iDreamPost
android-app
ios-app

మిడ్ రేంజ్ లో కళ్లు చెదిరే ఫీచర్లతో షియోమీ న్యూ స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే?

  • Published Jul 25, 2024 | 11:30 PM Updated Updated Jul 25, 2024 | 11:30 PM

Xiaomi K70 Ultra: స్మార్ట్ ఫోన్ ప్రియులకు మరో కొత్త ఫోన్ అందుబాటులోకి రానుంది. షియోమీ కంపెనీ క్రేజీ ఫీచర్లతో మిడ్ రేంజ్ ధరలో కొత్త ఫోన్ ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. దీని ధర ఎంతంటే?

Xiaomi K70 Ultra: స్మార్ట్ ఫోన్ ప్రియులకు మరో కొత్త ఫోన్ అందుబాటులోకి రానుంది. షియోమీ కంపెనీ క్రేజీ ఫీచర్లతో మిడ్ రేంజ్ ధరలో కొత్త ఫోన్ ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. దీని ధర ఎంతంటే?

  • Published Jul 25, 2024 | 11:30 PMUpdated Jul 25, 2024 | 11:30 PM
మిడ్ రేంజ్ లో కళ్లు చెదిరే ఫీచర్లతో షియోమీ న్యూ స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ షియోమీ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. షియోమీ మొబైల్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. షియోమీ నుంచి రిలీజ్ అయ్యే ఫోన్లకు కస్టమర్ల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. షియోమీ ఫోన్లు హాట్ కేకుల్లా సేల్ అవుతుంటాయి. క్రేజీ ఫీచర్లతో వస్తున్న షియోమీ స్మార్ట్ ఫోన్లకు మొబైల్ యూజర్లు ఫిదా అవుతుంటారు. బడ్జెట్ ధరల్లోనే మొబైల్స్ లభిస్తుండడంతో యూజర్లు షియోమీ పట్ల ఇంట్రెస్టు చూపిస్తుంటారు. ఈక్రమంలో మరో కొత్త ఫోన్ ను లాంఛ్ చేసింది. రెడ్ మీ కె 70 అల్ట్రా ను చైనాలో రిలీజ్ చేసింది. త్వరలో భారత్ లో విడుదల చేయనున్నట్లు సమాచారం.

షియోమీ 14టీ ప్రో పేరుతో భారత్ లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ 1.5కే రెజల్యూషన్ తో 6.67 ఇంచుల ఓఎల్ఈడీ డిస్ ప్లేతో వస్తుంది. 144 రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్‌ అందించారు. 5500ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ, 120వాట్ ఛార్జింగ్‌తో సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ 5 వేరియంట్లలో అందుబాటులో ఉండనున్నది. 24జీబీ ర్యామ్+1టీబీ స్టోరేజ్ తో వస్తుంది.

దీని ధర రూ. 46 వేలుగా ఉంది. రెడ్ మీ కె 70 అల్ట్రా బేస్ వేరియంట్ 12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ తో వస్తుంది. దీని ధర రూ. 29 వేలుగా ఉండనుంది. కెమెరా విషయానికి వస్తే.. ట్రిపుల్ రియర్ కెమెరాను అందించారు. ప్రైమరీ లెన్స్ 50ఎంపీ, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపీ మాక్రో లెన్స్ అందించారు. సెల్ఫీల కోసం 20 ఎంపీ కెమెరాను అందించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ ఓఎస్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అందించారు.

Jojobet GirişJojobetşanlıurfa konteynerbetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwoongrandpashabetcasibomcasibomcasibombetcio giriş