Oppo F27 5G: Oppo నుంచి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు తెలిస్తే కొనేస్తారంతే

Oppo F27 5G: మార్కెట్ లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ఒప్పో కంపెనీ ఒప్పో ఎఫ్27 5జీ ఫోన్ ను లాంచ్ చేసింది. ధర ఎంతంటే?

Oppo F27 5G: మార్కెట్ లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ఒప్పో కంపెనీ ఒప్పో ఎఫ్27 5జీ ఫోన్ ను లాంచ్ చేసింది. ధర ఎంతంటే?

స్మార్ట్ ఫోన్ ప్రియులకు మరో కొత్త ఫోన్ అందుబాటులోకి వచ్చింది. కొందరు మొబైల్ యూజర్లు తరచుగా ఫోన్లను చేంజ్ చేస్తుంటారు. లేటెస్ట్ వర్షన్ ఫోన్లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కెమెరా క్వాలిటీ, ప్రాసెసర్, బ్యాటరీ ప్యాకప్ బాగుండే ఫోన్లకు క్రేజీ డిమాండ్ ఉంటుంది. మరి అడ్వాన్డ్స్ ఫీచర్లతో మిడ్ రేంజ్ లో స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నారా? అయితే ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ఒప్పో కంపెనీ ఒప్పో ఎఫ్27 5జీ ఫోన్ ను లాంచ్ చేసింది. నేడు మార్కెట్ లోకి రిలీజ్ అయ్యింది. దీని ధర ఎంతంటే?

ఒప్పో ఎఫ్27 5జీ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ లతో వస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.22,999, రూ.24,999గా కంపెనీ నిర్ణయించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, వన్ కార్డ్, ఫెడరల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి రూ.2,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ అంబర్ ఆరెంజ్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు వస్తుంది.

ఈ ఫోన్ లో 50-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ కెమెరా ఉంటాయి. సెల్ఫీల కోసం 32-మెగా పిక్సెల్ కెమెరా అందించారు. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ కంపెనీ కలర్ ఓఎస్ 14 స్కిన్ వర్షన్ పై పని చేస్తుంది. 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. వై-ఫై 6, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్ -సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ64 రేటింగ్ ఫీచర్ తో వస్తుంది.

Show comments