iDreamPost
android-app
ios-app

iPhone 15: ఐఫోన్‌ 15పై కళ్లు చెదిరే ఆఫర్‌.. రూ.45లకే.. ఈ బంపరాఫర్‌ ఎక్కడంటే

  • Published Jul 17, 2024 | 2:01 PMUpdated Jul 17, 2024 | 2:01 PM

iPhone 15-Paytm Mall Offers At Just Rs 44,940: మీరు యాపిల్‌ ప్రొడక్ట్స్‌ లవర్సా.. ఐఫోన్‌ 15 కొనాలని భావిస్తున్నారా.. అయితే మీ కోసమే ఈభారీ డిస్కౌంట్‌ ఆఫర్‌. 45 వేల రూపాయలకే ఐఫోన్‌ 15 కొనుగోలు చేయవచ్చు. ఇంతకు ఈ బంపరాఫర్‌ ఎక్కడంటే..

iPhone 15-Paytm Mall Offers At Just Rs 44,940: మీరు యాపిల్‌ ప్రొడక్ట్స్‌ లవర్సా.. ఐఫోన్‌ 15 కొనాలని భావిస్తున్నారా.. అయితే మీ కోసమే ఈభారీ డిస్కౌంట్‌ ఆఫర్‌. 45 వేల రూపాయలకే ఐఫోన్‌ 15 కొనుగోలు చేయవచ్చు. ఇంతకు ఈ బంపరాఫర్‌ ఎక్కడంటే..

  • Published Jul 17, 2024 | 2:01 PMUpdated Jul 17, 2024 | 2:01 PM
iPhone 15: ఐఫోన్‌ 15పై కళ్లు చెదిరే ఆఫర్‌.. రూ.45లకే.. ఈ బంపరాఫర్‌ ఎక్కడంటే

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టపడే ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల బ్రాండ్‌ ఏది అంటే.. టక్కున చెప్పేది యాపిల్‌. ఫోన్‌, వాచ్‌, ఎయిర్‌పాడ్స్‌.. ఇలా ప్రతి ప్రొడక్ట్‌కి ఎంతో క్రేజ్‌ ఉంటుంది. యాపిల్‌ ఉత్పత్తులు వాడటం స్టేటస్‌గా భావిస్తారు. ఇక చిన్నా చితక సెలబ్రిటీలు మొదలు.. టాప్‌ స్టార్ల వరకు ప్రతి ఒక్కరు యాపిల్‌ ఫోనే వాడతారు. అందుకు కారణం.. దానిలో ఉండే సెక్యూరిటీ ఫీచర్స్‌. ఇకపోతే యాపిల్‌ ప్రొడక్ట్స్‌కి క్రేజ్‌ ఎంత ఉంటుందో.. ధర కూడా అదే స్థాయిలో ఉంటుంది. లేటెస్ట్‌ మోడల్‌ ధర అయితే లక్ష రూపాయలకు పైనే ఉంటుంది. ఈ క్రమంలో యాపిల్‌ కంపెనీ ఐఫోన్‌ లవర్స్‌కి అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఐఫోన్‌ 15 మీద భారీ డిస్కౌంట్‌ ఇస్తోంది ఓ కంపెనీ. 45 వేల రూపాయలకే ఐఫోన్‌15 ని కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది. ఇంతకు ఈ భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌ ఎక్కడంటే..

ప్రస్తుతం ఐఫోన్‌ 15 ధర మన దగ్గర 79,900రూపాయలుగా ఉంది. అయితే మీరు మాత్రం 45 వేల రూపాయలకే ఐఫోన్‌ 15ని కొనుగోలు చేయవచ్చు. పేటీఎం మాల్‌ ఈ భారీ డిస్కౌట్‌ని ఆఫర్‌ చేస్తోంది. ఐఫోన్‌ 15 మీద ఏకంగా 35 వేల రూపాయలు డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తోంది పేటీఎం మాల్‌. అంటే ఐఫోన్‌ 15 ధర ఇండియాలో 79,900 ఉండగా.. పేటీఎం మాల్‌ దీనిపై 34,960 రూపాయలు డిస్కౌంట్‌ ప్రకటించిది. దాంతో పేటీఎం మాల్‌లో ఇప్పుడు ఐఫోన్‌ 15 రేటు 44,940 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. లాంచ్‌ అయిన దగ్గర నుంచి ఐఫోన్‌ 15 మీద ఇంత భారీ తగ్గింపు ప్రకటించడం ఇదే మొదటిసారి.

Iphone 15

ఐఫోన్‌ 15 స్పెసిఫికేషన్స్‌..

ఐఫోన్‌ 15 స్పెసిఫికేషన్‌, ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది హైఎండ్‌ ఫీచర్స్‌తో వస్తుంది. ఇది 6.1 ఇంచ్‌ సూపర్‌ రెటినా ఎక్స్‌డీఆర్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో.. 2556×1179 పిక్సెల్‌ రిజల్యూషన్‌తో వస్తుంది. మొబైల్‌ స్క్రీన్‌ రక్షణ కోసం యాపిల్‌ సెరామిక్‌ షీల్డ్‌ ప్రొటక్షన్‌తో వినియోగించారు. మెయిన్‌ కెమరా సామార్థ్యం వచ్చేసి 48 మెగా పిక్సెల్‌గా ఉండనుంది. రెండు స్పీకర్లు, యూఎస్‌బీ టైప్‌ సీ ఛార్జింగ్‌తో ఈఫోన్‌ వస్తుంది.

ఐఫోన్‌ 15 మీద వేర్వేరు ఈకామర్స్‌ సైట్స్‌ అందిస్తోన్న డిస్కౌంట్స్‌ ఇలా ఉన్నాయి.

  • యాపిల్‌- రూ.79,900
  • పేటీఎం మాల్‌- రూ.44,940
  • జియోమార్ట్‌- రూ.69,900
  • ఫ్లిప్‌కార్ట్‌- రూ.70,999
  • అమెజాన్‌- రూ.70,999
  • విజయ్‌ సేల్స్‌- రూ.70,990
  • క్రోమా- రూ.71,290
  • రిలయన్స్‌ డిజిటల్‌- రూ.71,900

యాపిల్‌ ఐఫోన్‌ 15న మీద ఒక్కో ప్లాట్‌ఫామ్‌లో ఒక్కో ధర ఉంది. అందుకే ఐఫోన్‌ 15 కొనాలని భావించే వారు ముందుగా ఆయా సైట్లలో రేటు చెక్‌ చేసి.. ఆ తర్వాత బెస్ట్‌ ఆఫర్‌ ఇచ్చే దానిలో కొనుగోలు చేయడం ఉత్తమం అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి