iDreamPost
android-app
ios-app

కొంటే iPhoneనే కొనాలని చూస్తున్నారా?.. ఐఫోన్ 15 ప్లస్‌పై భారీ డిస్కౌంట్‌.. త్వరపడండి

  • Published Sep 03, 2024 | 4:21 PM Updated Updated Sep 03, 2024 | 4:21 PM

Apple iPhone 15 Plus: ఐఫోన్ లవర్స్ కు అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో ఐఫోన్ 15 ప్లస్‌పై భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. మొత్తం ఎంత తగ్గిందంటే?

Apple iPhone 15 Plus: ఐఫోన్ లవర్స్ కు అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో ఐఫోన్ 15 ప్లస్‌పై భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. మొత్తం ఎంత తగ్గిందంటే?

  • Published Sep 03, 2024 | 4:21 PMUpdated Sep 03, 2024 | 4:21 PM
కొంటే iPhoneనే కొనాలని చూస్తున్నారా?.. ఐఫోన్ 15 ప్లస్‌పై భారీ డిస్కౌంట్‌.. త్వరపడండి

వరల్డ్ వైడ్ గా యాపిల్ ప్రొడక్ట్స్ కు ఉండే క్రేజే వేరు. న్యూ యాపిల్ ఐఫోన్స్ రిలీజ్ అవుతున్నాయంటే చాలు హాట్ కేకుల్లా సేల్ అవుతుంటాయి. ఖర్చు ఎక్కువైనా సరే ఐఫోన్ కొనేందుకు వెనకాడరు టెక్ ప్రియులు. ఐఫోన్ లో ఉండే ఫీచర్లకు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఐఫోన్ లో ఉండే సెక్యూరిటీ ఫీచర్ల కారణంగా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కొందరైతే కొంటే ఐఫోన్ మాత్రమే కొనాలని చూస్తుంటారు. అయితే అధిక ధరల కారణంగా ఆఫర్లు ఉంటే బాగున్ను అని వెయిట్ చేస్తుంటారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ 15 ప్లస్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఏకంగా 13 వేలకు పైగా తగ్గింపును పొందొచ్చు.

ఐఫోన్ 16 త్వరలోనే మార్కెట్ లోకి రానున్నది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 15 ప్లస్ ధరలు తగ్గాయి. ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్‌ 15 ప్లస్‌ 128జీబీ బేస్‌ వేరియంట్‌ పై 15 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.89,600గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ.75,999కే కొనుగోలు చేయొచ్చు. అంటే దాదాపు రూ.13 వేలకు పైగా వరకు తగ్గింపు పొందొచ్చు. హెచ్‌ఎస్‌బీసీ, ఫెడరల్‌ బ్యాంక్‌ క్రెడిట్‌కార్డ్‌ ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,500 వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కార్డ్‌ హోల్డర్లకు, యూపీఐ సాయంతో కొనుగోలు చేసే వారికి రూ.1,000 రాయితీ ఉంటుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ తో కొనుగోలు చేస్తే ఈ ఫోన్ ను రూ. 46,350కే దక్కించుకోవచ్చు.

Iphone 15 plus2

ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. 6.7 అంగుళాల సూపర్‌ రెటినా ఎక్స్‌డీఆర్‌ ఓల్‌ఈడీ డిప్‌ప్లేతో ఐఫోన్‌ 15 ప్లస్‌ ఫోన్‌ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. యూఎస్‌బీ టైప్‌- సీ సపోర్ట్‌తో తీసుకొచ్చిన ఈ మొబైల్‌లో.. 48 ఎంపీ సెన్సర్, 12 ఎంపీ అల్ట్రా వైడ్‌ షూటర్‌, 12 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఈ ఐఫోన్‌ 15 ప్లస్‌ మోడల్‌ 4383ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ A16 బయోనిక్‌ చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. ఈ ఐఫోన్‌ IP68 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఫేస్ ఐడీ, ప్రాక్సిమిటీ సెన్సార్‌, డ్యూయల్‌ యాంబియంట్‌ లైట్‌ సెన్సార్‌, బారోమీటర్‌ వంటి సెన్సార్‌లను కలిగి ఉంది.

Jojobet GirişjojobetjojobetMadridbetJojobetjojobetJojobetjojobetJojobetgalabetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişşanlıurfa haberbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet