iDreamPost
android-app
ios-app

బంపరాఫర్.. రూ. 25 వేల Laptop రూ. 14 వేలకే.. త్వరపడండి!

మీరు ఈ మధ్య కాలంలో ల్యాప్ టాప్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో ల్యాప్ టాప్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. రూ. 14 వేలకే సొంతం చేసుకోవచ్చు.

మీరు ఈ మధ్య కాలంలో ల్యాప్ టాప్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో ల్యాప్ టాప్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. రూ. 14 వేలకే సొంతం చేసుకోవచ్చు.

బంపరాఫర్.. రూ. 25 వేల Laptop రూ. 14 వేలకే.. త్వరపడండి!

రిలయన్స్ జియో టెలికాం రంగంలో పెనుసంచలనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. కోట్లాది మంది యూజర్లను కలిగి మిగతా కంపెనీలకు గట్టిపోటీనిస్తుంది. జియో నుంచి ఇప్పటికే అందరికి అందుబాటు ధరలో ఉండే విధంగా మొబైల్ ఫోన్స్ రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేసింది. ఆ తర్వాత ల్యాప్ టాప్ లను కూడా జియో ప్రవేశ పెట్టింది. గతేడాది జియో బుక్ పేరిట ఓ సరికొత్త ల్యాప్ టాప్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. మీరు ఈ మధ్యకాలంలో ల్యాప్ టాప్ ను తీసుకోవాలనుకుంటే జియోబుక్ ల్యాప్ టాప్ ను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో ఈ ల్యాప్ టాప్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చాక స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్ లను వినియోగించే వారి సంఖ్య పెరిగిపోతోంది. కరోనా వచ్చినప్పటి నుంచి ఆన్ లైన్ లోనే అన్ని పనులు చక్కబెడుతున్నారు. ఉద్యోగులకు ఆఫీస్ వర్క్, విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు, ఇతర స్టడీ మెటీరియల్ డౌన్ లోడ్ చేసుకునేందుకు ల్యాప్ టాప్ లనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇలాంటి వారి కోసం రిలయన్స్ జియోకు చెందిన జియో బుక్ ల్యాప్ టాప్ స్మార్ట్ ఫోన్ కంటే తక్కువ ధరలోనే అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో రూ. 25 వేల ధర ఉన్న జియో బుక్ ల్యాప్ టాప్ రూ. 10,299 తగ్గింపు ధరతో రూ. 14701 కే దక్కించుకోవచ్చు. అంటే ఈ ల్యాప్ టాప్ పై 41 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.

ఫీచర్లు

జియో బుక్ ల్యాప్ టాప్ లో జియో ఓఎస్, డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై, 2 జీహెచ్ ఆక్టా కోర్‌ చిప్‌సెట్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్‌ మెమరీ, 11.6 అంగుళాల యాంటీ–గ్లేర్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, 4 జీబీ ఎల్‌పీడీడీఆర్‌ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, ఇన్ఫినిటీ కీబోర్డ్, లార్జ్‌ మల్టీ గెస్చర్‌ ట్రాక్‌ప్యాడ్‌తో తయారైంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 8 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఇది జియో ఆపరేటింగ్ సిస్టమ్‌తో కంప్యూటర్‌ను రన్ చేసే మీడియా టెక్ ఆక్టాకోర్ ప్రాసెసర్ కలిగి ఉంది. ఇందులో జియో 4జీ కనెక్టివిటీ సపోర్ట్ ఉంది. 100 జీబీ క్లౌడ్‌ స్టోరేజ్‌ ఉందని కంపెనీ వెల్లడించింది. హెచ్‌డీ క్యాలిటీతో వెబ్‌ క్యామ్, స్క్రీన్‌ ఎక్స్‌టెన్షన్,హెచ్‌డీఎంఐ పోర్ట్స్‌, స్టీరియో స్పీకర్స్, వైర్‌లెస్‌ ప్రింటింగ్, ఇంటిగ్రేటెడ్‌ చాట్‌బాట్ వంటి అద్భుతమైన ఫీచర్లు జియోబుక్ ల్యాప్ టాప్ సొంతం. మీరు ఈ ల్యాప్ టాప్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.