iDreamPost
android-app
ios-app

అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌ పై బంపరాఫర్.. కేవలం 8వేలకే

  • Published May 15, 2024 | 10:37 PM Updated Updated May 15, 2024 | 10:37 PM

మీరు తక్కువ ధరలో లభించే ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇన్ఫినిక్స్ కు చెందిన స్మార్ట్ ఫోన్ పై మంచి ఆఫర్ ఉంది. ఈ మొబైల్ ను మీరు ఎనిమిది వేలకే సొంతం చేసుకోవచ్చు.

మీరు తక్కువ ధరలో లభించే ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇన్ఫినిక్స్ కు చెందిన స్మార్ట్ ఫోన్ పై మంచి ఆఫర్ ఉంది. ఈ మొబైల్ ను మీరు ఎనిమిది వేలకే సొంతం చేసుకోవచ్చు.

  • Published May 15, 2024 | 10:37 PMUpdated May 15, 2024 | 10:37 PM
అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌ పై బంపరాఫర్.. కేవలం 8వేలకే

స్మార్ట్ ఫోన్ లవర్స్ మార్కెట్ లోకి కొత్త మొబైల్స్ ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తుంటారు. కొంతమంది లేటెస్ట్ వర్షన్ ఫోన్ లను వాడేందుకు ఖర్చుకు కూడా వెనకాడకుండా కొనేస్తుంటారు. మొబైల్ మార్కెట్ లో అద్భుతమైన ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే స్మార్ట్ ఫోన్ ధరలు కాస్త ఎక్కువగా ఉండడంతో కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. ఈ క్రమంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఇన్ఫినిక్స్ కు చెందిన ఓ స్మార్ట్ ఫోన్ పై కళ్లు చెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో 11 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్ 8 వేలకే దక్కించుకోవచ్చు. మతిపోయే ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడే సొంతం చేసుకోండి.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్లకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది ఈ ఫోన్లకు. ధరలు కూడా తక్కువగానే ఉండడంతో ఈ కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్ల సేల్స్ పెరుగుతున్నాయి. మరి మీరు కూడా ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇన్ఫినిక్స్ బ్రాండ్ కు చెందిన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 పై ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఈ స్మార్ట్ ఫోన్ పై 27 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ అసలు ధర రూ. 10999గా ఉంది. ఆఫర్ లో భాగంగా దీన్ని మీరు రూ. 7999కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను వినియోగించుకుని మరింత తగ్గింపును పొందొచ్చు.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 సూపర్ ఫీచర్లను కలిగి ఉన్నది. ఈ స్మార్ట్ ఫోన్ 6.6 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ను కలిగి ఉంది. 90 హెర్ట్జ్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను ఈ డిస్‌ప్లేలో అందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 18 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. ఏఐ కెమెరా దీనిలోని ప్రత్యేక ఫీచర్. ఈ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 10 వాట్స్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. కనెక్టివిటీ ఫీచర్స్‌ విషయానికొస్తే ఇందులో.. డ్యూయల్ సిమ్ 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ వీ5, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ వంటి కనెక్టివిటీ ఫీచర్స్‌ను అందించారు. మరి మీరు ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetbetwooncasibomiptv satın alCasibom