iDreamPost
android-app
ios-app

15 వేల స్మార్ట్ వాచ్ కేవలం 1300లకే.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే..

  • Published Apr 10, 2024 | 6:31 PM Updated Updated Apr 10, 2024 | 6:31 PM

స్మార్ట్ వాచ్ పై కళ్లు చెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. 15 వేలు విలవ చేసే స్మార్ట్ వాచ్ ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో కేవలం రూ. 1300లకే లభిస్తోంది. యువతను కట్టిపడేస్తున్న ఫీచర్లు.

స్మార్ట్ వాచ్ పై కళ్లు చెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. 15 వేలు విలవ చేసే స్మార్ట్ వాచ్ ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో కేవలం రూ. 1300లకే లభిస్తోంది. యువతను కట్టిపడేస్తున్న ఫీచర్లు.

  • Published Apr 10, 2024 | 6:31 PMUpdated Apr 10, 2024 | 6:31 PM
15 వేల స్మార్ట్ వాచ్ కేవలం 1300లకే.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే..

టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తోంది. ఆధునిక టెక్నాలజీతో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచ్ లు ఇలా ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇటీవల కాలంలో స్మార్ట్ వాచ్ ల వినియోగం ఎక్కువై పోయింది. యువత స్మార్ట్ వాచ్ ల వాడకం పట్ల తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్మార్ట్ వాచ్ కేవలం టైమ్ కోసం మాత్రమే కాకుండా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన అలర్ట్స్ ఇస్తుండడంతో వీటి వినియోగం పెరిగింది. మరి మీరు కూడా స్మార్ట్ వాచ్ కొనాలనుకుంటున్నారా? అయితే ఫైర్ బోల్ట్ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్ పై బంపరాఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో రూ. 15 వేలు విలువ చేసే స్మార్ట్ వాచ్ కేవలం 1300లకే సొంతం చేసుకోవచ్చు.

మార్కెట్ లో క్రేజీ ఫీచర్లతో ప్రముఖ కంపెనీలకు చెందిన స్మార్ట్ వాచ్ లు విరివిగా లభ్యమవుతున్నాయి. స్మార్ట్ ఫోన్ తో లింక్ చేసుకుని వాడే అవకాశం ఉండడంతో స్మార్ట్ వాచ్ లకు ఆదరణ పెరిగింది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో ఫైర్ బోల్ట్ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్ నింజా కాల్ ప్రో మాక్స్ 2.01 పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఏకంగా 91 శాతం తగ్గింపు అందిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ. 14,999 కాగా డిస్కౌంట్ లో భాగంగా రూ. 1,299కే దక్కించుకోవచ్చు. అంటే మీకు రూ. 13,700 ఆదా అవుతుంది. అంతే కాదు మీరు 118 ఈఎంఐతో కూడా ఈ స్మార్ట్ వాచ్ ను కొనుగోలు చేయొచ్చు.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో ఫైర్ బోల్ట్ బ్రాండ్ కు చెందిన నింజా కాల్ ప్రో మాక్స్ 2.01 మోడల్ స్మార్ట్ వాచ్ ను కిందటి నెలలో 5 వేలకు పైగా కొనుగోలు చేశారు. ఈ స్మార్ట్ వాచ్ స్క్రీన్ సైజ్ 2.01 అంగుళాలను కలిగి ఉంది. బ్లూటూత్ కాలింగ్ సదుపాయం కలిగి ఉంది. అలాగే హెల్త్ సూట్, వాయిస్ అసిస్టెన్స్ కూడా ఉంది. ఈ వాచ్ పూర్తిగా మెటల్ బాడీతో తయారుచేశారు. దీనికి 120కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. ఇది 240*296 పిక్సెల్ హై రిజల్యూషన్‌తో.. 320 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగివుంది. ఈ వాచ్ ని ఒకసారి ఛార్జ్ చేస్తే 7 రోజులు వినియోగించుకోవచ్చు. బ్యాటరీ 100శాతానికి చేరుకోవడానికి వాచ్‌ను 2 గంటల పాటు ఛార్జ్ చేయాలి. ఈ స్మార్ట్ వాచ్ లో హార్ట్ రేట్, స్లీప్, స్పోర్ట్స్ ట్రాకింగ్ వంటివి చూసుకోవచ్చు. కాల్స్, మెసేజెస్, ఇమెయిల్‌లు, సోషల్ మీడియా నోటిఫికేషన్‌లను చూడొచ్చు. మరి మీరు ఈ స్మార్ట్ వాచ్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet