Dharani
UN1QUE Mini X1 USB Fan: వేసవికాలం ప్రారంభం అయ్యింది. ఎండలు మండిపోతున్నాయి. ఎండ వేడి నుంచి తప్పించుకోవడం కోసం ఈ ఫ్యాన్‌ను కొనుగోలు చేస్తే.. ఏసీని మించి చల్లగాలి వీస్తుంది. మరి ఆ ఫ్యాన్ ఏది. దాని ఫీచర్స్ ఏంటి అంటే...
UN1QUE Mini X1 USB Fan: వేసవికాలం ప్రారంభం అయ్యింది. ఎండలు మండిపోతున్నాయి. ఎండ వేడి నుంచి తప్పించుకోవడం కోసం ఈ ఫ్యాన్‌ను కొనుగోలు చేస్తే.. ఏసీని మించి చల్లగాలి వీస్తుంది. మరి ఆ ఫ్యాన్ ఏది. దాని ఫీచర్స్ ఏంటి అంటే...
Dharani
వేసవికాలం ప్రారంభంలోనే ఎండలు మండుతున్నాయి. ఇప్పుడే ఏకంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నా భయమేస్తుంది. ఇప్పుడే నిమిషం పాటు ఫ్యాన్, ఏసీ, కూలర్ లేకపోతే ఉండలేని పరిస్థితి.. మరి రానున్న రోజుల్లో ఎలా ఉండనుందో . ఇక వేసవిలో కూలర్లు, ఏసీలకు డిమాండ్ బాగా ఉంటుంది. అయితే ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే అందరూ అంత డబ్బు పెట్టి.. ఏసీ, కూలర్‌లను కొనుగోలు చేయలేరు. అదుగో అలాంటి వారి కోసమే.. ఈ ఫ్యాన్.
చూడ్డానికి చిన్నగానే ఉంది కదా అని తేలిగ్గా తీసి పారేయకండి. చల్లదనంలో ఏసీని మించిపోతుంది. ఇక స్పీడ్‌లో అయితే రాకెట్ కన్నా వేగంగా ఉంటుంది. మరి ఇన్ని బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి కదా.. ఈ ఫ్యాన్ ధర భారీగానే ఉంటుందేమో అని అనుకుంటున్నారా.. లేదు.. కేవలం 700 రూపాయలు మాత్రమే. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో భారీ తగ్గింపుతో మీరు ఈ ఫ్యాన్ ను దక్కించుకోవచ్చు. ఈ సూపర్ స్పీడ్ ఫ్యాన్ గురించి పూర్తి వివరాలు..
ఇంతకు ఈ సూపర్ ఫ్యాన్ ఏది అంటే.. యూఎన్1క్యూయూఈ ఎక్స్1 మినీ ఫ్యాన్. చూడ్డానికి చిన్నగా ఉంటుంది. కానీ దీనిలో అమర్చిన శక్తివంతమైన బ్రష్లెస్ మోటార్ మాత్రం ఏసీని మించి చల్లగాలిని అందిస్తుంది. అంతేకాక చాలా స్పీడ్‌గా తిరుగుతుంది. పైగా దీన్ని మీతో పాటు ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. దీనిలో ఉండే బ్రష్లెస్ మోటార్ ఉష్ణ వాతావరణంలో చల్లగా ఉండేలా చూస్తుంది. మోటార్ దీర్ఘకాలం పని చేస్తుంది.
ఇక ఈ ఫ్యాన్‌ను వినియోగించేటప్పుడు మీరు మీ అవసరాలకు అనుకూలంగా స్పీడ్ మోడ్‌ను ఎంచుకోవచ్చు. ఇందుకోసం దీనిలో 3 స్పీడ్ కంట్రోల్స్ ఉన్నాయి. స్పీడ్‌ను మార్చడానికి, పవర్ బటన్‌ను నొక్కితే సరిపోతుంది. కనీస స్పీడ్ 3500 ఆర్‌బైఎం కాగా.. మీడియం స్థాయి స్పీడ్ 4500, గరిష్టం 7500 ఆర్‌బైఎంగా ఉంది. ఇది రీచార్జబుల్ ఫ్యాన్. రీఛార్జ్ చేయడం ద్వారా దీన్ని వాడకోవచ్చు. ఇందుకోసం దీనికి ఒక ఛార్జింగ్ కేబుల్ అందించారు. ఈ మినీ ఫ్యాన్ బ్యాటరీ 3.8 గంటల వరకు గాలిని అందిస్తుంది. మరి మీరు ఈ ఫ్యాన్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.
ఇక ఈ ఫ్యాన్ తెలుపు, నీలం రంగుల్లో అందుబాటులో ఉంది. దీని ధర కూడా చాలా తక్కువగానే ఉంది. సాధారణంగా ఈ పోర్టబుల్ ఫ్యాన్ ధర రూ.1499లుగా ఉంది. అయితే, 56 శాతం తగ్గింపుతో ఇది కేవలం రూ. 649లకే అందుబాటులో ఉంది. కనుక ఈ బుల్లి ఫ్యాన్‌ను మీరు తెచ్చుకుంటే.. ఈ సమ్మర్‌లో కూడా కూల్‌గా ఉండవచ్చు.