SNP
SNP
జింబాబ్వే దిగ్గజ మాజీ క్రికెటర్ హీత్ స్ట్రీక్ కేన్సర్‌తో మరణించాడని వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఆయన ఇంకా బతికే ఉన్నారంటూ జింబాబ్వే మాజీ క్రికెటర్ హెన్రీ ఒలొంగా వెల్లడించారు. దీంతో.. క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లెజెండరీ క్రికెటర్ స్ట్రీక్ మరణించాడనే వార్త.. క్రికెట్ వర్గాల్లో దావానంలో వ్యాపించింది. చాలా మంది క్రికెటర్లు సైతం స్ట్రీక్ మృతికి సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు సైతం పెట్టారు. జాతీయ ప్రముఖ న్యూస్ ఛానెల్స్ కూడా స్ట్రీక్ మరణానికి ధృవీకరిస్తూ.. కథనాలు ప్రచురించాయి. అయితే.. ఒలొంగా మాత్రం స్ట్రీక్ ఇంకా బతికే ఉన్నాడంటూ పేర్కొనడంతో మరణ వార్తలో నిజం లేదని తేలింది.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ వెలుగు వెలిగిన స్ట్రీక్ కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన సౌతాఫ్రికాలో లివర్ కేన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ ఆయన మరణించారనే వార్త ఈ రోజు ఉదయం నుంచి తెగ వైరల్ అవుతుంది. 49 ఏళ్ల వయసులోనే దిగ్గజ క్రికెటర్ కన్నుమూశారనడంతో క్రికెట్ ప్రపంచం మొత్తం విషాదంలో మునిగిపోయింది. కానీ, నిజం తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.
1993లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన స్ట్రీక్.. 12 ఏళ్ల పాటు సుదీర్ఘ కెరీర్‌ను కొనసాగించాడు. 2000-2004 మధ్య జింబాబ్వే జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. 12 ఏళ్ల కెరీర్‌లో 65 టెస్టులు, 189 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 1990 పరుగులు, వన్డేల్లో 2943 రన్స్ సాధించాడు. జింబాబ్వే తరఫున 100 టెస్టు వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. 1993లో పాకిస్తాన్‌తో జరిగని టెస్టు మ్యాచ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన స్ట్రీక్.. రావాల్పిండి వేదికగా జరిగిన తన రెండో టెస్టులో ఏకంగా 8 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. 2005లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్ట్రీక్.. 2007లో భారత వేదికగా ప్రారంభమైన మొట్టమొదటి ఫ్రాంచైజ్ లీగ్ ఐసీఎల్ (ఇండియన్ క్రికెట్ లీగ్)లో కూడా ఆడాడు. ఆ తర్వాత పూర్తిగా క్రికెట్ నుంచి తప్పుకున్నాడు.
UPDATE: Former Zimbabwe cricketer Heath Streak’s teammate Henry Olonga says that Heath Streak is alive and rumours of his demise “greatly exaggerated”
Note: Tweet mentioning Heath Streak’s deleted till further clarity is received. A number of Zimbabwean cricketers including… pic.twitter.com/4C8DXTz6oW
— ANI (@ANI) August 23, 2023
Heath Streak said “It’s a total rumour & lie – I am alive & well, I am very upset to learn that something as big as someone apparently passing can be spread unverified especially in our day & age – I believe the source should apologise, I am hurt by the news”. [Mid-day] pic.twitter.com/eyHlZeZHg4
— Johns. (@CricCrazyJohns) August 23, 2023
ఇదీ చదవండి: సచిన్ టెండుల్కర్‌కు కీలక బాధ్యతలు..మూడేళ్ల పాటు..