సూర్యుడి వైపు భారత్‌ అడుగులు.. నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్‌ 1

అందని చందమామాను ముద్దాడిన భారత్.. తాజాగా భగభగ మండే సూర్యుడిపై ప్రయోగాలకు సిద్ధమైంది. అంతరిక్షయానంలో మరో అద్బుతానికి తెరలేపింది. భారత పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా తొలిసారి సూర్చుడిపై చేపడుతున్న ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని పంపింది. ఈ ప్రయోగానికి సంబంధించి శుక్రవారం మధ్యాహ్నం 11.10 నిమిషాలకు కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైంది. దాదాపు 24 గంటల 40 నిమిషాలపాటు కొనసాగిన కౌంట్‌డౌన్‌.. శనివారం ఉదయం 11.50 నిమిషాలకు ఆదిత్య-ఎల్‌1 నింగిలోకి దూసుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట వేదికగా దీన్ని ప్రయోగించారు.

పీఎస్ఎల్ వీసీ-57 రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. 15 లక్షల కిలోమీటర్లు, 4 నెలల ప్రయాణం చేసిన తర్వాత సోలార్ మిషన్ ఎల్-పాయింట్ దగ్గర హాలో ఆర్బిట్‌కి చేరుతుంది. సుమారు ఐదేళ్లకు పైగా ఆదిత్య ఎల్‌1 ప్రయోగాలు చేయనుంది. ప్రతి రోజు భూమికి 1440 ఫొటోలు పంపనుంది. చంద్రయాన్-3 సక్సెస్‌ను సెలబ్రేట్‌ చేసుకున్న యావత్ భారతవని, ఈ ప్రయోగం పట్ల ఎంతో ఆసక్తి కనబరుస్తుంది. సూర్యుడిపై పరిశోధనల కోసం ఇస్రో పెట్టిన ఖర్చు కేవలం 378 కోట్ల రూపాయలు కావడం విశేషం. సరిగ్గా ఇలాంటి ప్రయోగం కోసం అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ నాసా పెట్టిన ఖర్చు కన్నా ఇది 97 శాతం తక్కువ. మొత్తం 12,300 కోట్ల రూపాయలను నాసా ఖర్చు పెట్టింది.

Show comments