iDreamPost
android-app
ios-app

Spam Calls: స్పామ్‌ కాల్స్‌ వేధిస్తున్నాయా..? మీ ఫోన్ లో ఇలా చేసి చూడండి! ఒక్క కాల్ కూడా రాదు!

  • Published Jul 03, 2024 | 7:19 PM Updated Updated Jul 03, 2024 | 7:19 PM

రోజువారి వచ్చిన ఈ స్పామ్ కాల్స్ తో బాధపడుతున్నరా, అయితే ఇక నుంచి వాటి బారి నుంచి బయటపడేందుకు మీ స్మార్ట్ ఫోన్ లోనే అద్భుతమైన అవకాశం ఉంది. మరి స్పామ్ కాల్స్ కు చెక్‌ పెట్టేందుకు ఫోన్‌ సెట్టింగ్స్‌లో ఎలాంటి మార్పులు చేయాలో తెలుసుకుందాం.

రోజువారి వచ్చిన ఈ స్పామ్ కాల్స్ తో బాధపడుతున్నరా, అయితే ఇక నుంచి వాటి బారి నుంచి బయటపడేందుకు మీ స్మార్ట్ ఫోన్ లోనే అద్భుతమైన అవకాశం ఉంది. మరి స్పామ్ కాల్స్ కు చెక్‌ పెట్టేందుకు ఫోన్‌ సెట్టింగ్స్‌లో ఎలాంటి మార్పులు చేయాలో తెలుసుకుందాం.

  • Published Jul 03, 2024 | 7:19 PMUpdated Jul 03, 2024 | 7:19 PM
Spam Calls: స్పామ్‌ కాల్స్‌ వేధిస్తున్నాయా..? మీ ఫోన్ లో ఇలా చేసి చూడండి! ఒక్క కాల్ కూడా రాదు!

ప్రస్తుత కాలంలో ఆన్ లైన్ తరహా మోసాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరసరం లేదు. ముఖ్యంగా ఈజీ మనీకి అలవాటు పడిపోయిన కొంతమంది కేటుగాళ్లు  లేనిపోని దందాలు, స్కామ్ లు, సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వాటిలో ఎక్కువ చాలావరకు స్పామ్ కాల్స్ వాళ్ల మోసపోయి నష్టపోయిన బాధితులు కూడా ఉన్నారు. అయితే ఈ స్పామ్ కాల్స్ అనేవి ప్రతిఒక్కరికి రోజుకి రెండు మూడు సార్లు వస్తూ వేధిస్తుంటాయి. ముఖ్యంగా రోజు ఎవరు పనిలో వారు బిజీగా ఉన్న సమయంలో కొత్త నెంబర్ తో ఫోన్ రావడంతో.. వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తారు. అంతలోనే లోన్ కావాలా? క్రెడిట్‌ కార్డ్‌ ఇస్తామంటూ స్పామ్ కాల్స్ తో బుర్ర తినేస్తుంటారు.

దీంతో ఎంతో బిజీలో ఉన్న సమయంలో ఇలాంటి స్పామ్ కాల్స్ అని తెలియడంతో చాలామందికి పట్టరానంత కోపం వస్తుంది. అవసరంలేదని చెప్పినా.. పదే పదే ఇలాంటి కాల్స్‌ వస్తుంటే చాలా అసహనానికి లోనవుతుంటారు. మరో వైపు క్రెడిట్/డెబిట్ కార్డ్‌ వ్యాలిడిటీ ముగిసిందంటూ మోసపూరిత కాల్స్‌ వస్తుంటాయి. ఈ క్రమంలోనే ఈ స్పామ్ కాల్స్ ను ఎలా నిలిపివేయాలా అని చాలామంది ఆలోచిస్తుంటారు. మరి అలాంటి స్పామ్ కాల్స్ కు చెక్‌ పెట్టేందుకు ఫోన్‌ సెట్టింగ్స్‌లో ఎలాంటి మార్పులు చేయాలో తెలుసుకుందాం.

అయితే రోజువారి వచ్చిన ఈ స్పామ్ కాల్స్ బారి నుంచి బయటపడేందుకు మీ స్మార్ట్ ఫోన్ లోనే అద్భుతమైన అవకాశం ఉంది. అందుకు కోసం ఆండ్రాయిడ్ యూజర్లకు కాలర్‌ ఐడీ, స్పామ్‌ ప్రొటెక్షన్ అనే రెండు ఫీచర్లను గూగుల్ అందిస్తోంది. మరి యూజర్లు తమ ఫోన్లలో వీటిని ఎలా ఎనేబుల్‌ చేసి స్పామ్‌ కాల్స్‌ను అడ్డుకోవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

  • ముందుగా ఆండ్రాయిడ్ ఫోన్ లో ఫోన్ యాప్‌ ను ఓపెన్ చేసి దానికి కుడివైపు ఉన్న మూడు డాట్స్ పై క్లిక్ చేసి సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేయాలి.
  • ఇక అందులో కాలర్‌ ఐడీ అండ్ స్పామ్‌ ప్రొటెక్షన్ అనే ఆప్షన్‌ ఉంటుంది. ఇక దాన్ని వెంటనే ఎనేబుల్ చేయాలి.
  • ఆ తర్వాత కింద నిబంధనలకు అంగీకరిస్తున్నారా? అని అడుగుతూ అగ్రీ బటన్‌ చూపిస్తుంది.
  • దానిపై  క్లిక్ చేస్తే కాలర్‌ ఐడీ అండ్‌ స్పామ్‌ ప్రొటెక్షన్ ఫోన్‌లో యాక్టివేట్ అవుతుంది.
  • ఆ తర్వాత మీకు వచ్చిన స్పామ్‌ కాల్‌ నంబర్‌పై క్లిక్ చేస్తే ఫోన్‌, మెసేజ్‌, వీడియో, ఐ అని ఐకాన్స్‌ కనిపిస్తాయి.
  • వాటిలో ఐ ఐకాన్‌పై క్లిక్ చేస్తే బ్లాక్‌, రిపోర్ట్ అని రెండు ఆప్షన్లు ఉంటాయి.
  • ఇక వాటిని స్పామ్‌ కాల్‌ వచ్చిన నంబర్‌ను బ్లాక్ చేయాలంటే బ్లాక్‌ ఆప్షన్‌పై, సదరు నంబరుపై రిపోర్ట్ చేయాలంటే రిపోర్టు ఆప్షన్‌పై క్లిక్ చేస్తే చాలు  ఆ నంబర్‌ నుంచి మీకు ఫోన్‌కాల్స్‌ రావు.

స్పామ్ కాల్ ఫిల్టరింగ్‌ ఫీచర్ :

  • స్పామ్ కాల్ ఫిల్టరింగ్‌ ఫీచర్ కోసం మొదట Play Store నుంచి Phone by Google యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి.
  • ఆ తర్వాత Phone by Google యాప్‌ని మీ డిఫాల్ట్ డయలర్‌ యాప్ గా సెట్ చేయండి.
  • ఇక యాప్‌ని ఓపెన్‌ చేసిన తర్వాత దాన్ని మీ డీఫాల్ట్ డయలర్‌గా సెట్ చేయమని మీరు ప్రాంప్ట్ చేయబడతారు.
  • ఆ తర్వాత డిఫాల్ట్‌గా సెట్ చేయి ఆప్షన్‌పై , నీలిరంగు చిహ్నంతో ఫోన్ యాప్‌ను ఎంచుకోండి.
  • ఇక డిఫాల్ట్‌గా సెట్ చేయిని మళ్లీ క్లిక్‌ చేయడం ద్వారా మీ సెలక్షన్‌ను నిర్ధారించండి.
  • ఆపై కాలర్ ఐడీ అండ్‌ స్పామ్ బ్లాక్ సెట్టింగ్‌లను ప్రారంభించండి.
  • అలాగే మెయిన్‌ స్క్రీన్‌పై మూడు డాట్స్ తో మెనుని క్లిక్‌ చేయడం ద్వారా, సెట్టింగ్‌లకు వెళ్లి, ఆపై కాలర్ ఐడీ అండ్‌ స్పామ్‌ని ఎంచుకోవచ్చు.
  • ఇక ఈ సెట్టింగ్‌లు డిఫాల్ట్‌గా ప్రారంభించబడకపోతే వాటిని ఆన్ చేయండి.
  • దాని తర్వాత మీ డిఫాల్ట్ కాలర్ ఐడీ అండ్‌ స్పామ్ యాప్‌ని అప్‌డేట్ చేయండి.
  • ఇక కాలర్ ఐడీ, స్పామ్ ఫీచర్ల కోసం సిస్టమ్ ని ఉపయోగించే డిఫాల్ట్ యాప్‌ను మీరు అప్‌డేట్ చేయాలి.
  • ఈ సెట్టింగ్ ప్లేస్‌ ఫోన్ మోడల్ని బట్టి మారుతుంది. కాబట్టి మీరు మీ సిస్టమ్ సెట్టింగ్‌లలో “డిఫాల్ట్ యాప్‌లు” కోసం వెతకవలసి రావచ్చు. సెట్టింగ్ ఖాళీగా ఉంటే.. కేవలం “ఫోన్” యాప్ గుర్తుని ఎంచుకోవచ్చు.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetkatlaCasibom GirişMarsbahis GirişCasibom Giriş