iDreamPost
android-app
ios-app

WhatsAppలో సరికొత్త ఫీచర్.. ఇకపై ఆ ఇబ్బందే ఉండదు..

ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు మరో కొత్త ఫీచర్ ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ సాయంతో యూజర్లకు ఆ ఇబ్బంది ఉండదు. ఇంతకీ ఆ ఫీచర్ ఏంటంటే?

ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు మరో కొత్త ఫీచర్ ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ సాయంతో యూజర్లకు ఆ ఇబ్బంది ఉండదు. ఇంతకీ ఆ ఫీచర్ ఏంటంటే?

WhatsAppలో సరికొత్త ఫీచర్.. ఇకపై ఆ ఇబ్బందే ఉండదు..

సోషల్ మీడియా యాప్ లలో వాట్సాప్ కు ఉండే క్రేజే వేరు. దాదాపు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు వాట్సాప్ ను వినియోగిస్తుంటారు. సమాచారం పొందాలన్నా.. ఇవ్వాలన్నా వాట్సాప్ ద్వారా క్షణాల్లో చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లను కలిగి ఉంది వాట్సాప్. సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ యూజర్లకు మరింత సౌలభ్యంగా ఉండే విధంగా కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. దీంతో వాట్సాప్ వాడకం మరింత సులభం అయిపోయింది. మెసేజ్ లు, కాల్స్, ఫోటోస్, వీడియోలు మరింత క్వాలిటీగా ఉండేలా అద్భుతమైన ఫీచర్లను పరిచయం చేసింది. ఇప్పుడు మరో కొత్త ఫీచర్ ను యూజర్లకు పరిచయం చేసింది వాట్సాప్.

వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. తాజాగా యూజర్లకు మరింత సులభంగా ఉండేలా వాట్సాప్ సంస్థ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. అదేంటంటే చాట్ ఫిల్టర్స్ ఫీచర్. ఇకపై వాట్సాప్ యూజర్లకు ఆ ఇబ్బందే ఉండదు. ఈ ఫీచర్ సాయంతో మెసేజ్ లను వేర్వేరుగా చూడొచ్చు. వాట్సాప్ లో పైన ఆల్, అన్ రీడ్, గ్రూప్స్ అనే మూడు సెక్షన్లు ఉంటాయి. వాటిపై క్లిక్ చేసి మీకు కావాల్సిన మెసేజ్ లు చూసుకోవచ్చు. వాటిల్లో ఆల్ పై క్లిక్ చేస్తే అన్ని చాట్స్ కలిసి ఒకేచోట కనిపిస్తాయి. అన్ రీడ్ పై నొక్కితే చదవకుండా వదిలేసిన మెసేజ్ లు కనిపిస్తాయి. గ్రూప్స్ అంటే కేవలం గ్రూప్స్ చాట్స్ మాత్రమే చూడవచ్చు.

ఇక వాట్సాప్ లో నిత్యం గంటలకొద్దీ గడిపేవాళ్లు కూడా ఉంటారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో చాట్ చేయడం.. ఫోటోలు, వీడియోలు, మెసేజ్ లు పంపించుకుంటూ బిజీగా గడిపేస్తుంటారు. అయితే వాట్సాప్ వాడేటపుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది లేదంటే మీ వాట్సాప్ ఖాతా చిక్కుల్లో పడుతుంది. మెసేజ్ లు పంపేటపుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని పంపిచాల్సి ఉంటుంది. వాట్సాప్ నిబంధనల ప్రకారం మత విధ్వేషాలను రెచ్చగొట్టే విధంగా.. అల్లర్లకు కారణమయ్యే విధంగా మెసేజ్ లను పింపిస్తే వాట్సాప్ ఖాతా శాశ్వతంగా బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.