iDreamPost
android-app
ios-app

Realme నుంచి మరో కొత్త ఫోన్.. 11 వేలది ఇంత తక్కువ ధరలోనా?

  • Published Jun 29, 2024 | 1:46 PM Updated Updated Jun 29, 2024 | 1:46 PM

Realme C61: స్మార్ట్ ఫోన్ యూజర్లకు మరోకొత్త ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ రియల్ మీ కొత్త ఫోన్ రిలీజ్ చేసింది. తక్కువ ధరకే సొంతం చేసుకుంది.

Realme C61: స్మార్ట్ ఫోన్ యూజర్లకు మరోకొత్త ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ రియల్ మీ కొత్త ఫోన్ రిలీజ్ చేసింది. తక్కువ ధరకే సొంతం చేసుకుంది.

  • Published Jun 29, 2024 | 1:46 PMUpdated Jun 29, 2024 | 1:46 PM
Realme నుంచి మరో కొత్త ఫోన్.. 11 వేలది ఇంత తక్కువ ధరలోనా?

స్మార్ట్ ఫోన్ ప్రియులకు అదిరిపోయే కొత్త మొబైల్ అందుబాటులోకి వచ్చింది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్స్ కోసం చూసే యూజర్ల కోసం స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు లేటెస్ట్ అప్ డేట్ లతో స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. కస్టమర్లు బ్యాటరీ సామర్ధ్యం, కెమెరా పనితీరు, ప్రాసెసర్ వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే తాజాగా క్రేజీ ఫీచర్లతో మరో కొత్త మొబైల్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ రియల్ మీ నుంచి బడ్జెట్ ధరలో కొత్త ఫోన్ రియల్‌మీ సీ 61 రిలీజ్ అయ్యింది. 11 వేల ఫోన్ తక్కువ ధరకే వచ్చేస్తోంది.

రియల్ మీ ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీ నుంచి విడుదలయ్యే ఫోన్లు హాట్ కేకుల్లా సేల్ అవుతుంటాయి. మరి మీరు తక్కువ ధరలో లభించే ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? రియల్‌మీ సీ 61 కొత్త ఫోన్ తక్కువ ధరకే వచ్చేస్తున్నది. క్రేజీ ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ధర విషయానికి వస్తే.. రియల్‌మీ సీ 61 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.7,699, 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.8,499, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.8,999గా కంపెనీ నిర్ణయించింది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ అసలు ధర రూ. 10,999 ఉండగా ఆఫర్ లో భాగంగా రూ.8,999కే దక్కించుకోవచ్చు.

Realme C61

ఫీచర్స్:

రియల్ మీ సీ61 ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు మద్దతుతో 450 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో కూడిన 6.78 అంగుళాల హెచ్డీ+ ఎల్‌సీడీ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది యూనిసాక్ టీ612 ప్రాసెసర్ తో పని చేస్తుంది. 32 మెగా పిక్సెల్ డెప్త్ రేర్ సెన్సర్ కెమెరా, సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా జత చేశారు. వై-ఫై 2.4 గిగా హెర్ట్జ్ / 5 గిగా హెర్ట్జ్, బ్లూ టూత్ 5.0, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. 10వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. రియల్ మీ సీ61 ఫోన్ రెండు కలర్ ఆప్షన్లు – సఫారీ గ్రీన్, మార్బుల్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibom