iDreamPost
android-app
ios-app

గోల్డేన్ ఛాన్స్.. రూ. పది లక్షలకే లగ్జరీ కార్లైన BMW, ఆడీ, బెంజ్!

  • Published Dec 05, 2023 | 6:51 PM Updated Updated Dec 05, 2023 | 6:51 PM

లగ్జరీ కార్లు కావాలనుకునే వారికి గుడ్ న్యూస్. తక్కువ ధరకే విలువైన కార్లను దక్కించుకోవచ్చు. అదేలా అంటే?

లగ్జరీ కార్లు కావాలనుకునే వారికి గుడ్ న్యూస్. తక్కువ ధరకే విలువైన కార్లను దక్కించుకోవచ్చు. అదేలా అంటే?

  • Published Dec 05, 2023 | 6:51 PMUpdated Dec 05, 2023 | 6:51 PM
గోల్డేన్ ఛాన్స్.. రూ. పది లక్షలకే లగ్జరీ కార్లైన BMW, ఆడీ, బెంజ్!

ఈ రోజుల్లో సొంత వాహనం ఉండాలనుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. వ్యక్తిగత వాహనాల కొనుగోలుకు జనాలు మొగ్గు చూపుతున్నారు. బైక్స్, కార్లు విరివిగా కొనుగోలు చేస్తున్నారు. అయితే సాధారణ కార్లకంటే లగ్జరీ కార్లు ఉంటే రాయల్ గా ఉంటుందని భావించే వారు కూడా ఎక్కువే. కానీ లగ్జరీ కార్లు కొనాలంటే మాత్రం చేతి చమురు వదిలించుకోవాల్సిందే. సంపన్నులకైతే అది పెద్ద విషయమేమీ కాదు.. కానీ సామాన్యులకు మాత్రం అందని ద్రాక్షే. సెలబ్రీటీలు, వ్యాపారస్తులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు మాత్రమే లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు లగ్జరీ కారును సొంతం చేసుకునే అవకాశం వచ్చింది. కేవలం రూ. 10 లక్షలకే ఆడీ, బెంజ్, బీఎమ్ డబ్య్లూ వంటి విలువైన కార్లను దక్కించుకోవచ్చు. అదేంటి అంత తక్కువ ధర అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

లగ్జరీ కార్ల ధరలు సుమారు రూ. 40 లక్షల నుంచి రూ. 3 కోట్ల పైమాటే. మరి అంతటి ధరలున్న విలువైన కార్లను కొనాలంటే ఆలోచించాల్సిన విషయమే. అయితే లగ్జరీ కార్లలో బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడీ వంటి వాటికి ఆధరణ ఎక్కువ. ఈ కార్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. కాగా ఈ కార్లను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అయితే ఇవి కొత్త కార్లు మాత్రం కావు. సెకండ్ హ్యాండ్ కార్లు. లగ్జరీ కార్లను సెకండ్ హ్యాండ్ రూపంలో కొనుగోలు చేసి లగ్జరీ కారు ఉండాలనే మీ కలను నిజం చేసుకోవచ్చు. బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడీ కార్ల ధర సెకండ్ హ్యాండ్ లో రూ. 10 లక్షలకే కొనుగోలు చేయవచ్చును. ఆ కార్ల వివరాలు..

ఆడీ ఏ4

ఆడీ జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ. 2011 లో దేశీయ మార్కెట్లోకి ఎంట్రిలెవల్‌ కారు ఆడీ ఏ4 సెడాన్‌ను లాంచ్ చేసింది. కొత్త కారు ధర అయితే రూ. 38.10లక్షల నుంచి రూ. 41.20లక్షల మధ్య ఉంటుంది. ఇదే కారును సెకండ్ హ్యాండ్ లో కొనుగోలు చేయాలనుకుంటే రూ. 10 లక్షల లోపు ధరలోనే వస్తుంది.

బీఎండబ్ల్యూ 5-సిరీస్

ప్రముఖ ఆటోమోబైల్ తయారీ సంస్థ బీఎమ్ డబ్య్లూ రూ. 10 లక్షల లోపు లగ్జరీ కార్ల జాబితాలో ఉన్న మరొక కారు బీఎండబ్ల్యూ 5-సిరీస్. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న లగ్జరీ కార్లలో ఒకటిగా గుర్తింపు పొందిన బీఎండబ్ల్యూ 5-సిరీస్ పోర్ట్‌ఫోలియోలో అనేక ఫీచర్లను అందిస్తుంది. 2008లో లాంచ్ అయిన ఈ కారు అసలు ధర రూ. 49.9లక్షల నుంచి రూ. 61.2లక్షలుగా ఉంది. అయితే సెకండ్ హ్యాండ్ లో మాత్రం రూ. 9లక్షలకు కొనుగోలు చేయొచ్చు.

మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్

మెర్సిడెస్-బెంజ్ నుంచి మరో కారు మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్ సెకండ్ హ్యాండ్ లో రూ. 10 లక్షలలోపే అందుబాటులో ఉంది. 2008లో లాంచ్ అయిన ఈ కారు కొత్తది అయితే రూ. 39.9లక్షల నుంచి రూ. 43.54లక్షలు ఉంటుంది. సెకండ్ హ్యాండ్ కారు అయితే రూ. 8.5లక్షలుగా ఉంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet