iDreamPost
android-app
ios-app

మహిళా కండక్టర్‌పై ప్రయాణీకురాలు బూతులు

  • Published Mar 06, 2024 | 3:44 PM Updated Updated Mar 06, 2024 | 3:44 PM

తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన నాటి నుండి బస్సులన్నీ కిక్కిరిసి పోతున్నాయి. ఇదే సమయంలో సీట్ల కోసం కొట్లాడుకుంటున్నారు మహిళలు. జుట్లు జుట్లు పట్టుకుని తన్నుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడో వీడియో వైరల్ అవుతుంది.

తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన నాటి నుండి బస్సులన్నీ కిక్కిరిసి పోతున్నాయి. ఇదే సమయంలో సీట్ల కోసం కొట్లాడుకుంటున్నారు మహిళలు. జుట్లు జుట్లు పట్టుకుని తన్నుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడో వీడియో వైరల్ అవుతుంది.

  • Published Mar 06, 2024 | 3:44 PMUpdated Mar 06, 2024 | 3:44 PM
మహిళా కండక్టర్‌పై ప్రయాణీకురాలు బూతులు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారాన్ని చేపట్టిన వెంటనే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తున్నారు. విద్యార్థినులు, అమ్మాయిలు, మహిళలు, ట్రాన్స్ జెండర్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. తెలంగాణలో నివసిస్తున్నట్టు నిర్దారించే ఆధార్, ఓటర్ కార్డులను చూపిస్తే చాలు జీరో టికెట్‌తో ప్రయాణించవచ్చు. ఆర్టీసీ, మెట్రో, ఎక్స్ ప్రెస్ బస్సులకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ క్రమంలో బస్సుల్లో ప్రయాణీస్తున్న మహిళల సంఖ్య పెరిగింది. గతం కన్నా రద్దీగా మారాయి బస్సులు.  మహిళా ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి.

మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టిన నాటి నుండి బస్సుల్లో చిత్ర విచిత్ర దృశ్యాలు సాక్షాత్కరమిస్తున్నాయి. బస్సులో తోపులాట, సీట్ల కోసం మహిళల కోట్లాట, టికెట్ విషయంలో కండక్టర్స్‌తో గొడవలు జరుగుతున్నాయి. కండక్టర్లు, డ్రైవర్లను కూడా ముప్పతిప్పలు పెడుతున్నారు ప్రయాణీకులు. టికెట్ సమయానికి ఇవ్వకపోయినా, ఆధార్ కార్డు అడిగినా.. కండక్టర్ ను తిట్టిపోస్తున్నారు. టికెట్స్ ఇవ్వలేక, జనాభా ఒత్తిడి పెరిగిపోయి..బస్సులో నుండి కిందకు దిగి.. ఈ ఉద్యోగాలు చేయలేమంటూ కండక్టర్స్ ఏడుస్తున్న దృశ్యాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు మరో వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. లేడీ కండక్టర్ ను పట్టుకుని మరో మహిళా ప్రయాణీకురాలు బూతులతో విరుచుకు పడింది.

బస్సు కండక్టర్, ప్రయాణీకురాలికి మధ్య పెద్ద గొడవ జరిగింది. దీన్ని వీడియో తీసి.. ఓ నెటిజన్ పోస్టు చేయడంతో వైరల్ అవుతుంది. అందులో సీటు, స్టాప్ విషయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో కండక్టర్ పై తిట్ల దండకం అందుకుంది ఆ మహిళా ప్యాసెంజర్. ‘ఫ్రీ బస్సు నీ ఇంట్ల కెళ్లి ఇస్తున్నావా.. ఏం మాట్లాడుతున్నావ్, గాడిద లెక్క, దున్నపోతు మొహందానా, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావ్.. గాడిద మొహందానా..నువ్వు మంచిగా ఉండాలి. నిదానంగా ఉండాలి’ అంటూ బూతులు తిట్టిింది. దానికి కండక్టర్ కూడా రివర్స్ అయ్యింది. అయితే తోటి ప్రయాణీకుడొకరు.. అలా తిట్టద్దూ అంటూ వారించే ప్రయత్నం చేశాడు ప్రయాణీకురాలిని. అయినప్పటికీ ఆమె ఆగలేదు.. కండక్టర్ పై విరుచుకూ పడుతూనే ఉంది.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş