టీమిండియా మాపై పగ తీర్చుకోవాలని చూస్తోంది: ట్రావిస్‌ హెడ్‌

టీమిండియా మాపై పగ తీర్చుకోవాలని చూస్తోంది: ట్రావిస్‌ హెడ్‌

Travis Head, India vs Australia, T20 World Cup 2024: ఆసీస్‌ స్టార్‌ బ్యాటర్‌ ట్రావిస్‌ హెడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా తమపై పగ తీర్చుకోవాలని చూస్తోంది అంటూ భయం వ్యక్తం చేశాడు. కానీ, దాని వెనుక ఉన్న అర్థం వేరేలా ఉంది. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం..

Travis Head, India vs Australia, T20 World Cup 2024: ఆసీస్‌ స్టార్‌ బ్యాటర్‌ ట్రావిస్‌ హెడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా తమపై పగ తీర్చుకోవాలని చూస్తోంది అంటూ భయం వ్యక్తం చేశాడు. కానీ, దాని వెనుక ఉన్న అర్థం వేరేలా ఉంది. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో టీమిండియా తమపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోందని ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ పేర్కొన్నాడు. ఈ టీ20 వరల్డ్‌ కప్‌లో ఇండియా-ఆస్ట్రేలియా జట్లు ఫైనల్‌ ఆడాలని భారత క్రికెట్‌ అభిమానులు బలంగా కోరుకుంటున్నారని హెడ్‌ అన్నాడు. మొన్నటి వరకు ఐపీఎల్‌లో అదరగొట్టిన ట్రావిస్‌ హెడ్‌ను తెలుగు క్రికెట్‌ అభిమానులు నెత్తిన పెట్టుకున్నారు. కానీ, ఇప్పుడు హెడ్‌ ఏమో టీమిండియా తమపై పగ తీర్చుకోవాలని చూస్తోంది అంటూ కామెంట్‌ చేశాడు. అసలు భారత్‌ వాళ్లపై ఎందుకు పగతీర్చుకుంటుందో ఇప్పుడు చూద్దాం..

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్‌ వరకు దూసుకెళ్లింది. కానీ, ఫైనల్లో ఆస్ట్రేలియా చేతుల్లో ఓటమి పాలైంది. ఆ మ్యాచ్‌ 100 కోట్ల మందికి పైగా భారత క్రికెట్‌ అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. అలాగే వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్స్‌ ఫైనల్‌లోనూ ఆస్ట్రేలియా.. ఇండియాను ఓడించింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోను ఆస్ట్రేలియా టీమిండియా ఆశలపై నీళ్లు పోసింది. అందుకే టీమిండియా ఆస్ట్రేలియాపై పగతీర్చుకోవాలని భావిస్తున్నట్లు హెడ్‌ అభిప్రాయపడుతున్నాడు.

హెడ్‌ మాట్లాడుతూ.. ‘టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌‌లో భారత్-ఆస్ట్రేలియా పోటీ పడితే ఎంతో బాగుంటుంది. ఈ రెండు జట్లు తలపడాలని ఇండియాలో ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మాపై ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా తప్పక కోరుకుంటుంది. ఫైనల్స్‌కు ఇరు జట్లు వస్తే మ్యాచ్ మాత్రం ఒక రేంజ్‌లో ఉండటం ఖాయం. ఫైనల్స్‌కు ఆస్ట్రేలియా అలాగే ఇండియా కూడా రావాలని కోరుకుంటున్నా.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. మేం కూడా ఇండియాపై ఫైట్‌కి సిద్ధంగా ఉన్నాం. టాప్-4లో టీమిండియా కచ్చితంగా ఉంటుంది. అయితే ఎటాకింగ్ గేమ్ ఆడటం ఆ జట్టుకు ఎంతో కీలకం. రోహిశర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రాతో భారత్‌ బలంగా ఉంది.’ అని హెడ్‌ పేర్కొన్నాడు. మరి టీమిండియా గురించి చేసిన వ్యాఖ్యలతో హెడ్‌ భయం వ్యక్తం చేశాడా? లేక ఇండియాపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నాడా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments