బ్రేకింగ్: టీ20లకు వీడ్కోలు పలికిన 37 ఏళ్ల స్టార్ క్రికెటర్!

బ్రేకింగ్: టీ20లకు వీడ్కోలు పలికిన 37 ఏళ్ల స్టార్ క్రికెటర్!

తాజాగా ఓ 37 ఏళ్ల స్టార్ క్రికెటర్ తన టీ20 కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

తాజాగా ఓ 37 ఏళ్ల స్టార్ క్రికెటర్ తన టీ20 కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

మరికొద్ది రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో టోర్నీలో పాల్గొనే అన్ని జట్లు తమ ప్లాన్స్ ను సిద్ధం చేసుకునే పనిలోపడ్డాయి. ఇక వరల్డ్ కప్ జట్టులో చోటు లభించని ఆటగాళ్లు నిరాశలో తమ కెరీర్ కు వీడ్కోలు పలుకుతున్నారు. ఇటీవలే న్యూజిలాండ్ టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ కొలిన్ మున్రో తన ఇంటర్నేషనల్ కెరీర్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. పొట్టి ప్రపంచ కప్ టీమ్ లో చోటు దక్కకపోవడంతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక తాజాగా ఓ 37 ఏళ్ల స్టార్ క్రికెటర్ తన టీ20 కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

సాధారణంగా క్రికెట్ ప్లేయర్లు జట్టులో అవకాశాలు రాక, ఏజ్ పైబడి తమ క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెబుతూ ఉంటారు. మరికొందరు ఏదో ఒక ఫార్మాట్ కు వీడ్కోలు పలికి మిగిలిన ఫార్మాట్స్ లో కొనసాగుతారు. తాజాగా జింబాబ్వేకు చెందిన స్టార్ ఆల్ రౌండర్ సీన్ విలియమ్స్ తన టీ20 కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బంగ్లాదేశ్ తో తాజాగా ముగిసిన టీ20 సిరీస్ తర్వాత అతడు తన నిర్ణయాన్ని ప్రకటించాడు. అయితే వన్డే, టెస్ట్ ఫార్మాట్స్ లో కొనసాగుతానని తెలిపాడు. ఇక సీన్ విలియమ్స్ కెరీర్ విషయానికి వస్తే.. జింబాబ్వే తరఫున 14 టెస్టుల్లో 1034 రన్స్,  156 వన్డేల్లో 4986, 81 టీ20ల్లో 1691 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ లో టెస్టుల్లో 21, వన్డేల్లో 83, టీ20ల్లో 48 వికెట్లను పడగొట్టాడు. 2005లో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే ద్వారా క్రికెట్ లోకి అడుగుపెట్టిన విలియమ్స్ జట్టుకు స్టార్ ఆల్ రౌండర్ గా సేవలు అందించాడు.

Show comments