Mini Laptop Under Budget: బెస్ట్ బడ్జెట్ మినీ ల్యాప్‌టాప్! మిస్సైతే ఇంత తక్కువ ధరకు దొరకడం కష్టం!

బెస్ట్ బడ్జెట్ మినీ ల్యాప్‌టాప్! మిస్సైతే ఇంత తక్కువ ధరకు దొరకడం కష్టం!

Xiaomi Introduced Redmi Pad Pro 5G, Redmi Pad SE 4G Tablets In India: ల్యాప్ టాప్ కొనాలంటే కనీసం 30 వేలు అయినా పెట్టుబడి పెట్టాలి. పైగా సైజు కూడా పెద్దగా ఉంటుంది. చిన్న చిన్న వర్క్స్ చేసుకునేవారికి.. చిన్న సైజు ల్యాప్ టాప్ ఉంటే బాగుణ్ణు… సులువుగా క్యారీ చేసేలా ఉంటే బాగుణ్ణు అనుకునే వారికి ఈ మినీ ల్యాప్ టాప్ బాగా యూజ్ అవుతుంది. చిరాకు లేకుండా కీబోర్డు వాడి టైపింగ్ చేసుకోవచ్చు. టచ్ స్క్రీన్ డిస్ప్లేతో మొబైల్ ఫోన్ లా కూడా వాడుకోవచ్చు.

Xiaomi Introduced Redmi Pad Pro 5G, Redmi Pad SE 4G Tablets In India: ల్యాప్ టాప్ కొనాలంటే కనీసం 30 వేలు అయినా పెట్టుబడి పెట్టాలి. పైగా సైజు కూడా పెద్దగా ఉంటుంది. చిన్న చిన్న వర్క్స్ చేసుకునేవారికి.. చిన్న సైజు ల్యాప్ టాప్ ఉంటే బాగుణ్ణు… సులువుగా క్యారీ చేసేలా ఉంటే బాగుణ్ణు అనుకునే వారికి ఈ మినీ ల్యాప్ టాప్ బాగా యూజ్ అవుతుంది. చిరాకు లేకుండా కీబోర్డు వాడి టైపింగ్ చేసుకోవచ్చు. టచ్ స్క్రీన్ డిస్ప్లేతో మొబైల్ ఫోన్ లా కూడా వాడుకోవచ్చు.

షావోమీ భారత మార్కెట్లో రెండు కొత్త ట్యాబ్ లెట్స్ ని లాంఛ్ చేసింది. రెడ్ మీ ప్రో 5జీ, రెడ్ మీ ప్యాడ్ ఎస్ఈ 4జీ ట్యాబ్స్ ని లాంఛ్ చేసింది. ఈ రెండు ట్యాబ్లెట్లు బడ్జెట్, మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో గట్టి పోటీ ఇచ్చే విధంగా ఉంది. వన్ ప్లస్, రియల్ మీ సహా ఇతర ట్యాబ్లెట్స్ ని పక్కకు నెట్టేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా రెడ్ మీ ప్రో 5జీ ట్యాబ్ అయితే ఒక చిన్న సైజు ల్యాప్ టాప్ లా ఉంది. దీనికి ఒక కీబోర్డు కూడా ఇచ్చారు. టచ్ స్క్రీన్ గా వాడుకోవచ్చు. కీబోర్డు యూజ్ చేసుకుని ఎక్సెల్ షీట్స్, డాక్యుమెంట్స్ లో కంటెంట్ వంటివి రాసుకోవచ్చు. ఆఫీస్ వర్క్ చేసేవారికి ముఖ్యంగా కంటెంట్ రైటర్స్ కి బాగా ఉపయోగపడుతుంది. స్మార్ట్ పెన్ కూడా ఇచ్చారు. డ్రాయింగ్, పెయింటింగ్ వంటివి వేసుకోవచ్చు. బడ్జెట్ లో మినీ ల్యాప్ టాప్ గా వస్తుంది ఇది.    

రెడ్ మీ ప్యాడ్ ప్రో 5జీ ట్యాబ్లెట్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 6 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ స్పేస్, 8 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్ స్పేస్ తో వస్తుంది. మొదటి వేరియంట్ ధర రూ. 21,999 కాగా.. రెండో వేరియంట్ ధర రూ. 24,599గా ఉంది. ఇక మూడే వేరియంట్ ధర రూ. 26,999గా ఉంది. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ కార్డుల మీద 2 వేల రూపాయల ఇన్స్టాంట్ డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో మొదటి వేరియంట్ ని రూ. 19,999కి, రెండో వేరియంట్ ని రూ. 22,599కి, మూడో వేరియంట్ ని రూ. 24,999కే పొందవచ్చు. 

ఇక రెడ్ మీ ప్యాడ్ ఎస్ఈ 4జీ కూడా రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. మొదటి వేరియంట్ ధర రూ. 10,999 కాగా.. రెండవ వేరియంట్ ధర రూ. 11,999గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల మీద వెయ్యి రూపాయల ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో మొదటి వేరియంట్ ధర రూ. 9,999కి, రెండవ వేరియంట్ ధర రూ. 10,999కి తగ్గుతుంది. 

రెడ్ మీ ప్యాడ్ ప్రో 5జీ స్పెసిఫికేషన్స్:

12.1 అంగుళాల స్క్రీన్ సైజుతో వస్తుంది. 2.5కే రిజల్యూషన్ తో 120 హెడ్జెస్ రీఫ్రెష్ రేటుతో, 600 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తుంది. స్క్రీన్ కి గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఇచ్చారు. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ తో, అడ్రెనో 710 జీపీయూ గ్రాఫిక్స్ తో వసుంది. 1.5 టీబీ వరకూ మైక్రో ఎస్డీ కార్డు స్లాట్ ద్వారా స్టోరేజ్ ని పెంచుకునే ఆప్షన్ ఇచ్చారు. ఫ్రంట్, బ్యాక్ 8 మెగా పిక్సెల్ కెమెరాని ఇచ్చారు. 10 వేల ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జ్ ఛార్జర్ తో వస్తుంది. ఈ ట్యాబ్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ సెన్సార్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, డాల్బీ అట్మోస్ సపోర్ట్ తో క్వాడ్ స్పీకర్ సెటప్ తో వస్తుంది. ఇది 6 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ స్పేస్, 8 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్ స్పేస్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. మొదటి వేరియంట్ అసలు ధర రూ. 29,999 కాగా లాంచింగ్ లో భాగంగా రూ. 26,999కే అందిస్తుంది. ఇక రెండో వేరియంట్ అసలు ధర రూ. 27,999 కాగా లాంచింగ్ లో భాగంగా రూ. 24,999కే అందిస్తుంది. ఇక మూడో వేరియంట్ అసలు ధర రూ. 24,999 కాగా లాంచింగ్ లో భాగంగా రూ. 21,999కే అందిస్తుంది. ఇది గ్రాఫైట్ గ్రే, మిస్ట్ బ్లూ కలర్స్ లో లభిస్తుంది. రెడ్ మీ ప్యాడ్ ప్రో 5జీ ట్యాబ్ లెట్ల విక్రయాలు ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానున్నాయి.  

రెడ్ మీ ప్యాడ్ ఎస్ఈ 4జీ స్పెసిఫికేషన్స్:

8.7 అంగుళాల హెచ్డీ డిస్ప్లేతో, 90 హెడ్జెస్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. మీడియా టెక్ హీలియో జీ99 చిప్ సెట్ తో వస్తుంది. 4జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. మైక్రో ఎస్డీ కార్డు స్లాట్ తో స్టోరేజ్ స్పేస్ ని 2 టీబీ వరకూ విస్తరించుకోవచ్చు. బ్యాక్ సైడ్ 8 మెగా పిక్సెల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 5 మెగా పిక్సెల్ కెమెరాని ఇచ్చారు. ఇది 6650 ఎంఏహెచ్ బ్యాటరీతో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది ఫారెస్ట్ గ్రీన్, ఓషన్ బ్లూ, అర్బన్ గ్రే రంగుల్లో వస్తుంది. మొదటి వేరియంట్ అసలు ధర రూ. 15,999 కాగా లాంచింగ్ ఆఫర్ లో భాగంగా రూ. 10,999కే లభిస్తుంది. అలానే రెండవ వేరియంట్ అసలు ధర రూ. 16,999 కాగా లాంచింగ్ ఆఫర్ లో భాగంగా రూ. 11,999కే వస్తుంది.  రెడ్ మీ ప్యాడ్ ఎస్ఈ 4జీ విక్రయాలు ఆగస్టు 8 నుంచి ప్రారంభం కానున్నాయి. 

Show comments