మీ పిల్లలు YouTube Kids చూస్తున్నారా? ఈ సెట్టింగ్స్ మార్చకపోతే డేంజర్‌లో ఉన్నట్టే!

సోషల్ మీడియాలో కింగ్ ఎవరమ్మా అంటే యూట్యూబ్. యూట్యూబ్ చూడనిదే పొద్దు గడవదు. ఇక చిన్న పిల్లలు సైతం ఈ సాామాజిక మాధ్యమానికి ఎడిక్ట్ అవుతున్నారు. పిల్లల కోసమే రూపొందించిన యూట్యూబ్ కిడ్స్ ను ఎంతో మంది చిల్ట్రన్ వాచ్ చేస్తున్నారు. కానీ ఇది కూడా సేఫ్ కాదట.

సోషల్ మీడియాలో కింగ్ ఎవరమ్మా అంటే యూట్యూబ్. యూట్యూబ్ చూడనిదే పొద్దు గడవదు. ఇక చిన్న పిల్లలు సైతం ఈ సాామాజిక మాధ్యమానికి ఎడిక్ట్ అవుతున్నారు. పిల్లల కోసమే రూపొందించిన యూట్యూబ్ కిడ్స్ ను ఎంతో మంది చిల్ట్రన్ వాచ్ చేస్తున్నారు. కానీ ఇది కూడా సేఫ్ కాదట.

సెల్ ఫోన్, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక సోషల్ మీడియా యాప్స్ పుట్ట గొడుగుల్లా పుట్టుకు వచ్చాయి. ముఖ్యంగా యూట్యూబ్, ఇన్ స్టా, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాలు టైం తెలియకుండా చేస్తున్నాయి. వీటిల్లో ఒక్క సారి తలపెడితే.. బయటకు రావడం కష్టం. అయితే సినిమాలు, సీరియల్స్ చూడాలంటే అందరి బెస్ట్ చాయిస్ యూట్యూబ్. చిన్న పిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ల వరకు వారికి కావాల్సిన వీడియోలు చూస్తుంటారు. ఇక చిన్న పిల్లలు సైతం యూట్యూబ్‪కు ఎడిక్ట్ అవుతున్నారు. పిల్లలు మారం చేయగానే యూట్యూబ్‌లో రైమ్స్, స్టోరీస్ వీడియోలు పెట్టి తల్లిదండ్రులు వారి పనుల్లో తలమునకలు అవుతుంటారు. కానీ ఒక్కోసారి అనవసరమైన వీడియోలు కూడా రికమెండ్ చేస్తూ ఉంటుంది యూట్యూబ్. ఇది పిల్లలకు చాలా హాని చేస్తుంది.

సో ఈ నేపథ్యంలో పిల్లలను ఉద్దేశించి ప్రత్యేకంగా తీసుకు వచ్చిందే యూ ట్యూబ్ కిడ్స్. ఇందులో కేవలం చిన్నారులకు సంబంధించిన కంటెంట్ వీడియోలు మాత్రమే ఉంటాయి. దీంతో పిల్లలు ఈ వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో చిల్ట్రన్స్ వీడియోలే ఎక్కువగా ఉండటంతో పెద్దలు కూడా తమ చిన్నారులకు ఫోన్లు ఇచ్చేస్తున్నారు. కానీ ఇక్కడే తప్పు చేస్తున్నారు. చాలా వరకు యూట్యూబ్ కిడ్స్ చాలా సేఫ్ అనుకుంటున్నారు. కానీ కాదు. ఇందులో కూడా అనవసరమైన కంటెంటెను రికమెండ్ చేస్తూ ఉంటుంది. అంటే హారర్, క్రైమ్ స్టోరీస్ వంటివి పుష్ చేస్తూ ఉంటుంది. తెలియక పిల్లలు వాటిని కూడా చూస్తూ.. భయాందోళనకు గురౌతున్నారు.

తొలుత భయపడ్డా.. రోజు రోజుకు వీటికి అలవాడు పడుతున్నారు. దీని వల్ల వారిపై మానసికంగా ప్రభావితం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో యూట్యూబ్ కిడ్స్ కూడా పిల్లలకు సేఫ్ కాదని తెలుస్తోంది. అయితే ఈ చిన్న చిట్కాతో యూట్యూబ్ కిడ్స్‌లో బ్యాడ్ వీడియోస్‌ను కంట్రోల్ చేయొచ్చు. అది ఎలా అంటారా..? సెట్టింగ్స్ ఓపెన్ చేసి.. అందులో టఫ్ మాథ్స్ ప్రాబ్లమ్ ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత కంటెంట్ సెట్టింగ్‌కు వెళ్లి..ఎడిట్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయాలి. వెంటనే అక్కడ సెట్టింగ్ ఛేంజ్ చేసుకోవాలి.. అప్రూవ్ కంటెంట్ యువర్ సెల్ఫ్ మీద క్లిక్ చేయగానే.. మీరు పిల్లలు ఏ వీడియో ఛానల్స్ చూడాలనుకుంటున్నారో వాటిని ఎంపిక చేసుకోవచ్చు. దీని ద్వారా ఆ యూట్యూబ్ ఛానల్స్ వీడియోలు మాత్రమే కనిపిస్తాయి. దీని వల్ల చిల్టన్స్ బ్యాడ్ వీడియోస్ చూడకుండా నివారించొచ్చు. ఇది ఉపయోగకరంగా ఉన్నట్లయితే పది మందికి ఈ సమాచారాన్ని తెలియజేయండి.

Show comments