iDreamPost
android-app
ios-app

క్రేజీ ఫీచర్లతో టైటాన్ నుంచి అదిరిపోయే స్మార్ట్ వాచ్.. ధర ఎంతంటే?

  • Published Jul 18, 2024 | 5:14 PM Updated Updated Jul 18, 2024 | 5:14 PM

Titan celestor smartwatch: సరికొత్త స్మార్ట్ వాచ్ ను మార్కెట్ లోకి లాంఛ్ చేసింది ప్రముఖ వాచ్ కంపెనీ టైటాన్. క్రేజీ ఫీచర్లతో యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది. దీని ధర ఎంతంటే?

Titan celestor smartwatch: సరికొత్త స్మార్ట్ వాచ్ ను మార్కెట్ లోకి లాంఛ్ చేసింది ప్రముఖ వాచ్ కంపెనీ టైటాన్. క్రేజీ ఫీచర్లతో యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది. దీని ధర ఎంతంటే?

  • Published Jul 18, 2024 | 5:14 PMUpdated Jul 18, 2024 | 5:14 PM
క్రేజీ ఫీచర్లతో టైటాన్ నుంచి అదిరిపోయే స్మార్ట్ వాచ్.. ధర ఎంతంటే?

టైటాన్ బ్రాండ్ కు చెందిన వాచ్ లకు మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ వాచ్ ల వినియోగం పెరిగిపోయింది. లుకింగ్ కోసం యువత స్మార్ట్ వాచ్ లను ధరిస్తున్నారు. స్మార్ట్ వాచ్ లు ట్రెండీగా మారాయి. బడ్జెట్ ధరల్లోనే స్మార్ట్ వాచ్ లు లభిస్తుండడంతో కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్ ఉండడంతో అన్ని వయసుల వారు స్మార్ట్ వాచ్ లను వాడుతున్నారు. ప్రముఖ కంపెనీలన్నీ క్రేజీ ఫీచర్లతో స్మార్ట్ వాచ్ లను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. స్మార్ట్ వాచ్ లవర్స్ కోసం మరో స్మార్ట్ వాచ్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ వాచ్ కంపెనీ టైటాన్.. టైటాన్ సెలెస్టార్ పేరుతో కొత్త వాచ్ ను తీసుకొచ్చింది. దీని ధర ఎంతంటే?

స్మార్ట్ గాడ్జెట్స్ కు ఆదరణ పెరుగుతోంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు కంపెనీలు సరికొత్త గాడ్జెట్స్ ను పరిచయం చేస్తున్నాయి. తాజాగా టైటాన్ తీసుకొచ్చిన స్మార్ట్ వాచ్ యూత్ ను ఎట్రాక్ట్ చేస్తోంది. టైటాన్ సెలెస్టార్ స్మార్ట్ వాచ్ వృత్తాకార అమోలెడ్ డిస్ల్పేతో వస్తుంది. టైటాన్ సెలెస్టర్ స్మార్ట్‌వాచ్ ధర రూ. 9,995గా కంపెనీ నిర్ణయించింది. ప్రీమియం రేంజ్ లో స్మార్ట్ వాచ్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇది బ్లాక్ ఎక్లిప్స్, అరోరా బ్లూ మరియు మూన్‌లైట్ ఎడిషన్‌లో అంబాటులో ఉంటుంది. టైటాన్‌ షోరూమ్‌తో పాటు అమెజాన్‌ లో ఈ వాచ్‌ అందుబాటులోకి వచ్చింది.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో ఈ స్మార్ట్ వాచ్‌పై 10 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 8995కే సొంతం చేసుకోవచ్చు. అంటే మీకు రూ. 1,000 తగ్గింపు లభిస్తుందన్నమాట. టైటాన్ సెలెస్టర్ వాచ్‌ ఫీచర్ల విషయానికి వస్తే.. 1.43 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను ఇచ్చారు. 750 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం. టైటాన్ సెలెస్టర్ స్మార్ట్‌వాచ్‌లో ఇన్‌బిల్ట్‌గా జీపీఎస్‌ అందించారు. మై ఫిట్‌నెస్‌ ఫీచర్‌ను కూడా అందించారు. దీంతో మీ ఫిట్‌నెస్‌ వివరాలను తెలుసుకోవచ్చు. స్లీక్‌ అల్యూమినియం బాడీతో ఈ వాచ్‌ను డిజైన్‌ చేశారు. ఏఐ డ్యాష్‌బోర్డ్‌ను ఇందులో అందించారు. బ్లూటూత్ కాలింగ్ సదుపాయం ఉంది. మల్టీ స్పోర్ట్ ట్రాకర్, ఆక్టివిటీ ట్రాకర్, ఫోన్ కాల్, స్ట్రెస్ ట్రాకింగ్, హార్ట్ రేట్ మానిటర్ అందించారు. మీరు ఈ వాచ్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom