iDreamPost
android-app
ios-app

అద్భుతమైన ఫీచర్లతో.. రూ. 35 వేల కంటే తక్కువ ధరకే ల్యాప్‌టాప్స్!

  • Published Dec 21, 2023 | 12:11 PM Updated Updated Dec 21, 2023 | 12:11 PM

మీరు ల్యాప్ టాప్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీ బడ్జెట్ ధరలోనే ఉత్తమ ల్యాప్ టాప్స్ అందుబాటులో ఉన్నాయి. రూ. 35 వేల కంటే తక్కువ ధరకే మీరు ల్యాప్ టాప్ లను దక్కించుకోవచ్చు.

మీరు ల్యాప్ టాప్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీ బడ్జెట్ ధరలోనే ఉత్తమ ల్యాప్ టాప్స్ అందుబాటులో ఉన్నాయి. రూ. 35 వేల కంటే తక్కువ ధరకే మీరు ల్యాప్ టాప్ లను దక్కించుకోవచ్చు.

అద్భుతమైన ఫీచర్లతో.. రూ. 35 వేల కంటే తక్కువ ధరకే ల్యాప్‌టాప్స్!

ల్యాప్ టాప్స్ వినియోగం పెరిగిపోయింది. టెక్నాలజీలో వచ్చిన విప్లవాత్మక మార్పులతో పలు కంపెనీలు కస్టమర్ల అభిరుచులకు తగ్గట్లుగా ల్యాప్ టాప్స్ ను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులకు ల్యాప్ టాప్ వాడకం తప్పని సరిగా మారింది. ముఖ్యంగా విద్యార్థులకు ఆన్ లైన్ విధానంలో టీచింగ్ జరుగుతున్న క్రమంలో ల్యాప్ టాప్ ఉపయోగకరంగా మారింది. మరి మీరు ఈ మధ్య కాలంలో కొత్త ల్యాప్ టాప్ కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నారా? తక్కువ బడ్జెట్ లో లభించే ల్యాప్ టాప్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు ఇదే మంచి అవకాశం. రూ. 35 వేలకంటే తక్కువ ధరలో ఉత్తమ ల్యాప్ టాప్స్ అందుబాటులో ఉన్నాయి.

ల్యాప్ టాప్ కొనుగోలు చేసే ముందు ఆ ల్యాప్ టాప్ ఏ కంపెనీకి చెందింది, ధర, పనీతీరు, బ్యాటరీ బ్యాకప్, స్టోరేజ్ ఇంకా ఇతర ఫీచర్ల గురించి ఆరా తీస్తుంటాము. అయితే తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో ల్యాప్ టాప్స్ లభించే అవకాశం అందుబాటులో ఉంది. మీరు కేవలం రూ. 35 వేల కంటే తక్కువ ధరకే ల్యాప్ టాప్ ను దక్కించుకోవచ్చు. ఆ ల్యాప్ టాప్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

హెచ్పీ 15ఎస్ ఏఏమ్ డీ రైజన్

హెచ్పీ 15ఎస్ ఏఏమ్ డీ రైజన్ 3 ల్యాప్‌టాప్‌లో, మీరు 8జీబీ ర్యామ్ మరియు 512 జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ ను కలిగి ఉంది. డ్యూయల్ స్పీకర్లు మరియు బ్యాక్‌లిట్ కీబోర్డ్‌తో వస్తున్న ఈ హెచ్పీ ల్యాప్‌టాప్ ఎఫ్ హెచ్డీ యాంటీ గ్లేర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో మీరు బిల్ట్-ఇన్-అలెక్సా కూడా పొందుతారు. అమెజాన్‌లో దీని ధర ప్రస్తుతం రూ. 31,980గా ఉంది.

అసూస్ వివో బుక్ 14

అసూస్ వివో బుక్ 14 అనేది తేలికైన ల్యాప్‌టాప్. ఈ ల్యాప్‌టాప్ అన్ని వర్గాల వారికి ఉపయోగకరంగా ఉంటుంది. అసూస్ వివో బుక్ 14 ఇంటెల్ కోర్ ఐ3 ల్యాప్‌టాప్ చిక్లెట్ కీబోర్డ్‌ను కలిగి ఉంది మరియు దాని స్క్రీన్ పరిమాణం 14 అంగుళాలు. 8జీబీ/512జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్‌తో వస్తున్న ఈ ల్యాప్‌టాప్ ధర అమెజాన్‌లో దీని ధర రూ. 33,990గా ఉంది.

లెనోవా ఐడియాపాడ్

లెనోవా ఐడియాపాడ్ స్లిమ్ 3 ఇంటెల్ కోర్ ఐ3 ల్యాప్‌టాప్, అమెజాన్‌లో రూ.35,000 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉన్న ఉత్తమమైన ల్యాప్‌ టాప్. ఇది ఎఫ్ హెచ్డీ 15.6 స్క్రీన్, 8జీబీ ర్యామ్, 256జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్, న్యూమరిక్ కీప్యాడ్‌తో అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో దీని ధర రూ.31,990 గా ఉంది.

ఏసర్ ఆస్పైర్ లైట్

ఏసర్ ఆస్పైర్ లైట్ 12వ జెన్ ఇంటెల్ కోర్ ఐ3 ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో కూడిన ల్యాప్‌టాప్. 15.6 అంగుళాల స్క్రీన్ కలిగిన ఈ ల్యాప్‌టాప్ బాడీ మెటల్. దీని బ్యాటరీ బ్యాకప్ కూడా అద్భుతమైనది. కోర్ i3 ల్యాప్‌టాప్ యొక్క ర్యామ్ 8 జీబీ ర్యామ్ తో వస్తోంది. ఇది చాలా సన్నని ల్యాప్‌టాప్. దీనిలో మీరు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ పొందుతారు. అమెజాన్‌లోలో దీని ధర రూ. 32,990 గా ఉంది. మీరు మీ బడ్జెట్ ధరలో ల్యాప్ టాప్ కొనుగోలు చేయాలనుకుంటే ఈ ల్యాప్ టాప్ లపై ఓ లుక్కేయండి. మరి రూ. 35 వేలకంటే తక్కువ ధరకే లభిస్తోన్న ఈ ల్యాప్ టాప్ లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbetjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet