iDreamPost
android-app
ios-app

Realme నుంచి మరో కొత్త ఫోన్.. రూ. 7 వేలు మాత్రమే!

  • Published Jul 29, 2024 | 8:58 PM Updated Updated Jul 29, 2024 | 8:58 PM

Realme Narzo N61: మొబైల్ యూజర్లకు మరో కొత్త ఫోన్ అందుబాటులోకి వచ్చింది. రియల్ మీ తక్కువ ధరకే కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి లాంఛ్ చేసింది. కేవలం రూ. 7 వేలకే దక్కించుకోవచ్చు.

Realme Narzo N61: మొబైల్ యూజర్లకు మరో కొత్త ఫోన్ అందుబాటులోకి వచ్చింది. రియల్ మీ తక్కువ ధరకే కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి లాంఛ్ చేసింది. కేవలం రూ. 7 వేలకే దక్కించుకోవచ్చు.

  • Published Jul 29, 2024 | 8:58 PMUpdated Jul 29, 2024 | 8:58 PM
Realme నుంచి మరో కొత్త ఫోన్.. రూ. 7 వేలు మాత్రమే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలన్నీ అద్భుతమైన ఫీచర్స్ తో మొబైల్స్ ను రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ ప్రియులకు మరో కొత్త ఫోన్ అందుబాటులోకి వచ్చింది. లేటెస్ట్ వర్షన్స్, క్రేజీ ఫీచర్లు కావాలనుకునే వారి కోసం ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్ మీ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బడ్జెట్ ధరలోనే ఉన్న ఈ ఫోన్ మొబైల్ యూజర్లను ఆకర్షిస్తోంది. మరి మీరు ఈ మధ్య కొత్త ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే రియల్ మీ కంపెనీ రియల్‌మీ నార్జో ఎన్61 న్యూ మొబైల్ ను మార్కెట్ లోకి లాంఛ్ చేసింది. కేవలం 7 వేలకే దీన్ని కొనుగోలు చేయొచ్చు.

రియల్‌మీ నార్జో ఎన్61 భారత మార్కెట్ లోకి విడుదలైంది. దీనికి సంబంధించిన విక్రయాలు ఆగస్టు 6 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభంకానున్నాయి. ఫస్ట్ సేల్ లో భాగంగా రూ.500 డిస్కౌంట్ కూపన్ ఆఫర్ చేస్తోంది. దీంతో మీరు ఈ ఫోన్ ను రూ. 6999కే దక్కించుకోవచ్చు. రియల్‌మీ నార్జో ఎన్61 ఫోన్‌ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్స్ తో వస్తుంది. ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఆక్టాకోర్ యూనిసోక్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. మార్బుల్ బ్లాక్, వోయేజ్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనున్నాయి.

రియల్‌మీ నార్జో ఎన్61 ఫోన్‌ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 560 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తోపాటు 6.74 అంగుళాల హెచ్డీ+ ఎల్‌సీడీ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్ మీ యూఐ 4.0 వర్షన్ పై పని చేస్తుంది. 32-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, అన్ స్పెసిఫైడ్ సెకండరీ సెన్సర్ కెమెరా, సెల్ఫీల కోసం 5-మెగా పిక్సెల్ సెన్సార్ కెమెరా ఉంటాయి. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఫుల్ చార్జింగ్ తో 30 గంటల వరకూ వాయిస్ కాల్ టైం ఉంటుంది. ఈ ఫోన్ డ్యుయల్ 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom