iDreamPost
android-app
ios-app

iPhone 13: రూ.59,900 ఐఫోన్ 13.. కేవలం రూ.39,999కే!

  • Published Oct 01, 2023 | 6:27 PM Updated Updated Oct 01, 2023 | 6:27 PM
  • Published Oct 01, 2023 | 6:27 PMUpdated Oct 01, 2023 | 6:27 PM
iPhone 13: రూ.59,900 ఐఫోన్ 13.. కేవలం రూ.39,999కే!

స్మార్ట్ ఫోన్స్ లో ఐఫోన్ అంటే ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. అయితే ఐఫోన్ కొనాలి అంటే కాస్త ఖర్చుతో కూడుకున్న విషయం. అందుకే చాలా మందికి ఆ ఫోన్ కొనాలి అనేది కలగానే ఉండిపోతోంది. కానీ, ఇప్పుడు క్రేజీ ఆఫర్స్, క్రేజీ డీల్స్ వల్ల ఐఫోన్ 13పై కూడా ఆఫర్స్ వస్తున్నాయి. అలాగే అందరూ కొనగలిగే అందుబాటు ధరలోనే ఐఫోన్ 13 రాబోతోంది. ఈ విషయం తెలుసుకున్న వినియోగదారులు ఎగిరి గంతేస్తున్నారు. అది కూడా అంతా ఇంతా కాదు.. ఏకంగా రూ.20 వేల వరకు ప్రైస్ తగ్గనుంది. చాలామంది ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నారు.

ఐఫోన్ అనేది ఈరోజుల్లో స్టేటస్ సింబల్ అయిపోయింది. అంతేకాకుండా ఈరోజుల్లో జరుగుతున్న సైబర్ మోసాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి కూడా ఐఫోన్ ని వాడుతున్నారు. అయితే ఐఫోన్ అనగానే ధర ఆకాశాన్ని అంటుతుందని అందరికీ తెలుసు. అందుకే చాలా మంది దాని జోలికి వెళ్లకుండా ఉంటారు. అయితే ఇప్పుడు అమెజాన్ బిగ్ బిలియన్ సేల్ లో మాత్రం ఐఫోన్లపై క్రేజీ డిస్కౌంట్స్ లభించనున్నాయి. ది బిగ్గెస్ట్ ఐఫోన్ సేల్ ఆఫ్ ది ఇయర్ అంటూ క్రేజీ ఆఫర్స్ ని వినియోగదారుల కోసం తీసుకొస్తున్నారు. అయితే మరీ ఇంత తక్కువకు ఐఫోన్ లభిస్తుందని ఎవరూ ఊహించడం లేదు. ఇప్పటికే ఈ ఆఫర్ కి సంబంధించి కొన్ని ప్రకటనలు కూడా చేశారు.

రూ.59,900 ఎమ్మార్పీ కలిగిన ఐఫోన్ 13 ఫోన్ ప్రైస్ ని చిన్నగా రివీల్ చేస్తున్నారు. 3-,-99గా రివీల్ చేశారు. అంటే ఎంత గరిష్టంగా చూసుకున్నా కూడా దాని రూ.39,999 మాత్రమే ఉంటుంది. కాబట్టి ఐఫోన్ 13 మీద దాదాపు రూ.20 వేల వరకు ఆఫర్స్ ఇస్తున్నారు. బ్యాంకు డిస్కౌంట్, ఎక్స్ ఛేంజ్ ఆఫర్ మొత్తం కలుపుకుని మీరు ఐఫోన్ 13ని రూ.39,999కే పొందో అవకాశం ఉంటుంది. ఐఫోన్ 13 ఫీచర్స్ చూస్తే.. 6.1 ఇంచెస్ సూపర్ రెటీనా ఎక్స్ డీఆర్ డిస్ ప్లే, అడ్వాన్స్డ్ డ్యూయల్ కెమెరా సిస్టమ్, 12 ఎంపీ ట్రూ డెప్త్ ఫ్రంట్ కెమెరా, స్మార్ట్ హెచ్ డీఆర్ 4, నైట్ మోడ్, 4కే డాల్బీ విజన్, ఏ15 బయోనిక్ చిప్ వంటి అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. మరి.. ఐఫోన్ 13పై అమెజాన్ అందిస్తున్న క్రేజీ డీల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet