2011 వరల్డ్‌ కప్‌ గెలిచిన జట్టుకి.. ఈ వరల్డ్‌ కప్‌ టీమ్‌కి తేడా ఉంది: యువీ

వరల్డ్‌ కప్‌ 2023 కోసం ఇటీవల భారత సెలెక్టర్లు 15 మందితో కూడిన ఇండియన్‌ స్క్వౌడ్‌ను ప్రకటించారు. ఈ జట్టుపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. జట్టు ఫలాన ఆటగాళ్లకు చోటు ఇవ్వాల్సిందని, ఎంపిక చేసిన ఆటగాళ్లలో వీళ్లు అవసరం లేదంటూ ఎవరి వాదనను వాళ్లు వినిపిస్తున్నారు. ఆ వాదనలను కాసేపు పక్కనపెడితే.. ఈ సారి వన్డే వరల్డ్‌ కప్‌ను ఏ జట్టు గెలుస్తుందనే విషయంపై కూడా చాలా మంది భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది మాజీ క్రికెటర్లు తమతమ ఫేవరేట్‌ జట్లను ప్రకటించాయి. చాలా మంది ఓ నాలుగు టీమ్స్‌ను వరల్డ్‌ కప్‌ నెగ్గే ఛాన్స్‌ ఉన్న జట్లుగా ప్రకటించారు.

అయితే.. దాదాపు అందరూ ఒకేలా ఫేవరేట్‌ జట్లను ప్రకటించారు. అందులో టీమిండియా కూడా ఒక ఫేవరేట్‌ జట్టుగా ఉంది. పైగా ఈ వరల్డ్ కప్‌ స్వదేశంలో జరుగుతున్న నేపథ్యంలో టీమిండియాకు భారీ అడ్వాంటేజ్‌ ఉంటుందని మాజీ క్రికెటర్లు, క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. అయితే.. వరల్డ్‌ కప్‌ కోసం ప్రకటించిన జట్టు చూసిన తర్వాత మాత్రం కాస్త లెక్క మారినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే టీమిండియాను వరల్డ్‌ కప్‌ ఫేవరేట్స్‌లో ఒకటిగా భావించిన చాలా మంది మాజీలు.. భారత వరల్డ్‌ కప్‌ టీమ్‌ చూసిన తర్వాత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జట్టులో ఒకే ఒక క్వాలిటీ స్పిన్నర్‌ ఆడటం, ఆఫ్‌ స్పిన్నర్‌ లేకపోవడం, లెఫ్ట్‌ హ్యాండర్‌ బ్యాటర్లు లేకపోవడం లాంటివి మైనస్‌గా మారొచ్చని అంటున్నారు.

వీటన్నింటికీ మించి.. టీమిండియా మాజీ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌, 2011లో టీమిండియా వరల్డ్‌ కప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించిన యువరాజ్‌ సింగ్‌ తాజా టీమిండియా వరల్డ్‌ కప్‌ నెగ్గుతుందా? అనే ప్రశ్నపై స్పందిస్తూ.. 2011 విజయాన్ని టీమిండియా రిపీట్‌ చేయాలని తామంతా కోరుకుంటున్నామని, కానీ.. 2011 వరల్డ్‌ కప్‌ టీమ్‌ ఒత్తిడిలో అద్భుతమైన ప్రదర్శన చేసిన మెరిసిందని.. 2023 వరల్డ్‌ కప్‌ టీమ్‌ మాత్రం మంచి ప్రదర్శన చేయాలనే ఒత్తిడిలో ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీన్ని మార్చడానికి మనకు తగినంత సమయం ఉందా? మనం ఈ ఒత్తిడిని ఉపయోగించి ‘గేమ్ ఛేంజర్’గా మారగలమా? అంటూ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం యువీ ట్వీట్‌ చర్చనీయాంశంగా మారింది. థమ్స్‌అప్‌ యాడ్‌లో చేస్తూ.. టీమిండియా వరల్డ్‌ కప్‌ నెగ్గుతుందా? మీ అభిప్రాయం ఏంటీ? అనే యాడ్‌ క్యాంపెన్‌ మొదలుపెట్టింది. తన ట్వీట్‌లో థమ్స్‌అప్‌, ఇండియాగెలుస్తుందా? అనే హ్యాష్‌ ట్యాగ్‌లు పెట్టి యువీ ఈ ట్వీట్‌ చేశాడు. మరి యువీ ట్వీట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆసియా కప్‌ కోసం నిప్పులపై నడిచాడు! తీరా చూస్తే ఇలా..

Show comments