో సారి ట్రెండింగ్‌లో నిలుస్తోంది బర్రెలక్క. తొలుత కాబోయే హస్బెండ్ ఫేస్ రివీల్ చేయకుండా వచ్చిన శిరీష.. మెల్లిగా ఎంగేజ్ మెంట్, ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ వీడియోలు తన యూట్యూబ్ ఛానల్లో షేర్ చేసింది.

ఇక ప్రీ వెడ్డింగ్ కోసం స్పెషల్ సాంగ్ క్రియేట్ చేసుకున్న సంగతి విదితమే. ‘ఓ శిరీష.. నా శిరీష’ అంటూ సాగిపోయే ఈ ప్రత్యేకమైన సాంగ్‌ను ‘అనిత..నా అనిత’ సింగర్ నాగరాజు పాడారు. అయితే కొంత మంది అత్యుత్సాహ వంతులు .. ఈ ప్రీ వెడ్డింగ్ సాంగ్‌ను డౌన్ లోడ్ చేసి..తమ యూట్యూబ్ ఛానల్స్‌లో అప్ లోడ్ చేశారు. ఇది బర్రెలక్క దృష్టికి వెళ్లడంతో యూట్యూబర్లపై సీరియస్ అవ్వడంతో పాటు వార్నింగ్ ఇచ్చింది. వార్నింగ్ ఇచ్చిన వీడియో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.

‘హాయ్ అండీ అందరికీ..నా ప్రీ వెడ్డింగ్ వీడియో రిలీజ్ చేశా. చాలా మంది యూట్యూబర్లు..ఆ సాంగ్ డౌన్ లోడ్ చేసి వాళ్ల యూట్యూబ్ ఛానల్స్‌లో పెట్టుకుంటున్నారు. నేను 100 శాతం స్ట్రైక్ వేస్తా. ఎందుకంటే మేం స్పెషల్‌గా రాయించుకున్నసాంగ్ ఇది. ఇంతకు ముందు ఎలక్షన్ టైం అంటే ఓకే కానీ, అప్లోడ్ చేసుకున్నా ఏం అనుకోలేదు. తర్వాత క్లైయిమ్స్ పడ్డాయి, కాపీ రైట్స్ పడ్డాయి నాకు సంబంధం లేదు. ఈ సాంగ్ నేను రాయించుకున్నా.. ఎవరు అప్లోడ్ చేసుకున్నా.. నేను స్ట్రైక్ వేస్తా.క్లెయిమ్ చేస్తా. తర్వాత ఏంటి అక్కా ఇలా చేశావని బాధపడొద్దు. లైఫ్ లాంగ్ గుర్తుండేలా.. నా ఛానెల్లో మాత్రమే ఉండేలా ఈ పాట క్రియేట్ చేయించుకున్నా’ అంటూ వార్నింగ్ ఇచ్చింది బర్రెలక్క

 

View this post on Instagram

 

A post shared by Siri baby 2428 (@siribaby2428)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio