Irfan Pathan Abour SKY: వీడియో: నా చివరి శ్వాస వరకు అతనికి రుణపడి ఉంటా! కన్నీళ్లు పెట్టుకున్న ఇర్ఫాన్‌ పఠాన్‌

వీడియో: నా చివరి శ్వాస వరకు అతనికి రుణపడి ఉంటా! కన్నీళ్లు పెట్టుకున్న ఇర్ఫాన్‌ పఠాన్‌

Irfan Pathan Abour SKY: నిన్న జరిగిన మ్యాచ్ లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీని సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విక్టరీపై ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంతో బాధలో ఉన్న తనకు ఈ మ్యాచ్ విజయం ఎంతో ఊరటనిచ్చిందని అన్నారు. ఈ క్రమంలో సూర్య కుమార్ యాదవ్ కి రుణపడి ఉంటా అని అన్నారు.

Irfan Pathan Abour SKY: నిన్న జరిగిన మ్యాచ్ లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీని సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విక్టరీపై ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంతో బాధలో ఉన్న తనకు ఈ మ్యాచ్ విజయం ఎంతో ఊరటనిచ్చిందని అన్నారు. ఈ క్రమంలో సూర్య కుమార్ యాదవ్ కి రుణపడి ఉంటా అని అన్నారు.

ఇప్పటి వరకూ జరిగిన మ్యాచులన్నీ ఒక ఎత్తు అయితే నిన్న ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఒక ఎత్తు. ఓటమి అంచులకు వెళ్లిపోయిన టీమిండియా భారీ విక్టరీతో టీ20 ప్రపంచ కప్ ని ముద్దాడింది. ఈ క్షణాలు టీమిండియా ప్లేయర్స్ కి మాత్రమే కాకుండా యావత్ భారత క్రికెట్ అభిమానులందరికీ మధురమైనవే. టెన్షన్ పెడితే పెట్టారు కానీ కిక్ ఇచ్చే విక్టరీతో మీసం మెలేశారు. కాగా ఈ విజయం మీద మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించారు. ప్రముఖ ఛానల్ లోని కామెంటరీ టీమ్ తో మాట్లాడుతున్న ఆయన ఉన్నట్టుండి ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. గత కొన్ని రోజులుగా వ్యక్తిగత జీవితంపరంగా తీవ్ర దుఃఖంలో ఉన్న పఠాన్ కి టీమిండియా విజయం ఎనలేని ఆనందాన్ని నింపింది.

20 ఓవర్లలో ఇండియా 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సౌతాఫ్రికా 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.  దీంతో ఇండియా 7 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. ఈ మ్యాచ్ విన్నింగ్ పై ఇర్ఫాన్ పఠాన్ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ‘జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలకు నా కృతజ్ఞతలు. సూర్యకుమార్ యాదవ్.. నువ్వు పట్టిన క్యాచ్ ని నా జీవితంలో మర్చిపోలేను. డేంజరస్ బ్యాట్స్ మెన్ అయిన డేవిడ్ మిల్లర్ క్యాచ్ ని పట్టావ్. ఆ సమయంలో నాకు ఊపిరి ఆడడం లేదు. 20వ ఓవర్ లో ఆ బాల్ సిక్స్ బౌండరీలో పడితే ఇండియా ఓటమి పాలయ్యేది. సూర్య కుమార్ యాదవ్ గేమ్ ఛేంజర్ లా వచ్చాడు. నేను 10 రోజులుగా చాలా బాధలో ఉన్నాను. ఆ విషయం టీమిండియాకు తెలియదు. కానీ ఈ విజయం నా జీవితంలో సంతోషాన్ని నింపింది. లవ్ యూ టీమిండియా’ అంటూ ఇర్ఫాన్ పఠాన్ లైవ్ లోనే ఏడ్చేశారు.

ఇర్ఫాన్ పఠాన్ మేకప్ ఆర్టిస్ట్ మరణం ఆయన లైఫ్ లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇటువంటి సమయంలో టీమిండియా విక్టరీ కాస్త ఉపశమనాన్ని ఇచ్చింది. నిజమే చివరి ఓవర్ వరకూ చాలా టెన్షన్ పడ్డారు క్రికెట్ ఫ్యాన్స్. సూర్యకుమార్ యాదవ్ మెరుపు క్యాచ్ తో మ్యాచ్ మలుపు తిరిగిపోయింది. 17 బాల్స్ కి 21 పరుగులు చేశాడు డేవిడ్ మిల్లర్. ఈ డేవిడ్ అవుట్ అయితే మ్యాచ్ గెలుస్తామన్న చిన్న నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని సూర్యకుమార్ యాదవ్ నిజం చేశాడు. అందుకే సూర్య కుమార్ యాదవ్ పట్టిన ఈ స్టన్నింగ్ క్యాచ్ ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటా అని అన్నారు. మరి ఇర్ఫాన్ పఠాన్ భావోద్వేగానికి గురవ్వడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Show comments