iDreamPost
android-app
ios-app

జియో నుంచి మరో కొత్త 4జీ ఫోన్.. రూ. 3 వేలలోపే.. క్రేజీ ఫీచర్లు

  • Published Sep 12, 2024 | 12:00 AM Updated Updated Sep 12, 2024 | 12:00 AM

Jiophone Prima 2: రిలయన్స్ జియో నుంచి అదిరిపోయే 4జీ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ధర కూడా చాలా తక్కువగా ఉంది. కేవలం రూ. 3 వేల లోపే దీన్ని దక్కించుకోవచ్చు.

Jiophone Prima 2: రిలయన్స్ జియో నుంచి అదిరిపోయే 4జీ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ధర కూడా చాలా తక్కువగా ఉంది. కేవలం రూ. 3 వేల లోపే దీన్ని దక్కించుకోవచ్చు.

  • Published Sep 12, 2024 | 12:00 AMUpdated Sep 12, 2024 | 12:00 AM
జియో నుంచి మరో కొత్త 4జీ ఫోన్.. రూ. 3 వేలలోపే.. క్రేజీ ఫీచర్లు

టెలికాంరంగంలోకి ఎంట్రీతోనే సంచలనాన్ని క్రియేట్ చేసింది రిలయన్స్ జియో. కస్టమర్లకు ఉచితంగా సిమ్ కార్డులు అందించింది. ఫ్రీగా డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ సౌకర్యాన్ని కల్పిస్తూ మిగతా టెలికాం కంపెనీలకు సవాల్ విసిరింది. జియో అందించే బెనిఫిట్స్ తో అనతికాలంలోనే కోట్లాది మంది జియో యూజర్లుగా మారారు. దీంతో జియో టెలికాం రంగంలో టాప్ పొజిషన్ లోకి చేరి గట్టిపోటీనిచ్చింది. అంతటితో ఆగకుండా జియో ఫోన్లను కూడా రూపొందించి మార్కెట్ లోకి తీసుకొచ్చింది. తక్కువ ధరలోనే ఫీచర్ ఫోన్లను అందించింది. ఇక ఇప్పుడు మరో కొత్త 4జీ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ధర రూ. 3వేల లోపే ఉంది. క్రేజీ ఫీచర్లతో యూజర్లను ఆకర్షిస్తోంది.

జియో నుంచి ఇటీవల జియో భారత్ జే1 4జీ ఫీచర్ ఫోన్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో 4జీ ఫీచర్‌ ఫోన్ ను పరిచయం చేసింది. క్రేజీ ఫీచర్లతో జియోఫోన్‌ ప్రైమా 2 పేరిట రిలీజ్ చేసింది. ఇది కర్వ్డ డిజైన్ కీప్యాడ్ ఫోన్. ఈ ఫోన్ ధర రూ. 2,799గా కంపెనీ నిర్ణయించింది. తక్కువ ధరలో ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్ లో 2.4 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. ఇందులో బ్యాక్‌, ఫ్రంట్‌ (సెల్ఫీ) కెమెరాలున్నాయి. డైరెక్ట్ వీడియో కాల్స్‌ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. క్వాల్‌కామ్‌ చిప్‌తో 512 ఎంబీ ర్యామ్‌, 4జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీతో వస్తుంది.

కైఓఎస్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో యూట్యూబ్‌, గూగుల్‌ అసిస్టెంట్‌, ఫేస్‌బుక్‌ యాప్‌లతోపాటు యూపీఐ పేమెంట్స్‌ కోసం జియోపే కూడా ఉంటుంది. 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్యాకేజీతో వస్తుంది. ఈ ఫోన్ 23 రకాల భారతీయ భాషలను సపోర్ట్‌ చేస్తుంది. జియో నెట్‌వర్క్‌ కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కాగా, దీనికి ప్రత్యేక రిచార్జ్‌ ప్లాన్లున్నాయి. రూ.91లకే రోజుకు 100ఎంబీ డాటాతో 28 రోజుల కాలపరిమితిపై అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. ఈ ఫోన్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişjojobetjojobetMadridbetJojobetjojobetJojobetjojobetJojobetgalabetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişşanlıurfa haberbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet