iDreamPost
android-app
ios-app

iPhone, iPad యూజర్లకు కేంద్రం అలర్ట్!.. వెంటనే ఈ పనిచేయండి!

  • Published Aug 20, 2024 | 11:28 AM Updated Updated Aug 20, 2024 | 11:28 AM

iPhone, iPad: ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లకు బిగ్ అలర్ట్. కేంద్ర ప్రభుత్వం హై రిస్క్ వార్నింగ్ జారీ చేసింది. మీరు వెంటనే ఈ పని చేయండి. లేదంటే ఇబ్బందుల్లో పడతారు.

iPhone, iPad: ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లకు బిగ్ అలర్ట్. కేంద్ర ప్రభుత్వం హై రిస్క్ వార్నింగ్ జారీ చేసింది. మీరు వెంటనే ఈ పని చేయండి. లేదంటే ఇబ్బందుల్లో పడతారు.

iPhone, iPad యూజర్లకు కేంద్రం అలర్ట్!.. వెంటనే ఈ పనిచేయండి!

ఐఫోన్, ఐప్యాడ్ లకు వరల్డ్ వైడ్ గా ఫుల్ క్రేజ్ ఉంటుంది. మన దేశంలో కూడా ఫుల్ డిమాండ్ ఉంటుంది. సెలబ్రిటీలే కాదు ఇప్పుడు సామాన్యులు కూడా ఐఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. ఫోన్ కొంటే ఐఫోన్ మాత్రమే కొనాలనుకునే వారు కూడా ఎక్కువే. యాపిల్ ఉత్పత్తులకు ఇంత డిమాండ్ ఉండడానికి గల కారణం ఏంటంటే? వాటిల్లో ఉండే భద్రతాపరమైన ఫీచర్లు. ఈ సెక్యూరిటీ ఫీచర్ల కారణంగా యాపిల్ ఉత్పత్తులకు క్రేజ్ పెరిగింది. మరి మీరు కూడా ఐఫోన్, ఐప్యాడ్ లను యూజ్ చేస్తున్నారా? అయితే మీకు బిగ్ అలర్ట్. కేంద్ర ప్రభత్వం హైరిస్క్ వార్నింగ్ జారీ చేసింది. మీరు వెంటనే ఈ పని చేయండి.

ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. కొన్ని యాపిల్ ప్రొడక్ట్స్ లో కస్టమర్ల భద్రతకు ముప్పు కలిగించే సాంకేతిక లోపాలను ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్ గుర్తించింది. ఈ లోపాలను ఆసరాగా చేసుకుని సైబర్ క్రిమినల్స్, హ్యాకర్లు వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సెర్ట్ ఇన్ తెలిపింది. లోపాల కారణంగా ఐఫోన్, ఐప్యాడ్ పరికారల సాఫ్ట్ వేర్ లు ప్రభావితం కావొచ్చని ప్రభుత్వం జారీ చేసిన హై రిస్క్ హెచ్చరికలలో పేర్కొంది. హ్యాకర్ల భారిన పడకుండా ఉండాలంటే వెంటనే యాపిల్ నుంచి సరికొత్త సాఫ్ట్ వేర్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది.

లేదంటే హ్యాకర్లు విజృంభిస్తారని తెలిపింది. ఈ క్రమంలో ప్రమాదం పొంచిఉన్న పరికరాల జాబితాను రిలీజ్ చేసింది. 17.6, 16.7.9కి ముందున్న ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ వెర్షన్ లు, 14.6కి ముందు మ్యాక్ఓఎస్ సొనోమా వెర్షన్ లు, 13.6.8కి ముందు మ్యాక్ ఓఎస్ వెంచురా వెర్షన్లు, 12.7.6కి ముందు మ్యాక్ ఓఎస్ మాంటెరీ వెర్షన్ లు, 10కి ముందు వాచ్ ఓఎస్ వెర్షన్ లు, 17.6కి ముందు టీవీఓఎస్ వెర్షన్ లు, 1.3కి ముందు విజన్ ఓఎస్ వెర్షన్ లు, 17.6కి ముందు సఫారీ వర్షన్ లుకు ముప్పు పొంచి ఉందని తెలిపింది. అయితే గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం యాపిల్ ప్రొడక్టులకు హైరిస్క్ వార్నింగ్ జారీ చేసిన విషయం తెలిసిందే.