iDreamPost
android-app
ios-app

భారీ తగ్గింపు.. రూ.33 వేల స్మార్ట్‌ ఫోన్‌.. 20వేలకే..

  • Published Jun 05, 2024 | 3:08 PM Updated Updated Jun 05, 2024 | 3:08 PM

OnePlus Nord 3: స్మా‍ర్ట్‌ కొనాలనుకునేవారికి అమెజాన్‌ భారీ ఆఫర్‌ ప్రకటించింది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ మొబైల్‌ మీద ఏకంగా 13 వేల రూపాయల డిస్కౌంట్‌ ప్రకటించింది. ఆ వివరాలు..

OnePlus Nord 3: స్మా‍ర్ట్‌ కొనాలనుకునేవారికి అమెజాన్‌ భారీ ఆఫర్‌ ప్రకటించింది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ మొబైల్‌ మీద ఏకంగా 13 వేల రూపాయల డిస్కౌంట్‌ ప్రకటించింది. ఆ వివరాలు..

  • Published Jun 05, 2024 | 3:08 PMUpdated Jun 05, 2024 | 3:08 PM
భారీ తగ్గింపు.. రూ.33 వేల స్మార్ట్‌ ఫోన్‌.. 20వేలకే..

నేటి కాలంలో స్మార్ట్‌ ఫోన్‌ అనేది నిత్యావసరంగా మారింది. స్కూల్‌కు వెళ్లే విద్యార్థులు మొదలు.. వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్‌ ఫోన్‌ దర్శనం ఇస్తుంది. దీని వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. లాభనష్టాల సంగతి పక్కకు పెడితే.. స్మార్ట్‌ ఫోన్‌ అనేది మన జీవితాల్లో భాగం అయ్యింది. ఒకప్పుడు వీటి ధరలు భారీగా ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం చాలా వరకు దిగి వస్తున్నాయి. ఇక ఈకామర్స్‌ సైట్లలో వీటి మీద చాలా ఆఫర్లు అందుబాటులో ఉంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ స్మార్ట్‌ ఫోన్‌పై భారీ బంపరాఫర్‌ ప్రకటించారు. 33 వేల రూపాయల ఖరీదైన మొబైల్‌ని ఏకంగా 20 వేల రూపాయలకే కొనే అవకాశం కల్పిస్తున్నారు. ఆ వివరాలు..

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌ వన్‌ప్లస్‌పై అమెజాన్‌ ఈ భారీ బంపరాఫర్‌ ప్రకటించింది. వన్‌ప్లస్‌ నార్డ్‌ 4ను రిలీజ్‌ చేసేందుకు సిద్దమవుతోంది. దీనికంటే ముందు గతేడాది రిలీజ్ చేసి వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 5 జీ స్మార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపు ప్రకటించింది. అమెజాన్‌లో ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంది. అంతేకాక వన్‌ప్లస్‌ నార్డ్‌ 3పై కూపన్లు, బ్యాంక్ డిస్కౌంట్‌లను కూడా ఇస్తుంది. వన్‌ ప్లస్‌ నార్డ్‌ 3 స్మార్ట్ ఫోన్ గతేడాది 33,999 రూపాయల ప్రారంభ ధరతో మార్కెట్‌లోకి విడుదలయ్యింది.

ఇప్పుడు నెక్ట్స్‌ జెనరేషన్‌ వన్‌ప్లస్‌ నార్డ్‌ 4ను రిలీజ్‌ చేసేందుకు రెడీ అవుతుండటంతో.. నార్డ్‌ 3పైన ఏకంగా 13 వేల రూపాయల డిస్కౌంట్‌ ప్రకటించారు. వన్‌ ప్లస్‌ నార్డ్‌ 3లో 8 జీబీ రామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ఉన్న ఫోన్‌ ఇప్పుడు రూ.20,999లకే లభిస్తోంది. బ్యాంక్‌ ఆఫర్‌ వల్ల మరో 1000 రూపాయలు తగ్గుతుంది. అంటే మొత్తంగా 13వేల డిస్కౌంట్ తర్వాత.. ఈ స్మార్ట్ ఫోన్ 19,999 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు అన్నమాట.

వన్‌ ప్లస్‌ నార్డ్‌ 3 5G స్మార్ట్ ఫోన్ ఫీచర్స్‌

ఈ స్మార్ట్ ఫోన్ 6.74 అంగుళాల 1.5కే అమోలెడ్‌ డిస్ ప్లే తో వస్తోంది. 120 హెచ్‌జడ్‌ రిఫ్రెష్ రేట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. ఈ హ్యాండ్ సెట్‌ 9000 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది ఆక్సిజన్‌ ఓఎస్‌ బేస్డ్ ఆండ్రాయిడ్ 13 వెర్షన్ తో పనిచేస్తుంది. దీనిని ఆండ్రాయిడ్ 14 కు అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు. ఇది 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ, 80వాట్స్‌ ఛార్జింగ్ సపోర్ట్ చేసే సీ టైప్‌ ఛార్జర్ తో కొనుగోలు చేయొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే ఫోటగ్రఫీ, వీడియోలు, వాట్సాప్ కాల్స్ కోసం ఇందులో ట్రిపుల్ కెమెరా ఆప్షన్‌ ఉంది.

gamdomCasibommarsbahis girişMarsbahisJojobet Giriş