iDreamPost
android-app
ios-app

Google App: విద్యార్థుల కోసం ప్రత్యేక యాప్. ఇకపై మ్యాథ్స్‌ అంటే భయం అవసరం లేదు!

  • Published Mar 13, 2024 | 1:04 PM Updated Updated Mar 13, 2024 | 1:16 PM

టెక్నాలజీ మారుతున్న కొద్దీ.. కొత్త యాప్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. దీని వలన ఎంతో మంది యూజర్స్ కు టైమ్ సేవ్ అవ్వడంతో పాటు.. ఎన్నో రకాల బెనిఫిట్స్ కలుగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మాథ్స్ అంటే భయపడే విద్యార్థులకు కొత్తగా ఒక యాప్ పుట్టుకొచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

టెక్నాలజీ మారుతున్న కొద్దీ.. కొత్త యాప్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. దీని వలన ఎంతో మంది యూజర్స్ కు టైమ్ సేవ్ అవ్వడంతో పాటు.. ఎన్నో రకాల బెనిఫిట్స్ కలుగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మాథ్స్ అంటే భయపడే విద్యార్థులకు కొత్తగా ఒక యాప్ పుట్టుకొచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Mar 13, 2024 | 1:04 PMUpdated Mar 13, 2024 | 1:16 PM
Google App: విద్యార్థుల కోసం ప్రత్యేక యాప్. ఇకపై మ్యాథ్స్‌ అంటే భయం అవసరం లేదు!

చాలా మంది స్టూడెంట్స్ కు అన్ని సబ్జక్ట్స్ కంటే.. మ్యాథ్స్ అంటే కాస్త భయంగా ఉంటుంది. నూటికి ఎనబై శాతం మందికి మ్యాథ్స్ సబ్జెక్టు అంటే ఇష్టం కూడా ఉండదు. దీనితో ఆ సబ్జెక్టు లో ఎలాగూ ఒకలా పాస్ అవ్వాలని.. బట్టి కొట్టడమో.. కష్టపడి నేర్చుకోవడమో చేస్తూ ఉంటారు. ఇక మ్యాథ్స్ లో ఉండే ఫార్ములాస్ ని గుర్తుంచుకోవాలంటే.. చాలా మంది స్టూడెంట్స్ కు భారంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక మరో వైపు మ్యాథ్స్ ను ఇష్టపడే స్టూడెంట్స్ కూడా ఉంటారు. అయితే, ఇప్పుడు మ్యాథ్స్ అంటే ఇష్టపడే స్టూడెంట్స్ కు,ఇటు మ్యాథ్స్ అంటే భయపడే స్టూడెంట్స్ కు .. ఇద్దరికీ యూజ్ అయ్యేలా.. వారికీ భయం పోగొట్టేలా.. గూగుల్ ఓ కొత్త రకమైన యాప్ ను లాంచ్ చేసింది. మరి, ఈ యాప్ ఏంటి! ఎలా దీనిని ఉపయోగించాలి అనే విషయాలను చూసేద్దాం.

స్టూడెంట్స్ అందరికి యూజ్ అయ్యేలా.. గూగుల్ కొత్తగా లాంచ్ చేసిన ఈ యాప్ పేరు ఫోటోమ్యాథ్ . ప్రస్తుతం ఈ యాప్ కు ప్రపంచ వ్యాప్తంగా మిలియన్స్ మంది లెర్నర్స్ ఉన్నారు. గూగుల్ ప్లే స్టోర్ లో ఈ యాప్ అందరికి అందుబాటులో ఉంది. ఇక ఇప్పుడు స్టూడెంట్స్ అంత ఏ మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా కూడా.. గంటలు గంటలు టైమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దానికి ఏ ఫార్ములా యూజ్ చేయాలా అని బ్రెయిన్ కు పని చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. కేవలం వారు ఏ ప్రాబ్లమ్ ను సాల్వ్ చేయాలి అనుకుంటున్నారో.. ఆ ప్రాబ్లమ్ ఫోటో తీసి యాప్ లో అప్ లోడ్ చేస్తే చాలు.. సమాధానాలు వచ్చేస్తాయి. పైగా స్టెప్ టు స్టెప్ చాలా క్లియర్ ఎక్సప్లనేషన్ తో.. ఈ యాప్ అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అందిస్తుంది. ఒక మంచి గైడ్ గా కూడా ఫోటోమ్యాథ్ యాప్ స్టూడెంట్స్ కు బాగా ఉపయోగపడుతుంది.

photo math app 2

2023లోనే గూగుల్ ప్లే స్టోర్ ఈ ఫోటో మ్యాథ్ యాప్ ను అనుబాటులోకి తీసుకుని వచ్చింది. ఈ యాప్ ను స్మార్ట్ కెమెరా క్యాలిక్యులేటర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఏ మ్యాథ్ ప్రాబ్లమ్ ని అయినా ఒక్క ఫోటో తీసి పెట్టేస్తే .. వెంటనే సమాధానాలు వచ్చేస్తాయి కాబట్టి. టెక్నాలిజీ మారుతున్న కొద్దీ.. కొత్త కొత్త యాప్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. వాటి వలన ప్రయోజనాలు పొందేవారు ఉన్నారు. ఇబ్బందులు పడే వారు ఉన్నారు. ఏదేమైనా, ఇలాంటి ఎడ్యుకేషనల్ యాప్స్ మాత్రం.. స్టూడెంట్స్ కు బాగా యూజ్ అవుతాయి అని చెప్పొచ్చు. వారి సమయం వృధా కాకుండా.. ఈ యాప్స్ ద్వారా బెనిఫిట్స్ పొందవచ్చు. మరి, టఫ్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ను కూడా చాలా ఈజీగా సాల్వ్ చేసే.. ఈ ఫోటోమ్యాథ్ యాప్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.