iDreamPost
android-app
ios-app

అమృత ప్రణయ్ ని కలిసిన అమ్మ.. ట్రెండింగ్ లో వీడియో!

  • Published Feb 05, 2024 | 3:15 PM Updated Updated Feb 05, 2024 | 3:15 PM

అమృత ప్రణయ్‌కి సంబంధించిన విషాద సంఘటన అప్పటిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అయితే ఈ ఘటన జరిగిన కొన్నేళ్లకు అమృత తన తల్లితో కలిసిపోయింది. తాజాగా ఓ ప్రత్యేకమైన సందర్భంగా తన తల్లి, కొడుకు నిహాన్ అమృత వద్దకు వచ్చిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంతకి అదేమిటంటే..

అమృత ప్రణయ్‌కి సంబంధించిన విషాద సంఘటన అప్పటిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అయితే ఈ ఘటన జరిగిన కొన్నేళ్లకు అమృత తన తల్లితో కలిసిపోయింది. తాజాగా ఓ ప్రత్యేకమైన సందర్భంగా తన తల్లి, కొడుకు నిహాన్ అమృత వద్దకు వచ్చిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంతకి అదేమిటంటే..

  • Published Feb 05, 2024 | 3:15 PMUpdated Feb 05, 2024 | 3:15 PM
అమృత ప్రణయ్ ని కలిసిన అమ్మ.. ట్రెండింగ్ లో వీడియో!

జీవితంలో ప్రేమించిన వ్యక్తులు దూరమైన, ప్రేమ మాత్రం సజీవంగానే ఉంటుంది. వారితో గడిపిన మధుర క్షణాలనే తీపి గుర్తులుగా బ్రతికేస్తుంటారు. అలాంటి కోవకు చెందిన వారిలో అమృత ప్రణయ్ కూడా ఒకరు. మిర్యాలగూడకు చెందిన అమృత, ప్రణయ్ ప్రేమించుకుని, కులాంతర వివాహాం చేసుకున్నారు. ఆ తర్వాత.. ప్రణయ్ అతి దారుణంగా హత్యకు గురికావడం అనేది రెండు తెలుగు రాష్ట్రల్లో సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటన జరిగిన కొన్నాళ్లకు అమృత ఓ మగ బిడ్డకు జన్ననిచ్చింది. అలా ఆ బిడ్డ ఆలనా పాలనా చూసుకుంటూ.. తన జీవితంలో జరిగిన ఒక దారుణాన్ని అధిగమించి ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్తోంది. దీంతో పాటు ఒక యూట్యూబ్ చానెల్ ని కూడా నిర్వహిస్తోంది. ఇందులో తన భర్తకు సంబంధించి మెమొరీస్, తన బాబు మెమరబుల్ మూమెంట్స్ అన్ని షేర్ చేస్తుంటాది. అలా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ.. తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక అమృత తన తండ్రి మరణం తర్వాత తల్లితో కూడా కలిసిపోయిన సంగతీ తెలిసిందే. అయితే తాజాగా అమృత తన తల్లితో, కొడుకుతో కలిసి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జీవితంలో ప్రతి కష్టన్ని దాటుకుని ముందుకు వెళ్లగలిగే సత్తాను, ధైర్యాన్ని కాలమే ఇస్తుందంటారు. ఇది నిజంగా అమృత జీవితానికి వాస్తవంగా, దగ్గరగా ఉంటుంది. తన జీవితంలో జరిగిన విషాధ ఘటనను దిగమింగుకొని, తన కొడుకును చూసుకుంటూ లైఫ్ లో ముందుకు సాగుతుంది. ఇదిలా ఉంటే.. గత కొన్నేళ్లుగా అమృత తన తల్లితో విబేధాలను విడిచి కలిసిపోయిన సంగతీ తెలిసిందే. అయితే తాజాగా తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా అమృత తల్లి, కొడుకు నిహాన్ హైదరాబాద్ కు తరలి వచ్చారు. అందుకు సంబంధించిన వీడియోను అమృత తన యుట్యూబ్ చానెల్ షేర్ చేసింది. ఆ వీడియోలో తన తల్లిని రాగానే పలకరిస్తూ.. వీడియోను తీస్తుంది.

అలాగే తన తల్లిని ఎప్పుడు బయలుదేరారు అని అడుగుతూ.. పలు విషయాలను ఇద్దరు చర్చించుకుంటారు. ఆ తర్వాత నిద్రపోతున్నా తన కొడుకు నిహాన్  గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇక కొడుకు నిద్ర లేవడంతో.. ఈ వీడియోను కొనసాగించాలని ఉన్నా, తన కొడుకును చూసి దాదాపు వారం రోజులు అయ్యింది. అందుకే వీడియో తీయాలని లేదు వాడితో ఆడుకొని, సరదాగా గడపాలని ఉందని చెప్తు.. వీడియోను ముగించింది. ప్రస్తుతం ఈ వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన ప్రతిఒక్కరు అమృత తన లైఫ్ లో ఇలానే తన కొడుకుతో సంతోషం ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు. మరి, ఎంతో ఆనందంగా తన తల్లితో, కొడుకుతో కనిపిస్తున్న అమృత పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş