iDreamPost
android-app
ios-app

తక్కువ ధరలో బెస్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా?.. 10వేలకే శాంసంగ్‌ న్యూ స్మార్ట్‌ఫోన్

Samsung Galaxy A06: మీరు ఈ మధ్య కొత్త ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ శాంసంగ్ రూ. 10 వేల లోపు స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. ఫీచర్లకు ఫిదా కావాల్సిందే.

Samsung Galaxy A06: మీరు ఈ మధ్య కొత్త ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ శాంసంగ్ రూ. 10 వేల లోపు స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. ఫీచర్లకు ఫిదా కావాల్సిందే.

తక్కువ ధరలో బెస్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా?.. 10వేలకే శాంసంగ్‌ న్యూ స్మార్ట్‌ఫోన్

స్మార్ట్ ఫోన్ కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో తక్కువ ధరకే మొబైల్స్ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. మంచి ఫీచర్లున్న బ్రాండెడ్ కంపెనీ స్మార్ట్ ఫోన్ కొనాలంటే 15-20 వేలు వెచ్చించాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు రూ. 10 వేల లోపే క్వాలిటీ మొబైల్స్ అడ్వాన్స్డ్ ఫీచర్లతో వచ్చేస్తున్నాయి. మరి మీరు కూడా తక్కువ ధరలో లభించే స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ శాంసంగ్ రూ. 10 వేల లోపు స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. శాంసంగ్ గెలాక్సీ ఏ06 పేరిట దీన్ని మార్కెట్ లోకి లాంచ్ చేసింది.

శాంసంగ్‌ గెలాక్సీ ఏ06 స్మార్ట్ ఫోన్ ప్రియులను ఆకర్షిస్తోంది. స్టన్నింగ్ డిజైన్, క్రేజీ ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్ కు క్రేజీ డిమాండ్ ఉంది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వాటిల్లో 4జీబీ+64జీబీ వేరియంట్‌ ధర రూ.9,999గా కంపెనీ నిర్ణయించింది. 4జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర రూ.11,499గా ఉంది. ఈ ఫోన్ లో 6.7 అంగుళాల హెచ్‌డీ+ పీఎల్‌ఎస్‌ ఎల్‌ఈడీ స్క్రీన్‌తో వస్తోంది. ఆక్టాకోర్‌ మీడియా టెక్‌ హీలియో జీ85 ప్రాసెసర్‌ అందించారు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత వన్‌ యూఐ6తో పనిచేస్తుంది.

వెనకవైపు 50ఎంపీ మెయిన్ కెమెరా, 2ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ అమర్చారు. సెల్ఫీ కోసం ముందువైపు 8ఎంపీ కెమెరా ఇచ్చారు. 4జీ, వైఫై, బ్లూటూత్‌, యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్‌, అన్ లాకింగ్ కోసం సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 50ఎంపీ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 25వాట్స్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో వస్తుంది. ఓఎస్ అప్ గ్రేడ్ ను రెండుసార్లు, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్ డేట్స్ ను అందించనుంది. శాంసంగ్ స్టోర్లలో మీరు ఈ ఫోన్ ను కొనుగోలు చేయొచ్చు. తక్కువ ధరలో బెస్ట్ మొబైల్ కోసం చూసే వారు ఈ ఫోన్ పై ఓ లుక్కేయండి.