iDreamPost
android-app
ios-app

Whatsapp: వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్.. ఇకపై ఆ సమాచారం సేఫ్!

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఇంప్రూవ్ చేస్తోంది. ఇప్పటికే అనేక కొత్త ఫీచర్లను పరిచయం చేసిన ఈ మేసేజింగ్ యాప్.. తాజాగా మరో సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది.

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఇంప్రూవ్ చేస్తోంది. ఇప్పటికే అనేక కొత్త ఫీచర్లను పరిచయం చేసిన ఈ మేసేజింగ్ యాప్.. తాజాగా మరో సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది.

Whatsapp: వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్.. ఇకపై ఆ సమాచారం సేఫ్!

నేటికాలంలో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. అంతేకాక మొబైల్స్ లో అనేక రకాల ఫీచర్లు, యాప్స్ ఉంటున్నాయి. అంతేకాక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే..  ప్రతీ ఒక్క స్మార్ట్ ఫోన్ లో కచ్చితంగా ఉండే యాప్ వాట్సాప్ ఒకటి. ప్రపంచం వ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ లో ఇది ఒకటి. అలానే యూజర్లను ఆకట్టుకునేందుకు వాట్సాప్ తరచూ  కొత్త కొత్త ఫీచర్లను  కస్టమర్లకు అందిస్తుంది. అలానే ఇటీవలే  వీడియో కాల్స్ , అసాంఘిక వీడియోలను ప్రైవేటు చేసేందుకు కొత్త ఫీచర్ తీసుకొచ్చిన సంగతి తెలిసింది. తాజాగా మరో అదరిపోయే ఫీచర్ ను వాట్సాప్ పరిచయం చేసింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

వాట్సాప్.. ఈపేరు తెలియని వారు ఉండరు అంటే  అతిశయోక్తి కాదు. ఎవరు స్మార్ట్ ఫోన్ వినియోగంచని అతి తక్కువ మందికి తప్ప.. మిగిలిన వారందరికి వాట్సాప్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచంలోనే ఈ వాట్సాప్ మెసేజింగ్ యాప్ ను వినియోగించే వారి సంఖ్య అధికంగా ఉంది. అలానే తరచూ ఈ యాప్ లో అనేక కొత్త కొత్త ఫీచర్లు వస్తున్నా ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను కస్టమర్లకు పరిచయం చేసింది. ముఖ్యంగా టైపింగ్ రానివాళ్లు సైతం వాట్సాప్ ను వినియోగించేలా అనేక కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంది.

ఇటీవలే వాయిస్ నోట్ ను వాట్సాప్ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. వాట్సాప్‌లో టైపింగ్‌కు ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో ఈ వాయిస్‌ నోట్ ను తీసుకొచ్చారు. ఆ ఫీచర్‌ సహాయంతో క్షణాల్లో వాయిస్‌ మెసేజ్‌ను చేసే అవకాశం కల్పించారు. వాయిస్‌ నోట్ ట్రాన్‌స్క్రిప్షన్‌ పేరుతో ఆ ఫీచర్‌ను తీసుకొచ్చారు. వాయిస్ నోట్ ఫీచర్‌ సహాయంతో వాయిస్‌ మెస్‌లను టెక్ట్స్ రూపంలో మార్చుకోవచ్చు. దీనిపై  కస్టమర్లు కూడా మంచి పాజిటీవ్ గా ఉన్నారు. తాజాగా మరో అదిరిపోయే ఫీచర్ ను వాట్సాప్ తీసుకొచ్చింది. వాట్సాప్ లో ‘నోట్స్’ పేరిట ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. బిజినెస్ టూల్ గా ఈ కొత్త ఫీచర్  పనిచేయనుంది.

ఈ ఫీచర్ తో యూజర్లు తమ ఫోన్ లోని కాంటాక్టలకు సంబంధించిన వివరాలను చాట్ ఇన్ఫో సెక్షన్ లో నోట్స్ గా యాడ్ చేసుకోవచ్చు. అలా తీసుకున్న సమాచారం వ్యక్తిగతంగా ఉంటుంది. ఏ ప్రైవేటు వ్యక్తులకు కనిపించదు. ఈ అదిరిపోయే ఫీచర్ ను తొలుత యూజర్లకు అందుబాటులో ఉండదు. ఈ ఫీచర్ ను మొదట బిజినెస్ అకౌంట్స్  ఉన్న వారికి మాత్రమే అందుబాటులోకి వస్తుందని వాబీట ఇన్ఫో పేర్కొంది. అక్కడ వచ్చిన రెస్పాన్ ను బట్టి.. మరింత మెరుగు పర్చి.. అందరికి అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. మరి.. వాట్సాప్ పరిచయం చేసిన ఈ కొత్త ఫీచర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.