iDreamPost
android-app
ios-app

ఫస్ట్ సేల్ లోనే విపరీతమైన డిమాండ్.. ఈ ఫోన్ ఎందుకింత స్పెషలంటే?

  • Published Sep 05, 2023 | 10:13 PM Updated Updated Sep 05, 2023 | 10:21 PM
ఫస్ట్ సేల్ లోనే విపరీతమైన డిమాండ్.. ఈ ఫోన్ ఎందుకింత స్పెషలంటే?

స్మార్ట్ ఫోన్ ప్రియులు మార్కెట్ లోకి కొత్త ఫోన్ వచ్చిందంటే చాలు వెంటనే కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ధర కాస్త ఎక్కువైన ఆలోచించకుండా స్మార్ట్ ఫోన్లను కొనేస్తుంటారు. దీనికి గల కారణం ఎప్పటికప్పుడు ప్రముఖ మొబైల్ కంపెనీలు కస్టమర్ల అభిరుచులకు తగిన విధంగా అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేయడమే. స్మార్ట్ ఫోన్లు అనగానే చైనానే ముందు లిస్టులో ఉంటుంది. చైనాకు చెందిన పలు రకాల మొబైల్ కంపెనీలు రకరకాల మోడల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంటాయి. కాగా తాజాగా ఓ మొబైల్ కంపెనీ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి లాంచ్ చేయగా ఊహించని రెస్పాన్స్ వచ్చింది. తొలి సేల్ లోనే 30 వేల ఫోన్లు అమ్ముడయ్యాయి. మరి ఆ ఫోన్ ప్రత్యేకతలు ఏమిటి? ధర ఎంత? ఆ వివరాలు మీ కోసం..

ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ రియల్‌ మీ తాజాగా మార్కట్లోకి రియల్‌మీ జీటీ 5 5జీ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఇటీవల చైనాలో ఈ ఫోన్‌ ఫస్ట్ సేల్ నిర్వహించగా ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కేవలం రెండు గంటల్లోనే 30 వేల ఫోన్లను కొనుగోలు చేశారు కస్టమర్లు. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. చైనాలో విడుదలైన ఈ ఫోన్ త్వరలో భారత మార్కెట్ లో విడుదల కానుంది.

ఫీచర్లు:

రియల్‌మీ జీటీ 5 5జీ స్మార్ట్ ఫోన్‌ లేటెస్ట్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌తో కలిగి ఉంది. ఇందులో 24 జీబీ ర్యామ్‌ను అందించారు. ప్రపంచ వ్యాప్తంగా 24 జీబీతో పనిచేస్తున్న స్మార్ట్ ఫోన్‌లు కేవలం రెండు మాత్రమే ఉన్నాయి. అందులో రియల్‌మీ జీటీ5 ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్ లో 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 16 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఆన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ ఆప్షరన్ ఉంది. 240 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4600 ఎంఏహెచ్‌ బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.74 ఇంచెస్‌తో కూడిన 1.5 కే ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు.

థర:
రియల్‌మీ జీటీ 5 5జీ స్మార్ట్ ఫోన్ 12 జీబీ ర్యామ్‌, 256 స్టోరేజ్‌ ధర రూ. 35,000, 16 జీబీ ర్యామ్‌, 512 స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 37,500, 24 జీబీ ర్యామ్‌, 1 టీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 43,000గా ఉంది.

Jojobet Girişgrandpashabetcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbetjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabet