VIDEO: చంద్రయాన్‌-3 సక్సెస్‌పై ఇస్రో మాజీ ఛైర్మన్‌ కే.శివన్‌ ఏమన్నారంటే?

‘ఓటమి.. విజయానికి మెట్టు’ అని అంటుంటారు. ప్రస్తుతం చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతం కావడంతో ఈ మాట అక్షరసత్యంగా అనిపిస్తోంది. 2019లో ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగం చివరి దశలో.. చంద్రుడిపై మరో రెండు నిమిషాల్లో ల్యాండ్‌ అవుతుందనగా ల్యాండర్‌ క్రాష్‌ ల్యాండింగ్‌ అవ్వడంతో ప్రయోగం విఫలం అయింది. ఆ సమయంలో ఇస్రో ఛైర్మన్‌గా ఉన్న కే.శివన్‌ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు భారతీయుల హృదాయాలను కలిచివేశాయి. ప్రధాని మోదీ.. శివన్‌ని ఓదార్చుతున్న వీడియో అప్పట్లో తెగ వైరల్‌ అయింది.

ఆ వైఫల్యం నుంచి వేగంగా కోలుకున్న ఇస్రో.. మరింత శక్తిని కూడదీసుకుని, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, తప్పులను, పొరపాట్లను సరిదిద్దుకుని చంద్రయాన్‌-3 ప్రయోగానికి సంసిద్ధమైంది. జులై 14న శ్రీహరి కోట నుంచి చంద్రయాన్‌-3 రాకెట్‌ను ప్రయోగించింది. వివిధ దశలను విజయవంతంగా దాటుకుంటూ.. విక్రమ్‌ ల్యాండర్‌.. చంద్రుడి దక్షిణ ద్రువంపై సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్‌ అయింది. దీంతో చంద్రయాన్‌ ప్రయోగం విజయవంతం అయినట్లు ఇస్రో ప్రకటించింది. విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై దిగుతున్న లైవ్‌ యావత్‌ ప్రపంచ ఎంతో ఆసక్తిగా వీక్షించి.. విజయవంతంగా ల్యాండ్‌ కాగానే సంతోషంతో పులకించిపోయింది. భారతీయుల ఎంతో గర్వంగా ఫీల్‌ అయిన క్షణమది.

ఇలాంటి ఉద్విగ్న క్షణాన్ని 2019లో చంద్రయాన్‌-2ను ప్రయోగించిన ఇస్రో మాజీ ఛైర్మన్‌ కే.శివన్‌ ఎలా ఆస్వాదించారో అనే ఆసక్తి అందరిలో కలిగింది. అయితే.. ఇస్రో సాధించిన విజయం యావత్‌ దేశానికి గర్వకారణంగా శివన్‌ పేర్కొంటూ సంతోషంతో చిరునవ్వులు చిందించారు. 2019లో ప్రయోగం విఫలమైనప్పుడు కన్నీళ్లు పెట్టుకున్న ఆయన ఫేస్‌పై ఇప్పుడు నవ్వులు చూస్తుంటే మరింత సంతోషంగా ఉందంటూ నెటిజన్లు అంటున్నారు. చంద్రయాన్‌-3 ప్రయోగం సక్సెస్‌ తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్‌గా మారింది. 2019లో ప్రయోగం విఫలమైనా.. ఇస్రో కోసం, దేశం కోసం శివన్‌ శ్రమను వెలకట్టలేమని నెటిజన్లు అంటున్నారు. దేశం గర్వించదగిన శాస్త్రవేత్తల్లో శివన్‌ ఒకరిని చంద్రయాన్‌-3 సక్సెస్‌ సందర్భంగా ఆయనను గుర్తుచేసుకుంటున్నారు. కన్నీళ్లు.. ఆనందభాష్పాలుగా మారిన క్షణం అంటూ పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన చంద్రయాన్‌ 3.. ఇస్రో సరికొత్త చరిత్ర

Show comments