P Venkatesh
Oppo A3X 5G: ఒప్పో నుంచి మరో కొత్త ఫోన్ అందుబాటులోకి వచ్చింది. అడ్వాన్స్డ్ ఫీచర్లతో బడ్జెట్ ధరలోనే లభ్యంకానున్నది. తాజాగా లాంచ్ చేసిన ఒప్పో ఏ3ఎక్స్ 5జీ యూజర్లను ఆకట్టుకుంటోంది.
Oppo A3X 5G: ఒప్పో నుంచి మరో కొత్త ఫోన్ అందుబాటులోకి వచ్చింది. అడ్వాన్స్డ్ ఫీచర్లతో బడ్జెట్ ధరలోనే లభ్యంకానున్నది. తాజాగా లాంచ్ చేసిన ఒప్పో ఏ3ఎక్స్ 5జీ యూజర్లను ఆకట్టుకుంటోంది.
P Venkatesh
స్మార్ట్ ఫోన్ హ్యూమన్ లైఫ్ స్టైల్ ను మార్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏ పని జరగాలన్నా స్మార్ట్ ఫోన్ అవసరం తప్పనిసరి అయ్యింది. అందుకే దాదాపుగా అందరు స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. యూజర్ల అభిరుచులకు తగ్గట్టుగా అడ్వాన్స్డ్ ఫీచర్లతో మొబైల్ తయారీ కంపెనీలు స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ప్రియుల కోసం మరో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి లాంఛ్ అయ్యింది. ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ఒప్పో అధునాతన ఫీచర్లతో ఒప్పో ఏ3ఎక్స్ 5జీని లాంచ్ చేసింది. బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉంది.
ఒప్పో ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. యూజర్ల ఎక్స్ పెక్టేషన్స్ కు తగ్గట్టుగా సరికొత్త ఫోన్లను తీసుకొస్తుంది ఒప్పో. తాజాగా లాంచ్ చేసిన ఒప్పో ఏ3ఎక్స్ 5జీ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఈ కొత్త ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తున్నది. వీటిలో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,499గా ఉంది. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499గా నిర్ణయించారు. స్పార్కిల్ బ్లాక్, స్టారీ పర్పుల్, స్టార్ లైట్ వైట్ కలర్ ఆప్షన్లలో లభ్యమవుతున్నది.
ఒప్పో ఏ3ఎక్స్ 5జీలో 6.67 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లేను అందించారు. రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ తో వస్తుంది. స్ప్లాష్ టచ్ టెక్నాలజీని ఒప్పో ఏ3ఎక్స్ 5జీలో అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్పై ఈ ఫోన్ పని చేయనుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ఓఎస్ 14.0.1 ఆపరేటింగ్ సిస్టంపై ఒప్పో ఏ3ఎక్స్ 5జీ రన్ కానుంది. కెమెరా విషయానికి వస్తే.. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా 8 మెగాపిక్సెల్గా ఉంది. దీంతోపాటు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. మిలటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, మల్టీపుల్ లిక్విడ్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఐపీ54 ఫీచర్ కు ఒప్పో ఏ3ఎక్స్ 5జీ సపోర్ట్ చేయనుంది. ఒప్పో ఏ3ఎక్స్ 5జీ బ్యాటరీ కెపాసిటీ 5100 ఎంఏహెచ్ కాగా 45వాట్ సూపర్వూక్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది.