iDreamPost
android-app
ios-app

బతికున్న కూతురికి పెద్దకర్మ చేసిన తండ్రి! ఫోటోలు వైరల్!

  • Published Sep 15, 2023 | 5:04 PM Updated Updated Sep 15, 2023 | 5:04 PM
  • Published Sep 15, 2023 | 5:04 PMUpdated Sep 15, 2023 | 5:04 PM
బతికున్న కూతురికి పెద్దకర్మ చేసిన తండ్రి! ఫోటోలు వైరల్!

గత రెండు నెలల కిందట తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ కుటుంబ సభ్యులు యువతి బతికుండగానే ఆమెకు పెద్ద కర్మ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన మరువక ముందే తాజాగా తెలంగాణలోని ఓ తండ్రి.. బతికున్న కూతురికి పెద్ద కర్మ చేశాడు. ఇవే ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఇంతకు తండ్రి కూతురు బతికుండగానే ఎందుకు పెద్ద కర్మ నిర్వహించాలని భావించాడు? అందుకు దారి తీసిన కారణాలు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణలోని నిజామాబాద్ కు చెందిన నందిని అనే యువతికి ఆమె తల్లిదండ్రులు గతంలో ఓ యవకుడికి ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లైన నాటి నుంచి ఆ యువతి భర్తతో బాగానే ఉన్నట్టు నటిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే నందిని భర్తకు బోన్ క్యాన్సర్ వచ్చింది. ఇక భర్తతో ఉండడం ఇష్టం లేని ఈ యువతి… గత కొంత కాలంగా స్థానికంగా ఉన్న ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం నడిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే ఇటీవల నందిని తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకుని ఆమె భర్త, తండ్రి మహేష్ ఒక్కసారిగా షాక్ గురయ్యారు.

భార్య తోడుగా ఉంటుందని నమ్మిన భర్తను నందిని నట్టేట్ట ముంచి వెళ్లిపోయింది. ఇక కూతురు చేసిన పనికి ఆమె తల్లిదండ్రులు గ్రామంలో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే కోపంతో ఊగిపోయిన తండ్రి మహేష్.. కూతురు బతికుండగానే పెద్దకర్మ చేయాలని భావించాడు. ఈ నెల 10న నా కూతురు మరణించిందని, అందుకే గురువారం పెద్ద కర్మ చేస్తున్నట్లుగా తండ్రి తెలిపినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. కూతురు చేసిన అవమానానికి తండ్రి మహేష్ చేసింది కరెక్టేనని మీరు భావిస్తున్నా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom