ఐఫోన్‌ని తలదన్నే ఫోన్‌ని దించుతున్న కంపెనీ.. 7500 mAh బ్యాటరీ, బెటర్ కెమెరాతో!

Bigger Than iPhone: ఐఫోన్ ని కొట్టే ఫోన్ ఇప్పటివరకూ రాలేదు. కానీ ఐఫోన్ కి గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రముఖ కంపెనీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏకంగా బిగ్గర్ బ్యాటరీ సామర్థ్యంతో.. అత్యుత్తమ కెమెరా క్వాలిటీతో స్మార్ట్ ఫోన్ ని తయారు చేస్తున్నట్టు టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ధర కూడా ఐఫోన్ 13 కంటే తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

Bigger Than iPhone: ఐఫోన్ ని కొట్టే ఫోన్ ఇప్పటివరకూ రాలేదు. కానీ ఐఫోన్ కి గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రముఖ కంపెనీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏకంగా బిగ్గర్ బ్యాటరీ సామర్థ్యంతో.. అత్యుత్తమ కెమెరా క్వాలిటీతో స్మార్ట్ ఫోన్ ని తయారు చేస్తున్నట్టు టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ధర కూడా ఐఫోన్ 13 కంటే తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

ఐఫోన్ అంటే కెమెరా క్వాలిటీ. ఈ క్వాలిటీతో సినిమాలు తీసేయచ్చు. అంతలా ఐఫోన్ గుర్తింపు దక్కించుకుంది. ఉండేది 48 మెగా పిక్సెల్ కెమెరా కానీ సినిమా రేంజ్ లో షాట్స్ ని తీయచ్చు. అయితే బ్యాటరీ విషయంలో మాత్రం తక్కువ సామర్థ్యంతో వస్తుంది. దీని వల్ల యూజర్లు తమ వెంట పవర్ బ్యాంకులు పట్టుకెళ్లాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఐఫోన్ ని తలదన్నేలా ప్రముఖ కంపెనీ అత్యుత్తమ కెమెరా క్వాలిటీతో, అద్భుతమైన బ్యాటరీ బ్యాకప్ తో 5జీ స్మార్ట్ ఫోన్ ని లాంఛ్ చేసేందుకు సిద్ధమైందని టెక్ నిపుణులు చెబుతున్నారు. టెక్ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం నోకియా కంపెనీ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పోటీని తట్టుకోవడం కోసం అత్యుత్తమ ఫీచర్స్ తో ఫోన్ ని తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఒకప్పుడు టాప్ ఫోన్ తయారీ కంపెనీల్లో ఒకటిగా ఉన్న నోకియా ఆ తర్వాత పోటీలో వెనకబడిపోయింది. దీంతో ఈసారి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో నోకియా మ్యాజిక్ మ్యాక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ అత్యుత్తమ కెమెరా ఫీచర్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. 6.5 అంగుళాల డిస్ప్లేతో 120 హెడ్జెస్ రిఫ్రెష్ రేటుతో వస్తుంది. 8 జీబీ ర్యామ్ లేదా 12 జీబీ, 16 జీబీ, 16 జీబీ ర్యామ్ ఆప్షన్స్ తో వస్తుందట. 256 జీబీ లేదా 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తున్నట్లు సమాచారం. బ్యాటరీ ఏకంగా 7500 ఎంఏహెచ్ లేదా 7950 ఎంఏహెచ్ లేదా 8000 ఎంఏహెచ్ సామర్థ్యంతో వస్తున్నట్లు సమాచారం. 180 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుందట. ఒకసారి ఛార్జ్ చేస్తే మూడు రోజులు పవర్ బ్యాకప్ ఉంటుందని సమాచారం.

ఇక కెమెరా ఫీచర్స్ విషయానికొస్తే.. ప్రైమరీ కెమెరాగా 200 మెగా పిక్సెల్ కెమెరాని ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఐఫోన్ లో ఉన్న కెమెరాతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ. ఇక 50 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇవి కాకుండా మరో రెండు కెమెరాలు ఒకటి 64 మెగాపిక్సెల్, మరొకటి 48 మెగా పిక్సెల్ తో వస్తుందట. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ తో వస్తున్నట్లు సమాచారం. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంతో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 5జీ సీపీయూతో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దీని ధర విషయానికి వస్తే.. రూ. 44,900గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే భారత మార్కెట్లో లాంఛ్ చేయబోతున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ నిజమైతే కనుక ఈ బడ్జెట్ లో ఐఫోన్ తో పోలిస్తే ఈ నోకియా మ్యాజిక్ మ్యాక్స్ 5జీ బెటర్ స్మార్ట్ ఫోన్ అవుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

Show comments