iDreamPost
android-app
ios-app

అయ్యప్ప భక్తుడిని ఢీ కొట్టిన బైరి నరేష్ కారు?

  • Published Jan 01, 2024 | 3:53 PM Updated Updated Jan 01, 2024 | 4:15 PM

Bairi Naresh: నాస్తికుడు అయినా బైరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరచూ హిందూ దేవుళ్లపై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన కారు ఓ అయ్యప్ప భక్తుడిని ఢీకొట్టింది.

Bairi Naresh: నాస్తికుడు అయినా బైరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరచూ హిందూ దేవుళ్లపై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన కారు ఓ అయ్యప్ప భక్తుడిని ఢీకొట్టింది.

  • Published Jan 01, 2024 | 3:53 PMUpdated Jan 01, 2024 | 4:15 PM
అయ్యప్ప భక్తుడిని ఢీ కొట్టిన బైరి నరేష్ కారు?

ములుగు జిల్లా ఏటూరు నాగారంలో నాస్తికుడు బైరి నరేష్ వీరంగం సృష్టించాడు. ఏటూరు నాగారంలో భీంరావ్ కోరేగావ్ సమావేశానికి బైరి నరేష్ వెళ్లారు. ఈ క్రమంలోనే అక్కడ కారుతో అయ్యప్ప భక్తుడిని నరేష్ ఢీ కొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో అయ్యప్ప స్వామి భక్తుడు పోగు నర్సింహరావుకు గాయాలయ్యాయి. దీంతో అక్కడే ఉన్న అయ్యప్ప భక్తులు నరేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడి కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ప్రమాద ఘటనలో నరేష్ కారులో ఉన్నాడు కానీ.. డ్రైవింగ్ మరొకరు చేశారని సమాచారం.

సోమవారం ఏటూరు నాగారంలో ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో బైరి నరేష్ పాల్గొన్నారు. దేవుడు లేడు అనే అంశంపై అక్కడ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. అలానే ఈ రోజుతో కొత్త ఏడాది ప్రారంభం కావడంతో పూజలు నిర్వహించేందుకు అయ్యప్ప భక్తులు  కూడా ఆ ప్రాంతానికి వచ్చారు. ఇదే సమయంలో దేవుడు లేడు అంటూ బైరి నరేష్ నిర్వహిస్తున్న సమావేశం గురించి అయ్యప్ప భక్తులకు తెలిసింది. అతడి వద్దకు చేరుకున్న అయ్యప్ప భక్తులు నరేష్ తో మాట్లాడారు. అనవసరంగా భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా మాట్లాడవద్దు అంటూ బైరి నరేష్ ను అయ్యప్ప భక్తులు రిక్వెస్ట్ చేశారు.

నాస్తికుడు బైరి నరేష్ కి, అయ్యప్ప స్వాము భక్తుల మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరుకుంది. అదే సమయంలో నరేష్.. అవేమి పట్టించుకోకుండా.. డ్రైవర్ తో కలిసి కారులో ఎక్కి..అయ్యప్ప భక్తుల వైపు వెళ్లాడు. ఈ క్రమంలో అయ్యప్ప భక్తులను ఢీకొట్టడంతో పోగు నరసింహా రావు అనే భక్తుడికి కాలు విరిగింది. మరికొందరికి కూడా స్వల్ప గాయాలయ్యాయి.  వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.  దాదాపు 200 మంది  అయ్యప్ప భక్తులు ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేశారు.

ఈ ఘటనతో అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బైరి నరేష్ ను వెంటనే అరెస్టు చేయాలంటూ భక్తులు రోడ్డుపై బైఠాయించి కూర్చుకున్నారు. నరేష్ ను శిక్షించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగ్గారు. బైరి నరేష్ ను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అయ్యప్ప స్వామి భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నాగారంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అలానే ఈ ఘటనపై అయ్యప్ప భక్తులు పోలీసులకు సమాచారం అందించారు. తమ మనోభావాలను దెబ్బతీసేలా నరేష్ మాట్లాడుతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాక అయ్యప్ప భక్తులు బైరి నరేష్ కారును కూడా వెంబడించారు.

ఈ నేపథ్యంలో మంగంపేట వద్ద ఆయన కారు కూడా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పోలీసులు కూడా అయ్యప్ప భక్తులు ఇచ్చిన కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. బైరి నరేష్ కోసం గాలిస్తున్నారు. గతంలోనూ బైరి నరేష్ ఇలానే దేవుళ్లపై, అయ్యప్ప స్వామిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలా తరచూ హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ..  బైరి నరేష్ వార్తల్లో నిలవాలని చూస్తున్నాడని కొందరు అభిప్రాయ పడుతున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabet girişHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetWojobetjojobetjojobetcasibomberlinbetjojobetcasibomcasibom girişchild pornjojobetcasibomJojobetbetciojojobet girişjojobet girişcasibomcasibombetistbetciobetcio