iDreamPost
android-app
ios-app

ఆఫర్ అదిరిపోయింది.. ఆ సామ్‌సంగ్ ఫోన్‌పై 48 వేల ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్

  • Published Aug 22, 2024 | 7:15 AM Updated Updated Aug 22, 2024 | 7:15 AM

Samsung Galaxy S24 Ultra 5G: స్మార్ట్ ఫోన్ ప్రియులకు అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారీ డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవచ్చు. 48 వేల ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

Samsung Galaxy S24 Ultra 5G: స్మార్ట్ ఫోన్ ప్రియులకు అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారీ డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవచ్చు. 48 వేల ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

  • Published Aug 22, 2024 | 7:15 AMUpdated Aug 22, 2024 | 7:15 AM
ఆఫర్ అదిరిపోయింది.. ఆ సామ్‌సంగ్ ఫోన్‌పై 48 వేల ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్

కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. మొబైల్ లవర్స్ కు కళ్లు చెదిరే డీల్ అందుబాటులో ఉంది. భారీ ఎక్స్ ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్ తో సామ్ సంగ్ స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ తమ సేల్ ను పెంచుకునేందుకు కస్టమర్లను ఆకర్షించేందుకు బిగ్ డీల్ ప్రకటించింది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారీ డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవచ్చు. బెస్ట్ ఫీచర్లు కోరుకునే వారు ఈ ఫోన్ పై ఓ లుక్కేయండి. ఈ ఫోన్ పై ఏకంగా 48 వేల ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు.

200 మెగాపిక్సెల్‌ కెమెరా ఉన్న సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా 5జీ స్మార్ట్‌ఫోన్‌ బెస్ట్ కెమెరా కోసం చూసే వారికి బెస్ట్ ఆప్షన్. ఈ ఫోన్ ను స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ తో రూ. 48,100 వరకు తగ్గింపు పొందొచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే తగ్గింపు మీ పాత ఫోన్, బ్రాండ్ కంపెనీ ఎక్స్‌ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుంది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా 5జీ స్మార్ట్‌ఫోన్‌ 12 జీబీ ర్యామ్+256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ ధర రూ. 1,39,999 గా ఉంది. స్పెషల్ ప్రైస్ ఆఫర్ కింద మరో 9 వేలు తగ్గుతుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే మీకు రూ.6,000 తగ్గింపు లభిస్తుంది.

48 thousand discount on SAMSUNG galaxy S24 ultra 5G

మీరు ఫోన్ కొనుగోలు చేయడానికి ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగిస్తే, మీకు 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్‌లో 6.8-అంగుళాల క్వాడ్ హెచ్ డీ + డిస్‌ప్లేను అందిస్తోంది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ ప్రాసెసర్‌ తో వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో ఎల్ ఈడీ ఫ్లాష్‌తో కూడిన నాలుగు కెమెరాలు ఉంటాయి. వీటిలో 200 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో కూడిన 50 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్, 10 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం ఫోన్‌లో 12 మెగాపిక్సెల్ కెమెరాను అందిస్తోంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom