లారీ డ్రైవర్లుగా మారి.. ACB అధికారుల సీక్రెట్ ఆపరేషన్! సీన్‌కట్‌ చేస్తే..

ACB Officers In Lorry Driver Getup: తెలంగాణ రాష్ట్రా వ్యాప్తంగా ఆర్టీఏ ఆఫీసులపై ఏసీబీ సోదాలు చేపట్టింది. అలానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏసీబీ అధికారులు లారీ డ్రైవర్లుగా మారారు. చివరకు సీన్ కట్ చేస్తే.. అందరికి షాకయ్యే ఘటన చోటుచేసుకుంది.

ACB Officers In Lorry Driver Getup: తెలంగాణ రాష్ట్రా వ్యాప్తంగా ఆర్టీఏ ఆఫీసులపై ఏసీబీ సోదాలు చేపట్టింది. అలానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏసీబీ అధికారులు లారీ డ్రైవర్లుగా మారారు. చివరకు సీన్ కట్ చేస్తే.. అందరికి షాకయ్యే ఘటన చోటుచేసుకుంది.

ప్రస్తుత సమాజాన్ని పీడిస్తున్న వాటిల్లో అవినీతి ఒకటి. ముఖ్యంగా ప్రభుత్వ శాఖాలైన పోలీసు, రెవ్వెన్యూ ల్లో ఎక్కువ అవినీతి ఉందని పలువురు అభిప్రాయా పడుతుంటారు. అయితే కేవలం ఆ రెండు శాఖల్లోనే కాకుండా వివిధ శాఖలో కొందరు తమ చేతివాటాన్ని చూపిస్తుంటారు. ప్రతి పనికి లంచం అడుగుతూ సామాన్యులను జలగళ్లా పట్టి పీడిస్తున్నారు. ఇక ఇలాంటి అవినీతి అధికారుల భరతం పట్టేందుకు అవినీతి నిరోధక శాఖ(ఏసీపీ) తరచూ దాడులు చేస్తుంది. తాజాగా అయితే వినూత్నంగా ఏసీపీ అధికారులు తనిఖీలు చేశారు. డ్రైవర్లుగా మారి..సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి..ఓ ప్రాంతంలో ఆర్టీఏ అధికారులు చేస్తున్న అవినీతిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మరి.. ఎక్కడ, ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. జరిగిన అవినీతి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

తెలంగాణలో ప్రభుత్వ అధికారులకు ఏసీబీ ఆఫీసర్లు చుక్కలు చూపిస్తున్నారు. లంచం తీసుకుంటున్నారు అనే ఫిర్యాదు వస్తే చాలు.. స్థాయితో సంబందం లేకుండా ఎలాంటి అధికారినైనా3 పట్టుకుంటున్నారు. ఉన్నత స్థాయి అధికారులు లంచాలతో కోట్లు రూపాయలు వెనకేసినా పట్టుకుంటున్నారు. ప్రజలకు సేవలు చేయాల్సిన అధికారులు అవినీతికి పాల్పడుతుంటే వదిలి పెట్టడం లేదు. ఎంత అనేది కాదు.. లంచం అనే మాట వినిపిస్తే దూకుడుగా వెళ్లి అవినీతి పరుల్ని పట్టుకుంటున్నారు. తాజాగా తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు.

అలానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఏపీ, తెలంగాణ సరిహద్దులో ఉండే ఆర్టీఏ చెక్ పోస్టుపై తనిఖీలు చేశారు. లారీ డ్రైవర్లుగా వెళ్లిన ఏసీపీ అధికారులు.. అక్కడ లంచం తీసుకుంటున్న అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఖమ్మం ఏసీబీ డీసీపీ వై రమేశ్ నేతృత్వంలోని బృందం ఈ దాడులు నిర్వహించింది. లారీ డ్రైవర్లుగా వెళ్లిన ఏసీబీ అధికారులను కూడా అనధికారికంగా రూ.100 డిమాండ్ చేశారు. అలా మొత్తంగా ఒక్కొక్క వాహనం నుంచి 100 రూపాయలు లంచం తీసుకుంటున్నట్లు గుర్తించారు.  ఇక 14 టైర్లు, 16టైర్లకు, 18 టైర్లు.. ఇలా వాహనం బట్టి డబ్బులను వెయ్యివరకు డిమాండ్ చేసేవారని ఏసీబీ అధికారులు గుర్తించారు. రూ.35 వేల సొమ్మును ఏసీబీ అధికారు స్వాధీనం చేసుకున్నారు.

 వినూత్న రీతిలో ఏసీబీ అధికారలు అవినీతి భాగోతాన్ని  బయటపెడుతుడటంపై ప్రజలు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. ఠాగూర్ సినిమాలో అవినీతిపై పోరాటం జరిగినట్లు ప్రస్తుతం తెలంగాణలో అన్ని శాఖల్లో ఉన్న అవినీతిని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్మూలించే దిశగా అడుగు వేస్తుందని పలువురు అభిప్రాయా పడుతున్నారు. ప్రస్తుతం లారీ డ్రైవర్లుగా వెళ్లి..ఆర్టీఏ అధికారులో అవినీతి భాగోతాన్ని బయటపెడ్డటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి.. ఈ ఏసీబీ అధికారులు చేసిన ఈ  వినూత్న దాడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments