iDreamPost
android-app
ios-app

తెలంగాణలో దసరా వేళ మద్యం అమ్మకాల జోరు.. 10 రోజుల్లో ఏకంగా 1000 కోట్లు..

  • Published Oct 11, 2024 | 3:48 PM Updated Updated Oct 11, 2024 | 3:48 PM

Liquor sales: దసరా పండగ వేళ మద్యం ఏరులై పారుతోంది. తెలంగాణలో రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఏకంగా 10 రోజుల్లోనే వెయ్యి కోట్ల అమ్మకాలు జరిగాయి.

Liquor sales: దసరా పండగ వేళ మద్యం ఏరులై పారుతోంది. తెలంగాణలో రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఏకంగా 10 రోజుల్లోనే వెయ్యి కోట్ల అమ్మకాలు జరిగాయి.

  • Published Oct 11, 2024 | 3:48 PMUpdated Oct 11, 2024 | 3:48 PM
తెలంగాణలో దసరా వేళ మద్యం అమ్మకాల జోరు.. 10 రోజుల్లో ఏకంగా 1000 కోట్లు..

తెలుగు ప్రజలకు ముఖ్యమైన పండగల్లో ఒకటి దసరా. విజయ దశమి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద ఫెస్టివల్. ఇప్పటికే దసరా పండగ సెలబ్రేషన్స్ షురువయ్యాయి. వారం రోజుల ముందుగానే దసరా సంబరాలు మొదలయ్యాయి. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు సోంతూళ్లకు పయనమవుతున్నారు. కుటుంబంతో కలిసి దసరా ఉత్సవాలను జరుపుకునేందుకు రెడీ అవుతున్నారు. దసరా వేళ బస్టాండ్స్, రైల్వే స్టేషన్స్ కిక్కిరిసిపోతున్నాయి. పండక్కి కొత్త బట్టలు, నగలు, కొత్త వాహనాలు కొనుక్కునే వారితో ఆయా షాపులు కళకళలాడుతున్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. అయితే దసరా పండగా తెలంగాణలో చుక్క, ముక్క లేనిదే పూర్తవదు. దసరా రోజున మటన్, చికెన్, మందు ఖచ్చితంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు.

మామూలు రోజుల్లోనే మద్యం తీసుకోకుండా ఉండలేరు. అలాంటిది పండగ పూట ఊరుకుంటారా? అప్పు తెచ్చుకోని అయినా సరే దసరాను ధూం ధాం గా సెలబ్రేట్ చేసుకోవాలని చూస్తుంటారు. చుక్క పడనిదే పొద్దు గడవని మద్యం ప్రియులు ఎంతో మంది ఉంటారు. ఎప్పుడెప్పుడు వైన్స్ షాపులు తెరుస్తారా? అని చూస్తుంటారు. అలాంటిది దసరా ఉత్సవాల్లో మద్యం ఏరులై పారుతుంది. మంచి నీళ్లు తాగినట్టుగా కాటన్ల కొద్ది బీర్లను తాగేస్తుంటారు. బావ బామ్మర్ధులు, ఫ్రెండ్స్ సిట్టింగ్ ఏశారంటే చాలు బీర్లు, మద్యం బాటిల్లు ఖాళీ కావాల్సిందే. దసరా పండగను మరింత సంతోషంగా జరుపుకునేందుకు వైన్స్ షాపులకు క్యూ కడతారు. దసరా ముందు నుంచే మద్యం దుకాణాలు కిటకిటలాడుతుంటాయి.

మందుబాబుల తాకిడితో మద్యం నిల్వలు ఖాళీ అవుతుంటాయి. దసరా పండగ వేల రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. దీంతో రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం సమకూరుతుంది. కొద్ది రోజుల్లోనే ఏకంగా కోట్ల రూపాయల లిక్కర్ సేల్ జరుగుతుంది. ఈ సారి విజయదశమి ఫెస్టివల్ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్నాయి. దసరా వేడుకల వేళ అమ్మకాల జోరు పెరిగింది. తెలంగాణలో కేవలం 7 రోజుల్లోనే 7 వందల కోట్ల మద్యం అమ్ముడైపోయింది. 7 వందల కోట్లను మద్యం రూపంలో తాగేశారు మందు బాబులు. బాక్సాఫీస్ రికార్డుల మాదిరిగా మద్యం అమ్మకాలు రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇంకా పండగ పూర్తవ్వనే లేదు మద్యం సేల్స్ అప్పుడే వెయ్యి కోట్ల రికార్డు దిశగా పరిగెడుతున్నాయి.

అక్టోబర్ 12న దసరా పండగ కాబట్టి మద్యం అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇంటికొచ్చిన బంధువులకు మర్యాదలు చేసేందుకు బీర్లు, మందు బాటిళ్లను కొనుగోలు చేస్తుంటారు. దీంతో మద్యం అమ్మకాలు మరింత ఊపందుకోనున్నాయి. ఈ రెండు రోజుల్లో ఈజీగా మరో 300 కోట్ల మద్యం అమ్మకాలు జరిగే అవకాశం ఉన్నట్లు అంచనావేస్తున్నారు. అంటే 10 రోజుల్లోనే వెయ్యి కోట్ల మద్యం అమ్మకాలు జరుగనున్నాయి. తెలంగాణలో ఇది ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేయనున్నది. మరి తెలంగాణలో 10 రోజుల్లో 1000 కోట్ల మద్యం అమ్మకాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet